condolence meeting
-
సీఎం జగన్ అండగా నిలిచారు: శ్రీవాత్సవ
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరోగ్యం గురించి సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీశారని ఆయన కుమారుడు శ్రీవత్సవ అన్నారు. తన తండ్రి అనారోగ్యానికి గురైతే.. పార్టీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిందని గుర్తుచేశారు. మంగళవారం విశాఖలోని ఉడా చిల్డ్రన్ థియేటర్లో ద్రోణంరాజు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు, ఎంవీవీ సత్యనారాయణ.. సత్యవతి, గుడివాడ అమర్నాథ్, అదీప్‌రాజు, గొల్ల బాబూరావు, భాగ్యలక్ష్మి, కార్యకర్తలు పాల్గొని ద్రోణంరాజు శ్రీనివాస్ చిత్ర పటానికి పుల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు శ్రీవాత్సవ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ తమకు అండగా నిలిచారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రేమ అనేది స్వచ్ఛంగా ఉంటుందని చెప్పారు. పార్టీలో ఆలస్యంగా చేరిన తన తండ్రికి సీఎం జగన్ ఎమ్మెల్యే సీటు ఇచ్చారని గుర్తుచేశారు. తన నాన్న ఆరోగ్యం గురించి ఆయన ఎప్పటికప్పుడు ఆరా తీశారని చెప్పారు. మెరుగైన వైద్యం అందించమని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దురదృష్టవశాత్తు తన తండ్రి చనిపోయారని అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు తమకు అండగా నిలిచారని చెప్పారు. సంస్మరణ సభలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల మనసులో ద్రోణంరాజు శ్రీనివాస్ చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. చివరిసారిగా తనకు ద్రోణంరాజు శ్రీనివాస్ ఫోన్ చేసి శ్రీవత్సవను బాగా చూసుకోవాలని చెప్పారని తెలిపారు. ద్రోణంరాజు కుటంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ద్రోణంరాజు కుటంబానికి అండగా ఉంటారని చెప్పారు. శ్రీవత్సవ తన తండ్రి బాటలోనే నడవాలని కోరుకుంటున్నానని అన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ. ద్రోణంరాజు శ్రీనివాస్ మరణం చాలా బాధాకరమని, విశాఖ నగరంతో విడదీయరాని బంధం ద్రోణంరాజు కుటుంబానికి ఉందని తెలిపారు. పార్టీ తరుఫున ద్రోణంరాజు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అదే విధంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ద్రోణంరాజు సంస్మరణ సభలో పాల్గొటనని ఎన్నడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన అనే మనుషులను ఎన్నడూ సీఎం జగన్ వదులుకోరని తెలిపారు. వైఎస్, ద్రోణంరాజు కుటంబానికి ఎంతో సన్నిహిత సంబంధం ఉందని గుర్తుచేశారు. ఎన్నికల్లో ద్రోణంరాజు ఓడిపోయినప్పటికీ సీఎం జగన్ వీఎంఆర్డీఏ చైర్మన్ పదవినిచ్చి గౌరవించారని చెప్పారు. -
పార్టీ ఆఫీసులో ద్రోణంరాజు సంతాప సభ
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి పట్ల పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అభిమానులు విచారం వ్యక్తం చేశారు. విశాఖ వైఎస్సార్సీపీ కార్యాలయంలో వారంతా సంతాప సభ నిర్వహించారు. ద్రోణంరాజు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్, అమర్నాథ్ నివాళులర్పించారు. ద్రోణంరాజు శ్రీనివాస్ అకాల మృతి పట్ల వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి, ఉత్తరాంధ్ర ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ద్రోణంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ద్రోణంరాజు శ్రీనివాస్ పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన విశాఖ వన్‌టౌన్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రేపు ఉదయం ద్రోణంరాజు అంత్యక్రియలు ద్రోణంరాజు శ్రీనివాస్ భౌతిక కాయానికి రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పినాకిల్ ఆసుపత్రి నుంచి పెద వాల్తేరులోని ద్రోణంరాజు స్వగృహానికి భౌతిక కాయాన్ని తరలించారు. ఉదయం 9 గంటల నుంచి ద్రోణంరాజు భౌతిక కాయాన్ని అభిమానులు, కార్యకర్తలు అభిమానులు సందర్శనార్థం ఉంచుతామని ద్రోణంరాజు శ్రీనివాస్ బంధువులు తెలిపారు. అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తామనేది రేపు ఉదయం వెల్లడిస్తామని చెప్పారు. (చదవండి: మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత) I have no words to express my grief and sorrow over the sudden demise of Sri Dronamraju Srinivas garu.its a great loss to the party and people of North Andhra.I convey my condolences to the bereaved family members and pray to God to give them courage to face these testing times. — Vijayasai Reddy V (@VSReddy_MP) October 4, 2020 -
మమ్మల్ని తిరుపతి వేంకటకవులనేవారు
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో తనను, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డిని అందరూ తిరుపతి వేంకట కవులుగా పిలిచేవారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని అంబేడ్కర్ అంతర్జాతీయకేంద్రంలో జైపాల్‌రెడ్డి సంస్మరణసభ ఏర్పాటు చేశారు. సభ లో వెంకయ్యతోపాటు ఆయన సతీమణి ఉశమ్మ, మాజీప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమం త్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషి, కాంగ్రెస్ సీనియర్లు దిగ్విజయ్ సింగ్, అభిషేక్ సింఘ్వీ, జైరాం రమేశ్, కొప్పుల రాజు, సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, ఎల్జేడీ నేత శరద్ యాదవ్, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జైపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మమ్మ, కుమారులు అరవింద్, ఆనంద్, కుమార్తె అరుణ, ఇతర కుటుంబ సభ్యులను నేతలు పరామర్శించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ తాను నమ్మిన ప్రజాస్వా మ్య విలువలకు ఎల్లప్పుడూ కట్టుబడిన నాయ కుడు జైపాల్ రెడ్డి అని కొనియాడారు. తామిద్దరం ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలకు ముందు ఇంట్లో కలుసుకొని ఆరోజు సభ అజెండాపై చర్చింకుకొనే వారిమని అన్నారు. సభ లో ఎల్లప్పుడూ పక్కనే కూర్చొనేవాళ్లమని, అన్ని విషయాలపట్ల జైపాల్‌రెడ్డికి సునిశిత పరిశీలన, జాతీయ, అంతర్జాతీయ అంశాలపట్ల పరిజ్ఞానం ఎక్కువగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ జైపాల్ రెడ్డి మరణంతో దేశం ఒక గొప్ప పార్లమెంటేరియన్‌ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా జైపాల్ పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి తనకు మార్గదర్శి అని, అనేక ఆంశాలను ఆయన్నుంచి నేర్చుకొనేవాడినని ఏచూరి చెప్పారు. జైపాల్ రెడ్డి మరణంతో వ్యక్తిగత స్నేహితుడ్ని కోల్పోయినట్లు మురళీ మనోహన్ జోషి, డి.రాజా విచారం వ్యక్తం చేశారు. సభలో కాంగ్రెస్ సీనియర్లు, ఇతర పార్టీల నేతలు ప్రసంగించారు. -
అటల్జీ కి ఘన నివాళి అర్పించిన ఎన్నారైలు
టెక్సాస్ : మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయికి ఎన్నారైలు ఘనంగా నివాళులు అర్పించారు. ఆగస్టు 18న టెక్సాస్‌లోని ఎన్నారైల సంస్థలైన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఐఎఎన్టీ), ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్‌సీ) ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. మాజీ ప్రధాని దివంగత నేత వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులు అర్పించారు. జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమానికి ప్రారంభించారు. అనంతరం కొందరు సభ్యులు మాట్లాడుతూ.. వాజ్‌పేయి దేశానికి చేసిన సేవను కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని ఐఎఎన్టీ వైస్ ప్రెసిడెంట్ అభిజిత్ రాయికర్ ప్రారంభించగా.. బి.ఎన్ రావు వోట్ ఆఫ్ థ్యాంక్స్‌తో సభను ముగించారు. ఐఎఎన్టీ అధ్యక్షుడు కమల్ కౌశల్, రాకేష్ బానాతి, ఐఏఎఫ్‌సీ చైర్మన్ ప్రసాద్ తోటకూర, ఐఎఎన్టీ ట్రస్టీ చైర్మన్ కుంతేష్ చోక్సి, బి.ఎన్. రావు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీదేవి మరో జన్మలోనూ శ్రీదేవిలానే పుట్టాలి
-
శ్రీదేవి మరో జన్మలోనూ శ్రీదేవిలానే పుట్టాలి
‘‘అందరూ జన్మిస్తారు. జీవిస్తారు. మరణిస్తారు. కొంత మంది మరణించినా శాశ్వతంగా గుండెలో ఎప్పూడు చెరగని ముద్ర వేసి జీవిస్తారు. అలాంటి కోవకు చెందిన మనిషి శ్రీదేవి’’ అన్నారు కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి. ప్రముఖ సినీతార శ్రీదేవి సంస్మరణ సభ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో టి.సుబ్బిరామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చి శ్రీదేవితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ–‘‘ భారతదేశ చలనచిత్రరంగంలో శ్రీదేవి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులు అభిమానించారు. హిందీలో చాందినీగా ఆకట్టుకున్నారు. ఆవిడ మరణవార్త విని దేశం మొత్తం షాక్ అయ్యింది. ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. శ్రీదేవితో మా అమ్మాయి పింకీ రెడ్డి ఎంతో సన్నిహితంగా ఉండేది. శ్రీదేవి ఎంత పెద్ద ఆర్టిస్టో అంత మంచి హ్యూమన్ బీయింగ్. ఎంత ఎత్తు ఎదిగినా రూట్స్‌ని మరిచిపోలేదు. అంత గొప్ప నటి, శక్తి స్వరూపిణి దూరమైయేసరికి కోట్లాది అభిమానులు తమ అభిమానాన్ని, దుఃఖాన్ని చూపించారు. బోనీ కపూర్, శ్రీదేవి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎప్పుడు వాళ్లు విడిగా వచ్చేవారు కాదు. శ్రీదేవి మరోజన్మలోను శ్రీదేవిలానే పుట్టాలి. తెలుగమ్మాయిగానే పుట్టాలి. మా శ్రీదేవి మళ్లీ వచ్చిందనుకోవాలి’’ అన్నారు. ప్రముఖ గాయని సుశీల మాట్లాడుతూ–‘‘ దేవలోకం నుంచి వచ్చిన దేవకన్య శ్రీదేవి. మనల్ని మైమరపించి మళ్లీ తన లోకానికే వెళ్లిపోయింది. 8 ఏళ్ల వయసులో శ్రీదేవికి పాట పాడాను. అంతేకాదు ఆమె మొట్టమొదటి సినిమాకు కూడా పాట పాడాను. మనకు ఎన్నో తీపిగుర్తులను మిగిల్చి తను వెళ్లిపోయింది’’ అన్నారు.‘‘శ్రీదేవితో కలిసి నాలుగు సినిమాల్లో నటించాను. ఆమె నిగర్విగా ఉండేది’’ అన్నారు నటుడు కోటశ్రీనివాసరావు. ‘‘శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. నన్ను ఎప్పుడూ సార్ అని పిలిచేది. ఆమెకు పెద్దలంటే ఎంతో గౌరవం. ఇప్పుడు ఆమె లేదు అంటే నమ్మబుద్ది కావడం లేదు. దేశం గర్వించదగ్గ నటి శ్రీదేవి. ఆమె మరణించినా..సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారామె’’ అని అన్నారు కృష్ణంరాజు. ‘‘ శ్రీదేవి మరణవార్త విన్న తర్వాత ఎంతో దుఃఖించాను. తెలుగు అమ్మాయిగా ఎంతో సాధించింది. జీవితంలోని ప్రతి అడుగును ఒక లక్ష్యంగా చేసుకుని నడిచింది. ప్రతి పాత్రను ఒక సవాలుగా తీసుకునేది శ్రీదేవి. కొత్తగా సినిమాల్లోకి వచ్చే వారు శ్రీదేవిలా ఉండాలని కోరుకుంటారు. శ్రీదేవి గొప్ప నటి మాత్రమే కాదు. మంచి మాతృమూర్తి కూడా. తనలాగే జాన్వీని కూడా తీర్చిదిద్దాలని అనుకున్నారు. జాన్వీ మంచి నటిగా రాణించాలని కోరుకుంటున్నాను’’అన్నారు నటి జయప్రద. ‘‘శ్రీదేవి మరణవార్తను జీర్ణించుకోలేకపోయాను. శ్రీదేవి కుటుంబంతో మా కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమెతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని మరిచిపోలేక పోతున్నాను. జాన్వీ మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు నటి జయసుధ. ‘‘శ్రీదేవితో కలిసి నటించలేదు. కానీ ఫ్యామిలీ ఫ్రెండ్. ఆమెతో ఓ సినిమాలో నటించే అవకాశం కొద్దిలో తప్పిపోయింది. ఆమె దేశంలోని ప్రతి కుటుంబంలో ఒక సభ్యురాలే. ముంబైలో జరిగిన శ్రీదేవి అంత్యక్రియలకు వెళ్లాలి అనుకున్నాను. కానీ..కుదర్లేదు. ఇప్పుడు సంస్మరణసభలో పాల్గొనే అవకాశం వచ్చింది’’ అన్నారు హీరో రాజశేఖర్. ‘‘1972లో ‘బడిపంతులు’ సినిమాలో శ్రీదేవిని చూసిన మొదటి రోజే గొప్ప నటి అవుతుందని అనుకున్నాను. రామానాయుడు ఆమెను ‘దేవత’ను చేస్తే..ఎన్టీఆర్ ఆమెను ‘అనురాగదేవత’ను చేశారు’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘‘శ్రీదేవి సెట్లో ఎవర్ని బాధపెట్టలేదు. కానీ చనిపోయి అందర్నీ నొప్పించింది’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘‘శ్రీదేవికి నేను పెద్ద అభిమానిని. ‘బడిపంతులు’ సినిమాలో శ్రీదేవి నటన చూసి, గొప్ప నటి అవుతుందనుకున్నాను’’ అన్నారు నటుడు బాబుమోహన్. ‘‘శ్రీదేవితో నటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. శ్రీదేవితో నటించే అవకాశం దక్కనందుకు బాధపడుతున్నాను. శ్రీదేవి లాంటి హీరోయిన్ కావాలని కోరుకునే వారిలో నేనూ ఉన్నాను’’ అన్నారు హీరోయిన్ నివేధా థామస్. రేలంగి నరసింహరావు, అమల, శ్రీకాంత్, అల్లు అరవింద్, జగపతిబాబు, సుమంత్, ఆలీ, శివాజీ రాజా, నరేశ్, ఉపాసన కామినేని తదితరులు పాల్గొన్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'మోసం చేసిన వారితో పాల్గొనకూడదనే'
-
‘భూమాను మోసం చేసినవారితో పాల్గొనకూడదనే’
విజయవాడ: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. అయితే ఏపీ అసెంబ్లీలో భూమా నాగిరెడ్డి సంతాప తీర్మాన కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ పాల్గొనట్లేదని పార్టీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మంగళవారమిక్కడ తెలిపారు. తమ పార్టీలో ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డికి పీఏసీ చైర్మన్‌గా కేబినెట్ హోదా పదవి ఇచ్చి గౌరవంగా చూసుకున్నామన్నారు. అయితే చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఆశ చూపి... ఇవ్వకపోవడం వల్లే మనస్థాపానికి గురై ఆ క్షోభతోనే ఆయన మరణించారన్నారు. భూమాను మోసం చేసిన వారితో కలిసి సంతాప కార్యక్రమ తీర్మానంలో పాల్గొనకూడదని తమ పార్టీ నిర్ణయించిందన్నారు. మానసిక క్షోభకు గురి చేయడం చంద్రబాబుకు అలవాటేనని, గతంలో ఎన్టీఆర్‌ను, ఇప్పుడు భూమా నాగిరెడ్డికి అలాగే చేశారన్నారు. టీడీపీలో చేరిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉందని అన్నారు. -
మంచి మనిషి మేదరమెట్ల
నెల్లూరు: దివంగత మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి మంచిమనిషిగా అందరి మనుసుల్లో నిలిచారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కొనియాడారు. గురువారం జలదంకి మండలంలోని బ్రాహ్మణక్రాకలో మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి సంతాప సభ జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పట్టుదల, ఉదార స్వభావం గల వ్యక్తి మేదరమెట్ల అని కొనియాడారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో ఓదార్పుయాత్రకు వచ్చిన సమయంలో బ్రాహ్మణక్రాకలోని మేదరమెట్ల నివాసంలో మూడు రోజుల పాటు బస చేశారన్నారు. జగన్‌తోకూడా మేదరమెట్లకు సానిహిత్యం ఉందన్నారు. వైఎస్సార్సీపీ అభివృద్ధికి ఎంతగానో కృషిచేశారన్నారు. జెడ్పీ ఎన్నికలో కూడా తమ వెంటే ఉండి చైర్మన్‌గా బొమ్మిరెడ్డి ఎంపికయ్యేందుకు దోహదపడ్డారన్నారు. మండల ప్రజలందరి మనుసులలో ఉదార స్వభావుడిగా పేరుతెచ్చుకున్నారని తెలిపారు. ప్రజా సేవకే అంకితమైన మేదరమెట్ల: కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి వెంకటకృష్ణారెడ్డి నిరంతరం ప్రజాసేవకే అంకితమయ్యారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. కావలి కాలువకు నీరు వచ్చేందుకు ఎప్పుడు తపన పడేవారని తరచూ దీనిగురించి తనతో పోన్లో మాట్లాడేవారన్నారు. ఆయన ఆశయం కావలి కాలువను ఆధునీకరించడమేనన్నారు. ఇప్పుడు ఉన్న 500 క్యూసెక్కులకు బదులు 1200 క్యూసెక్కులు వచ్చేలా కృషిచేసి మేదరమెట్ల ఆశయాన్ని నెరవేరుద్దామన్నారు. తాను అమెరికాలో ఉన్న సమయంలో మరణవార్త విని దిగ్బాంత్రికి లోనయ్యానని అన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మామా అనే పిలుపునకు దూరమయ్యా: మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి మేదరమెట్ల మృతితో మామా అనే పిలుపునకు దూరమయ్యానని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అడిగిన వారికి లేదనకుండా దానాలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. అనుకున్న దానికోసం తపన పడి దానిని సాధించే వరకు నిద్రపోయేవాడు కాదన్నారు. కావలి కాలువ మీదకు సాగునీటికోసం తనను ఎన్నోసార్లు పట్టుబట్టి తీసుకొచ్చాడని అన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని బ్రాహ్మణక్రాకలో త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఎనిమిది నెలల్లోనే ఎంతో స్నేహితుడయ్యాడు: జెడ్పీ ైచె ర్మన్ బొమ్మిరెడ్డి ఎనిమిది నెలల పరిచయంతోనే మేదరమెట్ల తనకు ఎంతో దగ్గరై మంచి స్నేహితుడయ్యారని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఆయన సతీమణి శివలీల జలదంకి జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచిన తర్వాత ఆయన ఇంటికి వచ్చానని, అప్పటినుంచి ఇప్పటికి స్నేహితులుగా ఉన్నామన్నారు. తాను చైర్మన్‌గా గెలిచేందుకు ఎంతో సహకరించారన్నారు. జలదంకి మండలానికి ఇంతవరకు ఎంపీడీఓ కార్యాలయం లేదని తన దృష్టికి పలుమార్లు తెచ్చి దానిని మంజూరు చేయాలని మేదరమెట్ల కోరారన్నారు. ఆయన కోరిక ప్రకారం త్వరలోనే కార్యాలయంను ఏర్పా టు చేస్తామన్నారు. ఆయన భార్య శివలీల కు మద్దతు ఉంటుందని తెలిపారు. 52 ఏళ్ల అనుబంధం మాది: మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి మేదరమెట్లకు తనకు 52 ఏళ్ల అనుబంధం ఉందని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా భాదగా ఉందన్నారు. చదువుకునేటప్పటి నుంచి వ్యాపారం, రాజకీయాల్లో తనకు ఎంతో గౌరవం ఇచ్చేవారన్నారు. తన రాజకీయ ఎదుగుదలకు ఎంతగానో కృషి చేశారన్నారు. జలదంకి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, సాగునీటికోసం పోరాడారని కొని యాడారు. ముందుగా వారంతా వెంకట కృష్ణారెడ్డి సమాధివద్ద నివాళులర్పించిన అనంతరం సంతాప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ని వాళులర్పించి మౌనం పాటించారు. మేదరమెట్లపై ఆయన మరదలి కుమారుడు వంటేరు రామచంద్రారెడ్డి తయారు చేసిన మనసున్న మారాజు పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ రా ష్ట్ర నాయకులు కందుకూరి వెంకటసత్యనారాయణ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి పాల్గొన్నారు. -
ఏఎన్నార్ చనిపోయాక పొగడటం విచారకరం: నాగసుశీల
'మా నాన్న చనిపోయాక పొగడటం విచారకరం' అని అక్కినేని నాగేశ్వరరావు కూతురు నాగసుశీల వ్యాఖ్యానించారు. ఫిలిం చాంబర్లో నిర్వహించిన ఏఎన్ఆర్ సంతాప సభలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర విభాగాలకు చెందిన టెక్నిషియన్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పద్మవిభూషణ్ వచ్చినప్పుడు స్పందించని సినీ పరిశ్రమ..మా నాన్న చనిపోయాక పొగడటం విచారకరం అని నాగసుశీల అన్నారు. ఇదే సభలో మహానటులకు జరిగిన అన్యాయంపై ఆర్ నారాయణ మూర్తి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రాజకీయ స్వార్థాల వల్ల మహానటులు ఎన్ టీఆర్ కు భారత రత్న రాలేదు అని ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఏఎన్నాఆర్ కు భారతరత్న ఇచ్చి తీరాలి నారాయణమూర్తి డిమాండ్ చేశారు.