అమిత్ షాపై బుద్దదేవ్ విమర్శనాస్త్రాలు | Buddhadeb Bhattacharjee hits out at BJP president Amit Shah | Sakshi
Sakshi News home page

అమిత్ షాపై బుద్దదేవ్ విమర్శనాస్త్రాలు

Published Tue, Aug 5 2014 11:17 PM | Last Updated on Mon, May 28 2018 3:58 PM

Buddhadeb Bhattacharjee hits out at BJP president Amit Shah

కోల్కతా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కారకుడైన వ్యక్తి ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారని అన్నారు. ఆయన నేతృత్వంలో ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ లో అత్యధిక ఎంపీలు స్థానాలు గెల్చుకుందని చెప్పారు.

అమిత్ షా పేరు ప్రస్తావించకుండా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని అన్నారు. మతతత్వ శక్తులకు కార్పొరేట్ సంస్థలు మద్దతు ఇస్తున్నాయని బుద్దదేవ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement