ఓటు వేసిన ఎంపీ మల్లారెడ్డి
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాలక మండలి ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ సి.మల్లారెడ్డి తన ఓటును బోయిన్పల్లిలో వినియోగించుకున్నారు. అన్ని బూత్ల దగ్గర పోలింగ్ ప్రశాంతంగా జరుగగా బాపూజీ నగర్ లోని 13వ బూత్ దగ్గర స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓటు వేస్తున్నారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు.