'మహాధర్నాకు వెళ్తే అరెస్ట్ చేస్తాం'
విశాఖపట్నం: డిమాండ్ల సాధనకు గంగవరం పోర్టు వద్ద కాంట్రాక్టు కార్మికులు మంగళవారం మహాధర్నా నిర్వహించనున్నారు. మహాధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గంగవరం, దిబ్బపాలెం, శ్రీనగర్ దిబ్బపాలెం గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.
సెక్షన్ 30 అమల్లో ఉన్నందున మహాధర్నాకు వెళ్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. పోలీసుల వైఖరిని సీపీఎం నగర కార్యదర్శి గంగారావు ఖండించారు.