cooli
-
విద్యుదాఘాతంతో కూలీ మృతి
సల్కాపురం(గూడూరు రూరల్): విద్యుదాఘాతంతో కూలీ మృతి చెందాడు. ఈ ఘటన సల్కాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. సి.బెళగల్ మండలం కె. శింగవరం గ్రామానికి చెందిన తెలుగు రాముడు(50) మూడు నెలల కిందట సల్కాపురంలోని షేక్ ఇస్మాయిల్ వద్ద పనికి కుదిరాడు. పత్తి పొలానికి నీరు కట్టేందుకు శనివారం ఉదయం ఇస్మాయిల్ కుమారుడు షేక్ షేక్షావలీతో కలిసి పొలానికి వెళ్లాడు. మోటార్‌ను ఆన్ చేసి నీరు కడుతుండగా కాలికి తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. గమనించిన షేక్షావలీ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్ఐ మల్లికార్జున ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అవివాహితుడైన రాముడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విద్యుదాఘాతంతో కూలీ మృతి
గరికపాడు (క్రోసూరు): విద్యుదాఘాతంతో ఓ వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గరికపాడు గ్రామానికి చెందిన రాయపాటి కృష్ణ (37) వ్యవసాయ కూలీగా పనులు చేస్తుంటాడు. పొలంలో అరక దున్నుతుండగా కిందకి వేలాడుతున్న తీగ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్లు గమనించి సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెండాడు. మృతుడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు బంధువులు తెలిపారు. -
తిరగబడ్డ ‘ఎర్ర’ కూలీలు
చంద్రగిరి: శేషాచలంలో ఎర్రచందనం చెట్లును కూల్చి దుంగలు తరలించడానికి వచ్చిన కూలీలు పోలీసులపై దాడికి యత్నించారు. పోలీసులు అప్రమత్తం కావడంతో వారిని చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఈ ఘటన మామండూరు వద్ద ఉన్న అబ్బాలి రామానాయుడు మామిడితోట సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలను శనివారం పోలీసులు విలేకరులకు తెలిపారు. ఎస్ఐ జయచంద్ర మాట్లాడుతూ మామండూరు సమీపంలోని అబ్బారి రామానాయుడు మామిడి తోట సమీపంలో ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తున్నట్టు శుక్రవారం రహస్య సమాచారం అందిందన్నారు. సీఐ మల్లికార్జున గుప్తా ఆదేశాల మేరకు ఎస్టీఎఫ్ సిబ్బందితో అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించామన్నారు. కూలీలు గొడ్డళ్లు, కర్రలు, రాళ్లతో ఒక్కసారిగా దాడికియత్నించారన్నారు. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంతో 17మంది ఎర్రకూలీలను పట్టుకున్నట్టు తెలిపారు. అయితే మరో ఇద్దరు కూలీలు పరారయ్యారన్నారు. పట్టుబడిన వారినుంచి ఓ టాటా సుమో, 20 ఎర్రచందనం దుంగలు,దాడికియత్నించిన గొడ్డళ్లు, కర్రలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కూలీలు తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి, ధర్మపురి జిల్లాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. అనంతరం కూలీలపై కేసు నమోదు చేసి కోర్టుకుతరలించినట్టు ఆయన వెల్లడించారు.