compensation demand
-
వరదలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించటం అన్యాయమని..రూ.25లక్షలు పరిహారం ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షల వరకు పరిహారం ఇవ్వాలన్నారు. భారీ వర్ష సూచన ఉన్నా కుంభకర్ణ నిద్రలో ప్రభుత్వం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం ఫలితంగా ఓ యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు 20 మంది వరదల్లో ప్రాణాలు కోల్పోయారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆగస్టు 27న ప్రకటించినా కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకర్ణ నిద్రలో ఉందన్నారు. ‘ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు. మరొక మంత్రి, ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్ర సీఎంకు ఫోన్ చేస్తాడు. మూడో మంత్రి ఫొటోలకు పోజులకే పరిమితమవుతా డు. జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే ‘చీఫ్ మినిస్టర్’ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్టు వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశి్నస్తాడు’అని కేటీఆర్ మండిపడ్డారు. ఎస్‌ఎన్‌డీపీతోనే హైదరాబాద్‌కు వరద ముప్పు తప్పింది విజన్ ఉంటే విపత్తులను కూడా సమర్థంగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ‘ఎస్ఎన్డీపీ’నిరూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా..లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా కాపాడటంలో ఎస్ఎన్డీపీ (స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం) కీలకపాత్ర పోషించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రాహుల్‌గాంధీ ట్వీట్‌పై కేటీఆర్ ఆగ్రహం భారీవర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో ఏర్పడిన పరిస్థితులు తనను ఆవేదనకు గురిచేశాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం అవిశ్రాంతంగా చర్యలు చేపట్టిందంటూ రాహుల్‌గాంధీ చేసిన ట్వీట్‌పై కేటీఆర్ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. బాధపడుతున్నట్టుగా ప్రకటనలు చేస్తే సరిపోదని రాహుల్‌కు సూచించారు. తెలంగాణలో సహాయక కార్యక్రమాలను ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారో లేదో తెలుసుకుంటే ప్రభుత్వ నిర్వాకం తెలిసేదని వ్యాఖ్యానించారు. -
భారత్‌పే కో-ఫౌండర్, మాజీ ఎండీకి భారీ షాక్!
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీ యునికార్న్ భారత్‌పే-తన మాజీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్, ఆయన కుటుంబంపై క్రిమినల్ కేసు, సివిల్ దావా దాఖలు చేసింది. మోసం, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై రూ. 88.67 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించాలని భారత్ పే డిమాండ్ చేసింది. ఇది చదవండి: రోడ్ కాంట్రాక్టర్లకు భారీ ఊరట! కేంద్ర మంత్రి గడ్కరీ ఆఫర్ దాదాపు 2,800 పేజీల ఫిర్యాదులో భారత్‌పే గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్, ఇతర కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. నకిలీ బిల్లుల చెల్లింపు, కంపెనీకి సేవలు అందించడానికి కల్పిత విక్రేతల సృష్టి, రిక్రూట్మెంట్ కోసం కంపెనీకి అధిక చార్జీ వంటి ఆరోపణలు ఇందులో ఉన్నాయి. ఫిర్యాదుపై ఢిల్లీ హైకోర్టు గ్రోవర్, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానాలు చెప్పాలని సూచించింది. కేసు తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా పడింది. (సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?) నైపథ్యం ఇదీ.. నైకా ఐపీఓ కోసం నిధులను పొందడంలో విఫలం కావడానికి సంబంధించి కోటక్ గ్రూప్ ఉద్యోగిపై గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్ గ్రోవర్ అనుచిత పదజాలం ఉపయోగించి, బెదిరించిన కేసులో ఈ సంవత్సరం ప్రారంభంలో నాలుగు సంవత్సరాల భారత్‌పే వార్తల్లో నిలిచింది. ఈ పరిస్థితిల్లో సంస్థ కార్పొరేట్ పాలన సమీక్షను నిర్వహించడానికి, గ్రోవర్ ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడో లేదో తెలుసుకోవడానికి అల్వారెజ్ మార్సల్, శార్దూల్ అమర్‌చంద్ మంగళదాస్, పీడబ్ల్యూసీలను భారత్‌పే నియమించింది. ఇది మార్చిలో కంపెనీ, ఆ సంస్థ బోర్డు నుండి గ్రోవర్, ఆయన భార్య తొలగింపునకు దారితీసింది. వారితోపాటు దుష్ప్రవర్తనకు పాల్పడిన ఉద్యోగులందరిపై చర్యలు తీసుకో వాలని సంస్థ నిర్ణయించింది. అష్నీర్ గ్రోవర్ నిరోధిత షేర్లను వెనక్కి తీసుకోవడంసహా, ఆయన పా ల్పడిన అవకతవకలపై చర్యలకూ ఉపక్రమించింది. ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు -
