బైక్ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి
ముందు వెళ్తున్న బైక్ను లారీ ఢీకొట్టడంతో.. బైక్ పై ఉన్న వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా తడ మండలం కుండూరు శివారులో అపాచి కూడలి వద్ద గురువారం చోటుచేసుకుంది. తమిళనాడు బాటకుప్పంకు చెందిన చిన్నరాజు(35) బైక్పై సూళ్లూరుపేట వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వస్తున్న కాంక్రీట్మిక్చర్ వాహనం ఢీకొట్టింది. దీంతో అతను అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు.