జగన్ హెచ్చరికతో బాధితులకు పరిహారం
విశాఖపట్నం: ‘దవళేశ్వరం వద్ద ప్రమాదంలో 22మంది చనిపోయారు. ఆ ప్రమాదం జరిగి 18 రోజులు అయినా బాధితులకు పరిహారం ఇవ్వరా?... ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా... నాలుగు రోజుల్లో పరిహారం ఇవ్వకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం.ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన అల్టిమేటం. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో గురువారం బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన ప్రభుత్వానికి ఈమేరకు హెచ్చరించారు. వై.ఎస్.జగన్ హెచ్చరికతో ప్రభుత్వ దిగివచ్చింది. రూ.2లక్షలు చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించి ఇన్నాళ్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన ప్రభుత్వంలో కదలిక వచ్చింది.
మతుల కుటుంబాలకు ప్రకటించిన రూ.2లక్షల పరిహారాన్ని శనివారం పంపిణీ చేయాలని నిర్ణయించింది. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు శనివారం మధ్యాహ్నం బాధిత కుటుంబాలకు ఈ మేరకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ‘వై.ఎస్.జగన్ రాకతోనే ప్రభుత్వం దిగివచ్చింది... ఇంతకాలం పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడైనా పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. జగన్ రాకపోయి ఉంటే మాకు పరిహారం దక్కేదే కాదు. ఆయన వచ్చి ఈ ప్రభుత్వం కళ్లు తెరిపించారు ’ అని బాధిత కుటుంబాల సభ్యులు చెబుతున్నారు.