Company Secretary course
-
సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో ప్రయోజనాలెన్నో!
చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్), కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ(సీఎంఏ).. ఈ మూడు కోర్సులకు.. కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులుగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది! కెరీర్ పరంగా.. ఎంబీఏకు దీటుగా ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు! ఇప్పుడు ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి.. మరో ప్రధానమైన గుర్తింపు లభించింది! అదే.. సీఏ, సీఎస్, సీఎంఏలను.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తత్సమాన కోర్సులుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ప్రకటించింది! అంటే.. ఇకపై ఈ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు.. నేరుగా పీజీ అర్హతతో లభించే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ స్థాయి హోదాతో విద్యార్థులకు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం... వాస్తవానికి సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సులకు పీజీ హోదా కల్పించాలని.. ఆయా కోర్సుల నిర్వాహక సంస్థలు ఐసీఏఐ, ఐసీఎస్ఐ, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.. కొన్ని నెలల క్రితమే యూజీసీకి విజ్ఞప్తి చేశాయి. దాంతో యూజీసీ ఈ కోర్సులకు పీజీ హోదా కల్పించే విషయంపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ఈ కోర్సుల స్వరూపాన్ని,శిక్షణను క్షుణ్నంగా పరిశీలించింది. వీటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ హోదా కల్పిం చొచ్చని యూజీసీకి సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుకు అనుగుణంగా ఇటీవల యూజీసీ అధికారిక ప్రకటన విడు దల చేసింది. ఈ కోర్సులను పీజీ కోర్సులకు తత్సమాన కోర్సులుగా భావించాలని దేశ వ్యాప్తంగా ఉన్న ఇన్స్టిట్యూట్లకు లేఖ రాసింది. పరిశోధనలకు ఊతం యూజీసీ నిర్ణయంతో సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులకు ఉన్నత విద్య,పరిశోధనల దిశగా అడుగులు వేసేందుకు అవకాశం లభిస్తుంది. ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు యూజీసీ–నెట్లో అర్హత సాధించి.. తమకు ఆసక్తి ఉన్న విభాగాల్లో పరిశోధనలు చేసే అవకాశం దక్కుతుంది. అంతేకాకుండా వీరు కామర్స్, మేనేజ్మెంట్, అకౌంటింగ్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఎంఫిల్, పీహెచ్‌డీల్లో చేరొచ్చు. పీజీ అర్హతగా ప్రవేశాలు కల్పించే ఇతర కోర్సుల్లోనూ అవకాశం లభించనుంది. అంతర్జాతీయంగా అవకాశాలు సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. వీటి ఉత్తీర్ణులకు అంతర్జాతీయంగానూ కెరీర్, ఉన్నత విద్య పరంగా అవకాశాలు విస్తృతం కాను న్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవడానికి తాజా నిర్ణయం దోహదపడుతుంది. