కుటుంబ సర్వే కంప్యూటరీకరణ భేష్
ఖమ్మం జడ్పీసెంటర్ : జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ విజయవంతమైందని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి అన్నారు. కలెక్టరేట నుంచి ఆర్డీఓలు, తహశీల్దార్లతో ఆయన శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సమగ్ర కుటంబ సర్వే వివరాలు కంప్యూటర్లలో నమోదు చేసే ప్రక్రియ తొలుత నిదానంగా ప్రారంభమైనప్పటికీ రాను రాను వేగం పుంజుకుందన్నారు. చక్కటి ప్రణాళికతో కంప్యూటీకరణ పూర్తి చేయడం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ ప్రశంసించారని తెలిపారు. కంప్యూటరీకరణను అంకితభావంతో పూర్తిచేసిన జేసీ సురేంద్రమోహన్, జడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణ, డీఐఓ శ్రీనివాస్, ఆర్డీవో, తహశీల్దార్లు, కళాశాలల యజమానులు అభినందనీయులని అన్నారు.
రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలు పటిష్టంగా అమలు చేసేందుకు సర్వే వివరాలు దోహదం చేస్తాయని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈవో జయప్రకాష్‌నారాయణ్, ఎన్ఐసీ డీఐఓ శ్రీనివాస్, కలెక్టరేట్ సిబ్బంది ఖాసిం, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.