గుడ్న్యూస్: గెస్ట్ లెక్చరర్ల వేతనాలు.. గంటకు రూ. 90 పెంపు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని గెస్ట్ లెక్చరర్ వేతనాలు గంటకు రూ.300 నుంచి 390 వరకూ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి రొనాల్డ్ రాస్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నెలకు 72 గంటలపాటు బోధించే అవకాశం కల్పించాలని, నెలసరి వేతనం రూ. 28,080కి పరిమితం చేయాలని జీవోలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దాదాపు 2 వేలమంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. వేతనం పెంపు నిర్ణయం పట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
క్రమబద్ధీకరణ చేయకుంటే 12న ఆందోళన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్ కళా శాలల్లోని కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీ కరించాలని, ఆ జాబితాను ఈ నెల 12లోగా ప్రభుత్వానికి పంపకుంటే అదేరోజు ఆందోళన చేపడతామని ఇంటర్ విద్యా పరి రక్షణ సమితి హెచ్చరించింది. ఈ మేరకు ఇం టర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్ మాచర్ల రామకృష్ణ గౌడ్, సమన్వయకర్త మైలారం జంగయ్య, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీ కరణ సాధన సమితి సమన్వయకర్త కొప్పిశెట్టి సురేష్ ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు.