బసవన్న రంకె
చంద్రగిరి, న్యూస్‌లైన్: చంద్రగిరి మండలం ఆరేపల్లె రంగంపేటలో గురువారం జల్లికట్టును ఆనందోత్సాహాలతో నిర్వహించారు. ఆవులు, ఎద్దులు, కోడెగిత్తలను గుంపులు, గుంపులుగా పరుగు లు పెట్టించారు. జోరుగా దూసుకొచ్చే కోడెగిత్తలను, ఎద్దులను నిలువరించేందుకు యువకులు గ్రూపులుగా ఏర్పడి పోటీలు పడ్డారు. చెక్కపలకలను సొంతం చేసుకునేందుకు ఎగబడ్డారు.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ జల్లికట్టును తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు. జల్లికట్టులో భాగంగా ఎద్దులను, కోడెగిత్తల ను గుంపులుగా వదిలారు. పలకలు వాయిం చుకుంటూ పరుగులు పెట్టించారు. కోడెగిత్తలను పట్టుకుని చెక్కపలకలను సొంతం చేసుకునేందుకు యువకులు ఉత్సాహం ప్రదర్శిం చారు.
చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులు గ్రూపులుగా ఏర్పడ్డారు. జల్లికట్టులో గెలుపొందిన వారు చెక్కపలకలను చేతపట్టి విజయగర్వంతో ఊగిపోయారు. అంతకు ముందు స్థానికులు గ్రామదేవతకు పొంగళ్లు పెట్టారు. ఆ తరువాత కోడెగిత్తలను పోటీలకు సిద్ధం చేశారు. కొమ్ములు చెలిగి రంగులు వేశారు. కొమ్ములకు చెక్కపలకలు, టవళ్లను కట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు జల్లికట్టును ప్రారంభించారు. రెడ్డివారిపల్లె, పుల్లయ్యగారిపల్లెలో కూడా జల్లికట్టును ఘనంగా నిర్వహించారు.
ఇరువర్గాల గొడవ
జల్లికట్టులో రెండు గ్రూపుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఎద్దును నిలువరించే సమయంలో తాము పట్టామంటే తాము పట్టామని గొడవకు దిగారు. చెక్కపలక కోసం కొట్టుకునే వరకు వచ్చారు. స్థానికుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇరువర్గాల వారు మళ్లీ ఉత్సాహంతో జల్లికట్టులో పాల్గొన్నారు.
గట్టి బందోబస్తు
జల్లికట్టులో భాగంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జల్లికట్టు చట్టవిరుద్దమం టూ ముందురోజున పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా గ్రామస్తులు ఏళ్ల తరబ డి సంప్రదాయబద్దంగా జరుపుకుంటున్న పం డుగను నిలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చంద్రగిరి, తిరుప తి పోలీసులు, స్పెషల్ ఫోర్స్, ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.