ఇద్దరు ఉగ్రవాదులను ఉరి తీసిన పాకిస్థాన్
ఇస్లామాబాద్: మరణశిక్ష పడిన ఇద్దరు ఉగ్రవాదులను పాకిస్థాన్ ఉరి తీసింది. శ్రీలంక బృందంపై దాడి కేసులో మరణశిక్ష పడిన
అర్షద్, ఉస్మాన్ అనే ఇద్దరు ఉగ్రవాదులకు శుక్రవారం ఉరిశిక్ష అమలు చేసింది.
ఉగ్రవాద సంబంధిత దాడుల కేసుల్లో మరణశిక్ష అమలుపై ఉన్న నిలుపుదలను పాకిస్థాన్ బుధవారం ఎత్తేసింది. పెషావర్ లో సైనిక స్కూల్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రధాని నవాజ్‌షరీఫ్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. పెషావర్ దాడిలో132 మంది విద్యార్థులు సహా 148 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
కాగా, ఇద్దరు ఉగ్రవాదులకు ఉరిశిక్ష అమలుచేయడంతో లాహోర్ లో అప్రమత్తత ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.