Commonwealth Championships
-
గగన్ నారంగ్ కు రజతం
గోల్డ్ కోస్ట్: కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు కూడా భారత షూటర్ల హవా కొనసాగింది. తొలుత 50మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్ లో భారత షూటర్ గగన్ నారంగ్ రజత పతకాన్ని కైవసం చేసుకోగా, ఆపై అదే ఈవెంట్ లో మరో భారత షూటర్ స్వప్నిల్ సురేశ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన సాంప్సన్ కు స్వర్ణ పతకం సాధించాడు. ఇక మహిళల 25 మీటర్ల పిస్టోల్ విభాగంలో భారత షూటర్ స్నురజ్ సింగ్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. నిన్నటి షూటింగ్ పోరులో భారత ఖాతాలో ఐదు పతకాలు చేరిన సంగతి తెలిసిందే. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. అందుబాటులో ఉన్న మూడు పతకాలను భారత షూటర్లు షాజర్ రిజ్వీ, ఓంకార్ సింగ్, జీతూ రాయ్ సొంతం చేసుకున్నారు. ఫైనల్లో షాజర్ రిజ్వీ 240.7 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణాన్ని దక్కించుకోగా... 236 పాయింట్లతో ఓంకార్ సింగ్ రజతం, 214.1 పాయింట్లతో జీతూ రాయ్ కాంస్యం సంపాదించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పూజా ఘాట్కర్ స్వర్ణం, అంజుమ్ మౌద్గిల్ రజతం గెలిచారు. -
భారత షూటర్లకు రెండు స్వర్ణాలు
బ్రిస్బేన్: తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంటూ భారత షూటర్లు కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మెరిశారు. పోటీల రెండో రోజు భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. అందుబాటులో ఉన్న మూడు పతకాలను భారత షూటర్లు షాజర్ రిజ్వీ, ఓంకార్ సింగ్, జీతూ రాయ్ సొంతం చేసుకున్నారు. ఫైనల్లో షాజర్ రిజ్వీ 240.7 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణాన్ని దక్కించుకోగా... 236 పాయింట్లతో ఓంకార్ సింగ్ రజతం, 214.1 పాయింట్లతో జీతూ రాయ్ కాంస్యం సంపాదించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పూజా ఘాట్కర్ స్వర్ణం, అంజుమ్ మౌద్గిల్ రజతం గెలిచారు. పూజా 249.8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా... అంజుమ్ 248.7 పాయింట్లతో రెండో స్థానాన్ని సంపాదించింది. పురుషుల స్కీట్ ఈవెంట్ క్వాలిఫయింగ్‌లో మేరాజ్ అహ్మద్ ఖాన్, అంగద్‌వీర్ సింగ్ బాజ్వా, షీరాజ్ షేక్ 119 పాయింట్లు చొప్పున స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత సాధించారు. పోటీల తొలి రోజు హీనా సిద్ధూ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్) స్వర్ణం... దీపక్ కుమార్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్) రజతం గెలిచారు. -
భారత్‌కు 14 పతకాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత రెజ్లర్లు మరోసారి తమ సత్తా చాటుకున్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత రెజ్లర్లు 14 పతకాలు గెల్చుకోవడంతోపాటు టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఇందులో ఏడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. ఈ టోర్నీలో ఒక్కో దేశం నుంచి ప్రతి వెయిట్ కేటగిరీలో గరిష్టంగా ఇద్దరు రెజ్లర్లు బరిలోకి దిగే అవకాశముంది. ఫ్రీస్టయిల్ విభాగంలోని మొత్తం ఏడు కేటగిరీల్లో భారత్‌కు పతకాలు రావడం విశేషం. సందీప్ తోమర్ (55 కేజీలు), జైదీప్ (60 కేజీలు), అమిత్ కుమార్ ధన్కర్ (66 కేజీలు), ప్రవీణ్ రాణా (74 కేజీలు), పవన్ కుమార్ (84 కేజీలు), సత్యవర్త్ (96 కేజీలు), జోగిందర్ కుమార్ (120 కేజీలు) పసిడి పతకాలు సాధించారు. నరేందర్ (55 కేజీలు), రవీందర్ సింగ్ (60 కేజీలు), నరేశ్ (84 కేజీలు), రోహిత్ పటేల్ (120 కేజీలు) రజత పతకాలు... అరుణ్ కుమార్ (66 కేజీలు), ప్రదీప్ (74 కేజీలు), హర్దీప్ (96 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు. 1985లో మొదలైన కామన్వెల్త్ రెజ్లింగ్ పోటీలను ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు.