'వచ్చే ఐదేళ్లలో పేపర్లెస్ రైల్వే కార్యాలయాలు'
న్యూఢిల్లీ: రైల్వేలో పారదర్శకతను పెంచేందుకు అన్ని విభాగాలను కంప్యూటరీకరించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. ఐటీ విప్లవం జీవితంలోని అన్ని రంగాలకూ వ్యాపించిందని, దీన్ని తాము కూడా అందిపుచ్చుకుంటామన్నారు. రాబోయే ఐదేళ్లలో రైల్వే శాఖలో మొత్తం పేపర్లెస్ కార్యాలయాలు ఉంటాయని పేర్కొన్నారు.
టికెట్ కౌంటర్లన్నింటిలో డ్యూయల్ డిస్ప్లే ఛార్జీ ఇండికేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే డిజిటల్ రిజర్వేషన్ చార్టులను కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కొన్ని స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తామన్నారు.