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో పీజీ ఫైనాన్స్ స్పెషలైజేషన్ అర్హతగా ఉద్యోగాలు కల్పించే సంస్థల్లో వీరు అడుగు పెట్టేందుకు అవకాశం లభించనుంది. ఇప్పటికే ఒప్పందాలు వాస్తవానికి ఇప్పటికే ఐసీఏఐ,ఐసీఎస్ఐ, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.. పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఫలితంగా దాదాపు 80 దేశాల్లో ఈ కోర్సుల ఉత్తీర్ణులకు అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. తాజా నిర్ణయంతో ఇది మరింత విస్తృతం అవుతుంది. అంటే.. ఇకపై వీరు ప్రపంచంలో ఎక్కడైనా పీజీ అర్హతతో లభించే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను అందుకునేందుకు మార్గం ఏర్పడింది. కార్పొరేట్‌కు హాట్ కేక్ సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులు.. స్వదేశంలోనే కార్పొ రేట్ సంస్థలకు హాట్ కేక్‌లుగా మారుతున్నారు. ప్రధానంగా అకౌంటింగ్, ఫైనాన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ విభాగాల్లో కీలకమైన హోదాల్లో వీరిని నియమించుకునేందుకు సంస్థలు సిద్ధంగా ఉంటున్నాయి. సదరు ఇన్‌సిట్యూట్‌లతో కలిసి క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా రూ.లక్షల వార్షిక ప్యాకేజీలతో ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, కన్సల్టింగ్ సంస్థలు.. సీఏ, సీఎస్,సీఎంఏ ఉత్తీర్ణులకు పెద్దపీట వేస్తు న్నాయి. ఐఐఎంలలో మేనేజ్మెంట్ పీజీ చేసిన వారికి దీటుగా అవకాశాలు, ప్యాకేజీలు అందిస్తున్నాయి. సర్కారీ కొలువులూ యూజీసీ తాజా నిర్ణయంతో.. ప్రభుత్వ విభాగాల్లో పీజీ అర్హతతో భర్తీ చేసే పోస్ట్‌లకు కూడా సీఏ, సీఎస్, సీఎంఏ అభ్యర్థులకు అర్హత లభిస్తుంది. ముఖ్యంగా బ్యాం కింగ్ రంగంలో ఆర్బీఐ, ఇతర బ్యాంకులు పీజీ అర్హతగా భర్తీ చేసే స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్ట్‌లకు పోటీ పడే అవకాశం కలగనుంది. అదే విధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ రీజనల్ సెంటర్లు, యూఎన్ఓ అనుబంధ విభాగాల్లో.. పీజీ స్థాయి అర్హతతో నియామకాలు జరిపే పోస్ట్‌లకు కూడా వీరు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. అధ్యాపక వృత్తిలోకి సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులకు పీజీ హోదా కల్పించడం వల్ల యూజీసీ నెట్‌కు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. ఫలితంగా.. వారు పీహెచ్‌డీతోపాటు యూనివర్సిటీలు, ఇతర అకడమిక్ ఇన్స్టిట్యూట్లలో అధ్యాపక వృత్తిలోకి కూడా ప్రవేశం పొందొచ్చు. దీనిద్వారా యూజీసీ స్కేల్ ప్రకారం– నెలకు రూ.60వేలకు పైగా వేతనం పొందే అవకాశం కలగనుంది. ఫెలో ప్రోగ్రామ్‌లకు మార్గం సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో..ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లైన ఐఐఎంల్లో ఫెలో ప్రో గ్రామ్‌లలో ప్రవేశించేందుకు అర్హత లభించినట్లేనని చెప్పొ చ్చు. వాస్తవానికి ఇప్పటికే దేశంలోని అన్ని ఐఐఎంలు పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల పరంగా సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. వీరు క్యాట్‌కు హాజరయ్యేందుకు కూడా అర్హత లభిస్తోంది. తాజా నిర్ణ యంతో పీజీ ప్రోగ్రామ్‌లే కాకుండా.. ఆపై స్థాయిలో బోధిం చే ఫెలో ప్రోగ్రామ్‌ల్లో సైతం ప్రవేశం పొందే అవకాశం లభించనుంది. ఈ విషయంపై ఐఐఎం వర్గాల నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. 102 యూనివర్సిటీలు.. పీజీగా గుర్తింపు ఇప్పటికే దేశంలోని 102 యూనివర్సిటీలు సీఏ, సీఎస్ కోర్సులను పీజీ స్థాయికోర్సులుగా గుర్తిస్తున్నాయి. అవి అందించే పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి వీరికి అర్హత కల్పిస్తున్నాయి. అదే విధంగా జాతీయ స్థాయిలో మరో వందకు పైగా అకడమిక్ ఇన్స్టిట్యూట్లు, ఆరు ఐఐఎంలు, రెండు ఐఐటీలు.. సీఏ, సీఎస్ కోర్సులను పీజీకి సమానంగా గుర్తిస్తూ.. పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. తాజా నిర్ణయంతో దేశంలోని అన్ని యూనివర్సిటీలు వీటిని పీజీ కోర్సులకు సమానంగా గుర్తించి.. పీహెచ్‌డీలో చేర్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. నిత్యం అప్డేట్ చేస్తూ సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల నిర్వాహక ఇన్స్టిట్యూట్లు నిరంతరం తమ కోర్సులను అప్డేట్ చేస్తూ.. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు బోధన, శిక్షణ ఇస్తుండటం వల్లే వాటికి పీజీ హోదాను యూజీసీ ప్రకటించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్రెషర్స్ నుంచి ప్రాక్టీసింగ్ సీఏల వరకు అందరికీ.. ఇండస్ట్రీలోని తాజా మార్పులపై ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహి స్తున్నాయి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న డేటా అనలిటిక్స్, డేటాసైన్స్ వంటి అంశాల్లోనూ విద్యార్థులకు నైపుణ్యాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇలా ఇండస్ట్రీ రెడీగా విద్యార్థులను తీర్చిదిద్దుతుండటం వల్లే సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సులకు పీజీ స్థాయి హోదా లభించిందనే భావన నెలకొంది. ప్రయోజనం యూజీసీ తాజా నిర్ణయంతో ఈ మూడు కామర్స్ ప్రొఫె షనల్ కోర్సులు చదువుతున్న లక్ష మంది విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి పరంగా విస్తృత ప్రయోజనం చేకూరనుంది. సీఏ ఫైనల్ పరీక్షకు దాదాపు 25వేల నుంచి 30వేల మంది హాజరవుతుంటారు. సీఎస్, సీఎంఏ విద్యార్థుల సంఖ్య కూడా దాదాపు అంతే ఉంటుంది. ఉత్తీర్ణ త శాతం కొంత తక్కువగా ఉంటున్నప్పటికీ.. ఒకసారి విజయం సాధించలేని విద్యార్థులు మరోసారి పరీక్షల్లో పాస్‌అవుతున్నారు. మొత్తంగా చూస్తే యూజీసీ తాజా నిర్ణయంతో సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులకు అకడమిక్‌గా, కెరీర్ పరంగా మరింత ప్రోత్సాహం లభించినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదా.. ముఖ్యాంశాలు ► ఈ కోర్సులు పూర్తి చేసుకుంటే పీజీ డిగ్రీతో సమానం. ► దాని ఆధారంగా నెట్‌తోపాటు ఎంఫిల్, పీహెచ్‌డీలో చేరే అవకాశం. ► విదేశీ ఉద్యోగావకాశాలు విస్తృతమయ్యే ఛాన్స్. ► పీజీ అర్హతతో ఉండే ఉద్యోగాలకు పోటీ పడే వీలు. ► ఆర్బీఐ, ఐఐఎంలు, ఇతర ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో ఫెలోషిప్‌నకు మార్గం. ► దాదాపు లక్ష మంది విద్యార్థులకు ప్రయోజనకరంగా యూజీసీ నిర్ణయం. విద్యార్థులకు ఎంతో మేలు యూజీసీ తాజా నిర్ణయం సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సులు చదువుతున్న ఎందరో విద్యార్థులకు ప్రయోజన కరంగా నిలుస్తుంది. వారు నెట్ ద్వారా పరిశోధనలో పాల్గొనే అవకాశాలు పొందడమే కాకుండా.. విభిన్న కెరీర్స్ అందుబాటులోకి వస్తాయి. పీజీ హోదాతో విద్యార్థులు కూడా ఆయా కోర్సులు పూర్తి చేసేందుకు మరింత చురుగ్గా, కష్టపడి చదువుతారు. నిబద్ధతతో తక్కువ వయసులోనే ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేసే వీలుంది. – అభిషేక్ మురళి, సెక్రటరీ, ఐసీఏఐ–ఎస్‌ఐఆర్‌సీ -
కంపెనీ సెక్రటరీనా.. వెంటనే వచ్చి చేరండి!
కంపెనీ సెక్రటరీనా (సీఎస్).. అయితే మా సంస్థలో అవకాశం ఉంది.. వెంటనే వచ్చి చేరండి! ఇవీ కార్పొరేట్ కంపెనీల నుంచి సీఎస్‌లకు వస్తున్న ఆఫర్స్!! వీటిని బట్టి సీఎస్‌లకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోచ్చు. దాంతో ఇటీవల కాలంలో యువత.. సంస్థల నిర్వహణా నైపుణ్యాలను అందించే కంపెనీ సెక్రటరీ (సీఎస్) కోర్సు వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో.. కంపెనీ సెక్రటరీ కోర్సు తీరుతెన్నులు, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం.. కార్పొరేట్–టాప్ గేర్ సీఎస్ కోర్సు పూర్తిచేసుకొని.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) అసోసియేట్ మెంబర్షిప్ పొందిన అభ్యర్థులకు కార్పొరేట్ రంగం రెడ్ కార్పెట్ పరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూ.5కోట్లు అంతకంటే ఎక్కువ పెయిడప్ క్యాపిటల్ కలిగిన సంస్థలన్నీ పూర్తి స్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలనే నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అదేసమయంలో పలు కంపెనీల్లో అంతర్గత పారదర్శత లోపించడంతో వాటాదారులు(షేర్ హోల్డర్లు/భాగస్వాములు) అభద్రతకు లోనవుతున్నారు. దాంతో కార్పొరేట్ కంపెనీలు భాగస్వాముల విశ్వాసాన్ని నిలుపుకునేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కంపెనీ సెక్రటరీలను నియమించుకొని.. అంతర్గత కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దాంతో కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసిన వారికి మంచి కార్పొరేట్ అవకాశాలతోపాటు వేతనాల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. చదవండి: (విద్య, ఉద్యోగ సమాచారం) విధులు ఇవే ►కంపెనీ సెక్రటరీలు ప్రధానంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు షేర్ హోల్డర్లకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తారు. అలాగే కంపెనీస్ యాక్ట్–కంపెనీకి వర్తించే ట్యాక్సేషన్ నిబంధనలు,షేర్ హోల్డర్ల హక్కులు, బిజినెస్ స్వరూపం, చట్టబద్ధమైన నిబంధనలు, పరిశ్రమ, ఆర్థిక చట్టాలకు అనుగుణంగా అడ్మినిస్ట్రేషన్, కార్పొరేట్ పాలనా,విధులు సాగేలా చూస్తారు. ►కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న నిర్ణయాలను సమర్థంగా అమలయ్యేలా చూస్తారు. ►నిర్దేశిత చట్టాలు, నియమావళి మేరకు కంపెనీ పనిచేసేలా చర్యలు తీసుకుంటారు. ►కంపెనీ నిర్వహణ, పరిపాలనా స్వరూపం, నిర్ణయాల్లో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తారు. ►కంపెనీలో అంతర్గతంగా సమాచార సేకరణ, సదరు వివరాల విశ్లేషణ ద్వారా కంపెనీ డైరెక్టర్లకు నివేదికలు అందిస్తారు. తద్వారా కంపెనీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తోడ్పడతారు. ►కంపెనీ పనితీరు, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ►ఆర్థిక నిర్వహణ, ఆఫీస్ నిర్వహణ, మానవ వనరుల నిర్వహణ, కంపెనీ ఆస్తుల నిర్వహణ, రికార్డుల నిర్వహణను చేపడతారు. ►ఆడిట్ కమిటీకి సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఆదాయపన్ను శాఖకు సంబంధించిన ఫైలింగ్స్ సజావుగా జరిగేలా చూస్తారు. ఉద్యోగావకాశాలు ► నైపుణ్యవంతులైన కంపెనీ సెక్రటరీలకు అవకాశాలకు ఢోకా లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ బలపడుతుండటం.. విదేశీ కంపెనీలు సైతం భారత్‌లో కార్యకలాపాల నిర్వహణతోపాటు బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే దేశీయంగా వస్తున్న సరళీకరణ విధానాలు నూతన వ్యాపారాలకు నాంది పలుకుతున్నాయి. ఈ పరి ణామాలు సీఎస్‌లకు ఉద్యోగాల పరంగా ఆశాజనక పరిస్థితులను ఏర్పరుస్తున్నాయి. ►క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలకు ప్రైవేట్, పబ్లిక్, బ్యాంకింగ్ సెక్టార్లలో ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే స్టాక్ ఎక్ఛేంజ్‌లు, కంపెనీ అఫైర్స్ విభాగాలు, కంపెనీ లా బోర్డులు, ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే సీఎస్‌లు సొంతంగా కన్సెల్టెన్సీ బిజినెస్‌ను కూడా ప్రారంభించొచ్చు. కోర్సు పూర్తి చేసుకున్న వెంటనే రూ.25,000 వేతనంతో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అనుభవం, మెరుగైన అడ్మినిస్ట్రేటివ్, కమ్యూనికేషన్, మేనేజీరియల్ స్కిల్స్ ఉంటే సీఎస్ల వేతనాలు వేగంగా పెరుగుతున్నాయి. ►భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఓఎన్జీసీ, ఎంఎంటీసీ లిమిటెడ్ వంటి సంస్థల్లోనూ అవకాశాలు దక్కించుకోవచ్చు. జాబ్ రోల్స్ » కంపెనీ సెక్రటరీ » అసోసియేట్ కంపెనీ సెక్రటరీ » కంప్లయన్స్ ఆఫీసర్ » కంపెనీ రిజిస్ట్రార్ » లీగల్ అడ్వైజర్ » కార్పొరేట్ పాలసీ మేకర్ » చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ » ప్రిన్సిపుల్ సెక్రటరీ » కార్పొరేట్ ప్లానర్ వంటి హోదాలు లభిస్తాయి. అనుకూలతలు ►జాబ్ మార్కెట్లో సీఎస్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ►కెరీర్ గ్రోత్, వేతనాలు ఆకర్షణీయమని చెప్పొచ్చు. ►కార్పొరేట్ రంగంలో కంపెనీ సెక్రటెరీలకు మంచి గుర్తింపు లభిస్తోంది. ప్రతికూలతలు ►సీఎస్ కోర్సుకు విదేశాల్లో అంతగా గుర్తింపు లేదు. ►బాధ్యతలు, విధులు అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాల్సి ఉంటుంది. ఫలితంగా వృత్తిపరమైన ఒత్తిడి అధికం. ►పూర్తి వివరాలకు వెబ్సైట్: www.icsi.edu మూడు దశలు కంపెనీ సెక్రటరీ కోర్సులో మూడు దశలు ఉంటాయి. అవి.. ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. ఇంటర్/తత్సమాన అర్హతతో ఫౌండేషన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశించొచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులు నేరుగా ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందవచ్చు. ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఇందులో బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ లా; బిజినెస్ మేనేజ్మెంట్, ఎథిక్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్; బిజినెస్ ఎకనామిక్స్; ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ పేపర్లు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇది 8 పేపర్లు.. రెండు మాడ్యూల్స్‌గా ఉంటుంది. మాడ్యూల్ 1లో.. జ్యూరిస్ప్రుడెన్స్, ఇంటర్‌ప్రిటేషన్ జనరల్ లాస్; కంపెనీ లా; సెట్టింగ్ అప్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్ అండ్ క్లోజర్; ట్యాక్స్ లాస్ పేపర్లు ఉంటాయి. మాడ్యూల్ 2లో.. కార్పొరేట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్; సెక్యూరిటీస్ లాస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్; ఎకనామిక్, బిజినెస్ అండ్ కమర్షియల్ లాస్, ఫైనాన్షియల్ అండ్ స్ట్రాటజిక్æ మేనేజ్మెంట్ పేపర్లు ఉంటాయి. ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఇది 3 మాడ్యూల్స్.. 