ఆది నుంచీ గందరగోళం!
అయోమయంలో అకడమిక్ కోఆర్డినేటర్ పోస్టులు
ఇంటర్వూలు ముగిసినా వెలువడని ఫలితాలు
రాయవరం : విద్యాశాఖలో పర్యవేక్షణ పెంచేందుకు ప్రభుత్వం మండల అకడమిక్ ఫెర్ఫార్మెన్స్ పోస్టులను సృష్టిం చింది. మండలానికి మూడు పోస్టులు వంతున ఎంపిక చేసేందుకు విద్యాశా ఖ చర్యలు చేపట్టింది. అందులో భా గంగా ఆన్లైన్ పరీక్ష నిర్వహించి ఇం టర్వూలు కూడా చేసింది. ఇది జరిగి నెల రోజులు గడుస్తున్నా నేటికీ ఫలితా లు మాత్రం ప్రకటించలేదు.
మండలానికి మూడు పోస్టులు
ప్రతి మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్‌కు ఒక్కొక్క మండల అకడమిక్ ఫెర్ఫార్మెన్స్ కోఆర్డినేటర్ పోస్టు మంజూరు చేస్తూ ప్రభుత్వం గత నెలలో ఉత్తర్వులు జారీ చేసిం ది. ఈ పోస్టులకు ప్రతి మండలంలో ఉ పాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. తొలుత అర్హత వయస్సు 40 ఏళ్ల లోపు, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ వారిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. అనంతరం నిబంధనలు సడలించి స్కూల్ అసిస్టెంట్‌తో పాటు ఎస్జీటీ క్యాడర్ వారిని, 45 ఏళ్ల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వూలు
జిల్లాలో 64 మండలాలకు ఒక్కొక్క మండలానికి ముగ్గురు వంతున 192 మందిని ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ విధంగా జిల్లాలో సుమారు 320 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు. అయితే ఒక్కో మండలానికి మూడు పోస్టులు అవసరం.కొన్ని మండలాల్లో కేవలం ఒక్కరే దరఖాస్తు చేయగా, మరి కొన్ని మండలాల్లో 10 మంది వరకు దరఖాస్తు చేశారు. గత నెల 26న రాజమండ్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నందు 75 మార్కులకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. గత నెల 28 నుంచి 30వ తేదీ వరకు డివిజన్ల వారీగా ఉపాధ్యాయులకు ఇంటర్వూ్యలు నిర్వహిం చారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలోఇంటర్వూ్యలు చేశారు.
నెలరోజులు గడుస్తున్నా...
ఇంటర్వూ్య అనంతరం రెండు రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తార ని ఆశించారు. అయితే నేటి వరకు ఫలితాలు ప్రకటించక పోవడంతో అసలు మండల అకడమిక్ ఫెర్మార్మెన్స్ కోఆర్డినేటర్ పోస్టులు ఎంపిక ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి.ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ఇప్పుడు విద్యాశాఖ మిన్నకుండి పోవడం వెనుక ఆంతర్యం ఏమిటోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల వద్ద పీఏలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను డెప్యుటేషన్‌పై నియమించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వెంటనే విధుల్లోకి రావాల్సిందిగా ఆదేశించడంతో 60 మంది వరకు ఉపాధ్యాయులు తమ విధుల్లో చేరారు. దీంతో ఎంఈపీఎస్లుగా ఉపాధ్యాయులను నియమిస్తే ఎటువంటి అభ్యంతరాలు వస్తాయోనన్న ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు సమాచారం. మండల అకడమిక్ కోఆర్డినేటర్లుగా ఉపాధ్యాయుల నియామకంపై సరైన విధివిధానాలు రూపొందించిన తర్వాతే ఫలితాలు ప్రకటిస్తారన్న సమాచారం వినపడుతోంది.
ఆదేశాలురావాలి
మండల అకడమిక్ ఫెర్ఫార్మెన్స్ కోఆర్డినేటర్ పోస్టుల ఎంపికపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ఆదేశాలు వచ్చిన వెంటనే ఫలితాలు ప్రకటించి ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.
ఆర్.నరసింహారావు, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