పగలు ఎండ రాత్రి చలి
పోచమ్మమైదాన్ : పగలు ఎండ.. రాత్రి చలిగాలులు జిల్లావాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారుు. ఉదయం ఏడు గంటలకే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక.. సాయంత్రం ఏడు గంటలకే చలిగాలులు వీస్తున్నారుు. మొత్తానికి క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నారుు. బుధవారం 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతి సంవత్సరం మార్చి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరి వారంలోనే మా ర్పు కన్పిస్తోంది.
ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే ముందుముందు ఎలా ఉంటాయోనని నగర వా సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో వాహనదారులు మధ్యాహ్నం సమయంలో బయట కు రాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మ ద్యాహ్నం రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నారుు. అత్యవసర పని ఉన్న వారు ఫేస్‌కు మాస్క్ లు, తలకు క్యాప్‌లు ధరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోం ది. రాత్రి పూట మళ్లీ చలిగాలు తప్పడం లేదు. ఎండలను తట్టుకోలేక శీతలపానీయాలపై ప్రజలు దృష్టి సారించారు.
తేదీ కనిష్టం గరిష్టం
24 15.0 36.8
23 16.0 36.5
22 20.0 36.2
21 20.3 36.0
20 20.2 35.8
19 19.5 34.9