‘కాగ్ ఆడిట్’ ఉత్తర్వులతో కలకలం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయుంతో ముడిపడివున్న దృష్ట్యా ప్రైవేట్ టెలికామ్ కంపెనీల అకౌంట్లను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పరిశీలించవచ్చంటూ ఢిల్లీ హైకో ర్టు ఇచ్చిన ఉత్తర్వులు కలకలం సృష్టిస్తున్నా రుు. ఇతర రంగాల్లోని కంపెనీల ఖాతాలను కూడా తనిఖీ చేయూలనే డివూండ్లు రావచ్చనే అభిప్రాయుం వ్యక్తవువుతోంది. ‘ఆడిట్ విషయూనికి వస్తే, ప్రభుత్వ ఆధీనంలోని వ్యాపారాల విషయుంలో వూత్రమే పార్లమెంటుకు కాగ్ జవాబుదారీ అని మేం విశ్వసిస్తున్నాం. అందువల్ల ప్రైవేట్ కంపెనీల అకౌంట్లను కాగ్ ఆడిట్ చేయుజాలదు.’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో ఆదాయు పంపిణీ ఒప్పందాలున్నందున ప్రైవేట్ టెలికామ్ కంపెనీల ఆదాయూలను కాగ్ ఆడిట్ చేయువచ్చని కూడా సోవువారం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఢిల్లీ హైకోర్టు తెలిపింది. టెలికామ్ కంపెనీల వసూళ్లకు వూత్రమే కాగ్ ఆడిట్ పరిమితం కావాలని స్పష్టంచేసింది. అన్ని కంపెనీల ఆదాయూల కు కన్సాలిడేటెడ్ ఫండ్‌తో సంబంధవుున్న దృష్ట్యా ఇతర రంగాలపైన కూడా కోర్టు ఉత్తర్వుల ప్రభావం ఉండవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ రీసెర్చ్ అనలిస్ట్ అంకితా సోవూనీ పేర్కొన్నారు.