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేయాలి
కొత్తూరు : రిమ్స్ ఆస్పత్రిలో రోగులకు వేసిన ఇంజెక్షన్ వికటించి మృతి చెందిన ముగ్గురువి ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి అన్నారు. కొత్తూరులో ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పేదలకు కార్పోరేట్ వైద్యం అందుబాటులో అందించేందుకు దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జిల్లా కేంద్రంలో రిమ్స్‌ను ఏర్పాటు చేశారన్నారు. అయితే దివంగత నేత ఏ లక్ష్యంతో రిమ్స్ ఏర్పాటు చేశారో ఆందుకు భిన్నంగా నేటి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. వైద్యాన్ని ప్రభుత్వం కేవలం వ్యాపారంగా మార్చిందని రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కరువు మందుల కంపెనీలతో పాలక పక్షం నేతలు కుమ్ముక్కైనందున వలనే కల్తీ మందులు, నాసిరకం మందులు ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా అవుతున్నాయన్నారు. రిమ్స్‌లో సరైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించడం లేదని చెప్పారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేక పోవడం వలనే ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. నాణ్యతలేని మందులు సరఫరా వలనే ప్రాణాలు పోవడంతో ప్రభుత్వ ఆస్పత్రిలు అంటే ప్రజల్లో భయపడే విధంగా ప్రభుత్వం తయారు చేసిందన్నారు. ఇంజెక్షన్ వికంటించి మృతి చెందిన వారిలో పాతపట్నం నియోజవర్గం పరిధి కొత్తూరు మండలం కాశీపురానికి చెందిన ఇస్సై శైలు మృతి చెందినట్టు చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియో చెల్లించాలని రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. అదే విధంగా అస్వస్థతకు గురైన వారికి లక్ష రూపాయలు చెల్లించాలన్నారు. కల్తీ మందులు వలనే ముగ్గురు మృతి చెందా రన్నారు. ప్రభుత్వం బాధ్యత వహించి మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని రెడ్డి శాంతి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. వైద్యాన్ని ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్‌పరం చేసి సర్కార్ వైద్యాన్ని పట్టించుకోకపోవడం వల్లే పేదలు ప్రాణాలు పిట్టలు రాలిపోతున్నా, పాలకులకు పట్టడం లేదని రెడ్డి శాంతి అన్నారు. మృతి చెందిన మూడు రోజులు గడుస్తున్నా మృత దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. మూడు రోజులుగా మృత దేహాల కోసం ఆస్పత్రి చుట్టూ కుటుంబ సభ్యులు తిరుతున్నా అప్పగించక పోవడం దారుణమన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. -
సర్దార్ డ్యాం’పై ఆందోళనలు
భోపాల్: నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యాం వల్ల నిర్వాసితులయ్యేవారికి పరిహారం డిమాండ్ చేస్తూ మధ్యప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన వెంటనే భోపాల్‌లో సీపీఎం నాయకురాలు సుభాషిణి అలీ నేతృత్వంలో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ డ్యాం నిర్మాణంతో ప్రభావితమవుతున్న 40 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాలని పార్టీ జిల్లా కార్యదర్శి పుషాన్ భట్టాచార్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ సీపీఎం ఆందోళనలు కొనసాగించింది. మరోవైపు, బార్వాని జిల్లాలో నర్మదా నదిలో నడుము లోతు వరకు నిల్చొని మూడు రోజులుగా జల సత్యాగ్రహాం చేస్తున్న నర్మదా బచావో ఆందోళన్(ఎన్బీఏ) నాయకురాలు మేధా పాట్కర్ తన ఆందోళనను విరమించారు. అయినా నిర్వాసితుల కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిరుపేద రైతుల అభివృద్ధికి కాకుండా వారి వినాశనానికి దారితీస్తుందని ప్రముఖ పర్యావరణ సంస్థ గ్రీన్‌పీస్ ఆందోళన వ్యక్తం చేసింది.