అమిత్ షాపై బుద్దదేవ్ విమర్శనాస్త్రాలు
కోల్‌కతా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కారకుడైన వ్యక్తి ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారని అన్నారు. ఆయన నేతృత్వంలో ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ లో అత్యధిక ఎంపీలు స్థానాలు గెల్చుకుందని చెప్పారు.
అమిత్ షా పేరు ప్రస్తావించకుండా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని అన్నారు. మతతత్వ శక్తులకు కార్పొరేట్ సంస్థలు మద్దతు ఇస్తున్నాయని బుద్దదేవ్ అన్నారు.