9 పేపర్లుగా ఉంటుంది. మాడ్యూల్ 1లో.. గవర్నెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, కాంప్లియన్స్ అండ్ ఎథిక్స్; అడ్వాన్స్డ్ ట్యాక్స్‌లాస్; డ్రాఫ్టింగ్, ప్లీడింగ్స్ అండ్ అప్పీరియెన్సెస్ పేపర్లు, మాడ్యూల్ 2లో.. సెక్రటేరియల్ ఆడిట్; కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్, రిజల్యూషన్ ఆఫ్ కార్పొరేట్ డిస్ప్యూట్స్ పేపర్లు, మాడ్యూల్ 3లో.. కార్పొరేట్ ఫండింగ్ అండ్ లిస్టింగ్ ఇన్ స్టాక్ ఎక్సే్ఛంజెస్; మల్టీ డిసిప్లినరీ కేస్ స్టడీస్, ఎలక్టివ్ సబ్జెక్ట్ పేపర్లు ఉంటాయి. ప్రాక్టికల్ ట్రైనింగ్ సీఎస్ కోర్సు పూర్తిచేసే క్రమంలో విద్యార్థులు రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా.. తప్పనిసరిగా అప్రెంటీస్‌షిప్ పేరుతో ఉండే ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ అప్రెంటీస్‌షిప్ గరిష్ట వ్యవధి మూడేళ్లు. అభ్యర్థులు సీఎస్ కోర్సు ఏ దశలో చేరారో దానికి అనుగుణంగా ఈ వ్యవధిలో మార్పు ఉంటుంది. -
అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేసే కోర్సు..కంపెనీ సెక్రటరీ
సీఎస్ కోర్సును ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) నిర్వహిస్తుంది. పద్దులు, చిట్టా లెక్కల గణింపు అంటే ఆందోళన చెందే విద్యార్థులకు, కార్యనిర్వాహక నైపుణ్యాలు సొంతం చేస్తూ.. అత్యున్నత కెరీర్‌కు బాటలు వేసే కోర్సు సీఎస్. దశలుగా: సీఎస్ కోర్సును ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అనే దశల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మినహాయింపు: సీఏ ఇంటర్, సీఏ ఫైనల్, సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్ పూర్తిచేసిన విద్యార్థలకు, కామర్స కోర్సుల్లో మాస్టర్స డిగ్రీలు కలిగి ఉన్న వారికి సీఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్లలోని కొన్ని పేపర్లు రాయాల్సిన అవసరం లేదు. ఆ మేరకు వీరికి మినహాయింపునిచ్చారు (పూర్తి వివరాలను సీఎస్ హెల్ప్ లైన్ నెంబర్ - 01141504444 ద్వారా తెలుసుకోవచ్చు). కోచింగ్: సీఎస్ ఔత్సాహికులకు కోచింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. సీఎస్ ఇన్స్టిట్యూట్ ప్రాంతీయ కార్యాలయాల్లో లేదా చాప్టర్లలో ఓరల్ కోచింగ్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనే ఆన్లైన్ ప్రోగ్రామ్‌ను కూడా ఇంటర్నెట్ ద్వారా అందిస్తుంది. ఈ లెర్నింగ్‌లో లైవ్ వర్చువల్ క్లాస్ రూమ్ విధానంలో లెక్చరర్సను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. కోర్సుకు సంబంధించిన సందేహాలను నిపుణులను అడిగి నివృత్తి చేసుకోవచ్చు. అవకాశాలు: మనదేశంలో ఒక మోస్తరు నుంచి భారీ స్థాయి కంపెనీలు లక్షల్లో ఉంటే.. అందుకు కావల్సిన కంపెనీ సెక్రెటరీల సంఖ్య వేలల్లో మాత్రమే ఉంది. ఈ గణాంకాలే డిమాండ్-సప్లయ్ వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 1956 కంపెనీల చట్టం ప్రకారం రూ. 5 కోట్ల అధీకృత మూలధనం ఉన్న ప్రతి సంస్థ ఒక పూర్తి స్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలి. దీంతో రానున్న రోజుల్లో ప్రతి కంపెనీకి కంపెనీ సెక్రటరీ తప్పనిసరి. కాబట్టి సీఎస్ కోర్సు పూర్తి చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలకు ఢోకా లేదని చెప్పొచ్చు. కార్పొరేట్ గవర్నెన్స అండ్ సెక్రటేరియల్ సర్వీసెస్, కార్పొరేట్ లాస్ అడ్వైజరీ అండ్ రిప్రజెంటేషన్ సర్వీసెస్, ఫైనాన్షియల్ మార్కెట్ సర్వీసెస్, మేనేజ్మెంట్ సర్వీసెస్ సంబంధిత కంపెనీల్లో అవకాశాలు విస్తృతం. పారిశ్రామిక, వ్యాపార రంగాలు వృద్ధి చెందే కొద్దీ సీఎస్ల కెరీర్‌కు ఢోకా ఉండదు. ఇవే కాకుండా ఐసీఎస్ఐకు దేశవ్యాప్తంగా ఉన్న 76 చాప్టర్లలో పేర్లు నమోదు చేసుకుని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. స్వయం ఉపాధి దిశగా ఆలోచించే వారు సొంతంగా ప్రాక్టీస్ చేయవచ్చు. హోదా: కంపెనీ సెక్రెటరీలకు రకరకాల హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. బోర్డ ఆఫ్ డెరైక్టర్సకి సలహాలు ఇవ్వడం, కంపెనీ రిజిస్ట్రార్‌గా, కంపెనీ న్యాయ సలహాదారుగా, కంపెనీ విధానాల రూపకర్త, కంపెనీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కంపెనీ ప్రిన్సిపల్ సెక్రటరీ, కంపెనీ యాజమాన్యానికి, వాటాదారులకు, రుణదాతలకు అనుసంధానకర్తగా అనేక హోదాల్లో సీఎస్ అభ్యర్థులు స్థిరపడొచ్చు. కంపెనీ సెక్రటరీలు చీఫ్ ఫైనాన్స ఆఫీసర్లుగా, బ్యాంక్ మేనేజర్లుగా, ఫైనాన్షియల్ కన్సల్టెంట్లుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. విదేశాల్లో అవకాశాలు: భారత ప్రభుత్వం, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, మారిషస్, యునెటైడ్ కింగ్డమ్ వంటి అనేక దేశాలతో ఆర్థిక వ్యవహారాల ద్వైపాక్షిక ఉమ్మడి పరస్పర సహకార ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని వల్ల కంపెనీ సెక్రటరీలకు మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెరిగాయి. వేతనం: కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. బహుళ జాతి సంస్థల్లో పనిచేస్తున్నవారు 10 నుంచి 25 లక్షల రూపాయల వార్షిక వేతనాన్ని పొందుతున్నారు. ఈ రంగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉంటే రూ. 25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వేతనం అందుకోవచ్చు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపె నీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ ప్రధాన, ప్రాంతీయ కార్యాలయాల్లో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్సలో రూ. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వేతనాన్ని ఆఫర్ చేశారు. ఎవరిని సంప్రదించాలి? ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాలు, చాప్టర్స(బ్రాంచీలు) అన్ని ప్రధాన నగరాల్లో ఉన్నాయి. ఆయా కార్యాలయాలను సంప్రదించి కోర్సులో చేరొచ్చు. ఇంటర్నెట్ ద్వారా తగిన వివరాలను పొందొచ్చు. వెబ్సైట్: www.icsi.edu ఫౌండేషన్ పరీక్షను డిసెంబర్లో రాయాలనుకుంటే.. ఆదే సంవత్సరం మార్చి 31లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పరీక్ష ఫీజును సెప్టెంబర్ చివరిలోగా చెల్లించాలి. ఫౌండేషన్ పరీక్ష తర్వాతి సంవత్సరం జూన్‌లో రాయాలనుకుంటే.. ప్రస్తుత సంవత్సరం సెప్టెంబర్‌లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫీజును మార్చిలోగా చెల్లిచాలి. ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ కోర్సుల్లో అన్ని మాడ్యూల్స్ (గ్రూపులు) కలిసి డిసెంబర్లో పరీక్షకు హాజరు కావాలనుకుంటే అదే సంవత్సరం ఫిబ్రవరి నెలఖారులోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాకాకుండా డిసెంబర్లో ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లలో ఒక్క మాడ్యుల్ (గ్రూపు) పరీక్షలు మాత్రమే రాయాలనుకుంటే మే చివరిలోగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన పరీక్షలను డిసెంబర్లో రాయాలనుకుంటే సెప్టెంబర్‌లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ పరీక్షల తర్వాతి సంవత్సరం జూన్‌లో అన్ని మాడ్యూల్స్ (గ్రూపులు) రాయాలంటే ప్రస్తుత సంవత్సరం ఆగస్టు 31లోగా అలాగే ఒక మాడ్యూల్ (గ్రూపు)ను తర్వాతి సంవత్సరం జూన్‌లో రాయాలంటే నవంబర్ చివర్లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ పరీక్షలకు జూన్‌లో హాజరు కావాలనుకుంటే మార్చి 25లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. రెండో దశ - ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ సీఎస్ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు నేరుగా ఎగ్జిక్యూటివ్ పరీక్ష రాయవచ్చు. సీఏ సీపీటీ ఉత్తీర్ణులు/ సీఎంఏ ఫౌండేషన్ ఉత్తీర్ణులు/ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఫౌండేషన్ కోర్సుతో అవసరం లేకుండా నేరుగా ఎగ్జిక్యూటివ్ పరీక్షకు హాజరు కావచ్చు. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. వీటిని రెండు మాడ్యూల్స్‌గా విభజించారు. మాడ్యూల్-1లో 4 పేపర్లు, మాడ్యూల్-2లో 3 పేపర్లు ఉంటాయి. విద్యార్థి వీలును బట్టి రెండు మాడ్యూల్స్ అంటే 7 పేపర్లు ఒకేసారి లేదా ఒక్కొక్క మాడ్యూల్‌ను విడిగా గానీ 6 నెలల తేడాతో రాయొచ్చు. ప్రతిపేపరుకు వంద మార్కులు కేటాయించారు. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతీ పేపర్లో వంద మార్కులకు కనీసం 40 మార్కులు, మాడ్యూల్/ మాడ్యూల్స్‌లోని అన్ని పేపర్లలో కలిపి సగటు 50 శాతం మార్కులు పొందాలి. ఈ పరీక్షను కూడా జూన్‌లో, డిసెంబర్లో సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు. మొదటి దశ - ఫౌండేషన్ ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సును పూర్తి చేసిన వారు ఏవరైనా (ఫైన్ ఆర్ట్స మినహాయిస్తే) ఫౌండేషన్ కోర్సులో చేరొచ్చు. దీని కోసం ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సీఎస్ ఫౌండేషన్ ప్రవేశ పరీక్షను కూడా సీఏ సీపీటీ మాదిరిగానే (2013 నుంచి) మల్టిఫుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 400 మార్కులు కేటాయించారు. ఈ పరీక్ష ఒకే రోజు రెండు భాగాలుగా, రెండు పూటలా జరుగుతుంది. ఉదయం రెండు పేపర్లు కలిపి 200 మార్కులకు, మధ్యాహ్నం రెండు పేపర్లు కలిపి 200 మార్కులకు విడివిడిగా పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం సెషన్లో బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ మేనేజ్మెంట్, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్‌లకు, మధ్యాహ్నం బిజినెస్ ఎకనామిక్స్, ఫండమెంటల్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ సబ్జెక్ట్‌లలో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలో 400 మార్కులకుగాను 200 మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఈ పరీక్ష ఏడాది కి రెండు సార్లు జరుగుతుంది. మూడో దశ - మేనేజ్మెంట్ ట్రైనింగ్ రెండోదశలో ఎగ్జిక్యూటివ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 15 నెలల మేనేజ్మెంట్ ట్రైనింగ్‌తోపాటు మూడు నెలలపాటు ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాలి. ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్‌ని ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ పూర్తి చేశాక కూడా చేసే సౌలభ్యం కూడా ఉంది. ట్రైనింగ్ కోసం ముందుగా సీఎస్ ఇన్స్టిట్యూట్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ప్రతిపాదించిన/అనుమతించిన కంపెనీ లేదా కంపెనీ సెక్రటరీల వద్ద ట్రైనింగ్ తీసుకోవచ్చు. నాలుగో దశ - ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు/ ఉత్తీర్ణత సాధించి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారు ప్రోఫెషనల్ ప్రోగ్రామ్ చదవడానికి అర్హులు. ఎగ్జిక్యూటివ్ పరీక్ష రాసిన సంవత్సరం తర్వాత ఈ ప్రొఫెషనల్ పరీక్షకు హాజరు కావాలి. ఇందులో మొత్తం 9 పేపర్లను 3 మా డ్యూల్స్గా విభజించారు. విద్యార్థి వీలును బట్టి 9 పేపర్లు అంటే 3 మాడ్యూల్స్ ఒకేసారి లేదా ఒక్కో మాడ్యూల్‌ను ఒక్కోసారి విడివిడిగా 6 నెలలు తేడాతో రాయవచ్చు. 100 మార్కులకు ఉండే ప్రతి పేపర్లో కనీసం 40 మార్కులు, మాడ్యూల్/మాడ్యూల్స్‌లోని అన్ని పేపర్లలో కలిపి సగటున 50 శాతం మార్కులను సాధిస్తే ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు.