చల్లటి నీరు కోసం ఘర్షణ.. వ్యక్తి హత్య
చౌటుప్పల్: చల్లటి నీరు కోసం సెక్యూరిటీ గార్డులు ఘర్షణ పడి సహచరుడిని హత్య చేసిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం సంగడపల్లి శివారులోని డిస్కవరీ కంపెనీ వద్ద శనివారం రాత్రి ఈ హత్య జరిగింది.
వివరాల్లోకి వెళ్లితే....బిహార్ రాష్ట్రానికి చెందిన భువన్‌కుమార్(22), విజయ్‌కుమార్(20)తోపాటు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సురేందర్ (40) డిస్కవరీ కంపెనీలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. భువన్, విజయ్‌ల దగ్గరకు వచ్చిన మేనల్లుడు సుజల్ శనివారం రాత్రి తనకు తాగేందుకు చల్లటి నీరు కావాలని సురేందర్‌ను కోరాడు. నీరు ఇవ్వకపోవడంతో విషయాన్ని మేనమామలకు తెలిపాడు. వారు కోపంతో వచ్చి సురేందర్‌తో ఘర్షణ పడ్డారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో బండరాయితో సురేందర్ తలపై గట్టిగా మోదడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం నిందితులు పరారయ్యారు. ఎస్ఐ నవీన్‌కుమార్ నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.