‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’పై బోర్డు కమిటీ చర్చ
న్యూఢిల్లీ: ఆర్ఎం లోధాప్యానెల్ సూచించిన సంస్కరణల అమలుపై ఏర్పాటైన బీసీసీఐ కమిటీ శనివారం తొలిసారిగా సమావేశమైంది. మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్, ఒక రాష్ట్రం ఒక ఓటు అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. ముఖ్యంగా ఈ రెండు అంశాలపై పునరాలోచించాలని సుప్రీం కోర్టును కోరనున్నట్టు సమావేశంలో పాల్గొన్న ఓ సభ్యుడు తెలిపారు.
‘రొటేషన్ పద్ధతిలో ముంబై క్రికెట్ సంఘం ఓటు వేయాల్సిన పరిస్థితి రావడం దారుణం. భారత క్రికెట్కు ముంబై చేసిన సేవలు అమూల్యం. జాతీయ క్రీడా బిల్లును దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ సూచనలపై కూడా మేం చర్చించాం. ఈనెల 7న మరోసారి సమావేశమవుతాం’ అని ఆ సభ్యుడు వివరించారు.