Corp.
-
మార్కెట్లోకి మళ్లీ హీరో కరిజ్మా..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా కరిజ్మా బ్రాండ్‌ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 సీసీ బైక్‌ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1.72 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంటుంది. ప్రీమియం సెగ్మెంట్లో తమ వాటాన్ని పెంచుకునే దిశగా తమకు ఇది మరో మైలురాయి అని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. తాము ప్రస్తుతం ఈ విభాగంలో ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, మార్కెట్ వాటా 4–5 శాతం మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను పూర్తి స్థాయిలో వేగవంతంగా రూపొందించుకోనున్నట్లు గుప్తా చెప్పారు. ప్రస్తుతం 150 సీసీ లోపు సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ ఇకపై 150 సీసీ నుంచి 450 సీసీ వరకు బైక్‌ల సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది వ్యవధిలో ప్రతి మూడు నెలలకోసారి ఒక కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
నేనింతే
మేయర్‌కు కమిషనర్ ఝలక్ సి‘ఫార్సు’లు చెత్తబుట్టలోకి.. టౌన్‌ప్లానింగ్ అక్రమాలపై డేగ కన్ను విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్ అధికార పక్షానికి షాక్ ఇచ్చారు. అడ్డగోలు సిఫారసులను పక్కన పడేస్తున్నారు. బదిలీలు, పదోన్నతుల వ్యవహారంలోనూ తనదైన శైలిలో సాగుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వద్ద హుందాగా వ్యవహరిస్తున్నారు. కమిషనర్ విధి నిర్వహణలో ముక్కుసూటిగా పోతున్నారు. దీంతో మేయర్, కమిషనర్ల మధ్య పవర్ గేమ్ పతాక స్థాయికి చేరింది. భయపడుతున్న అక్రమార్కులు టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి పేట్రేగడంతో కార్పొరేషన్ అల్లరిపాలవుతోంది. గత నెలలో నగరపాలక సంస్థలో సమీక్ష నిర్వహించిన మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల వ్యవహార శైలిపై చర్చించారు. తన మాట ఎవరూ విన డం లేదని సిటీప్లానర్ చక్రపాణి చెప్పడం, దానికి మేయర్ చురకలు అంటించడంతో ప్రతిష్ట మరింత దిగజారింది. ఈ క్రమంలో ఆరోపణలు రుజువైతే దండించాలనే నిర్ణయానికి కమిషనర్ వచ్చినట్లు తెలుస్తోంది. శైలజపై సరెండర్ వేటు వేసిన కమిషనర్.. మరో ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల అక్రమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమార్కులకు వణుకు మొదలైంది. ఆచితూచి నిర్ణయం అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) విభాగంలో ఎస్సీ రుణాల మంజూరు పేరుతో అవకతవకలు జరిగిన సందర్భంలో పోలీస్ కేసు పెట్టాల్సిందిగా మేయర్ కమిషనర్‌ను కోరారు. శాఖాపరమైన విచారణ వైపే హరికిరణ్ మొగ్గుచూపారు. దర్గా భూముల తీర్మానం తారుమారైన ఘటన కౌన్సిల్‌ను కుదిపేసింది. సెక్రటరీ సెల్ ఉద్యోగుల వల్లే ఈత ప్పు జరిగిందని మేయర్ సభలో చెప్పారు. బాధ్యులపై పోలీస్ కేసు పెట్టాల్సిందిగా మేయర్ కోరినప్పటికీ కమిషనర్ విచారణ నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగిని సర్కిల్-3కు బదిలీ చేయాల్సిందిగా మేయర్ చేసిన ప్రతిపాదనను కమిషనర్ పక్కనపెట్టారు. టీఎన్‌టీయూ సమావేశం గుల్జార్ సమావేశ మందిరంలో జరపాలని యూనియన్ నేతలు నిర్ణయించగా నిబంధనలు అంగీకరించవని కమిషనర్ స్పష్టంచేశారు. కంగుతిన్న మేయర్ వర్గం టౌన్ ప్లానింగ్ విభాగంలో గతంలో అక్రమాలకు పాల్పడిన స్కావెండీష్ను మాతృశాఖకు కమిషనర్ సరెండర్ చేశారు. అక్రమాల ఆరోపణలు రుజువు కావడంతో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ శైలజను డెరైక్టర్ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ (డీటీసీపీ)కి సరెండర్ చేయడం ద్వారా తన పవర్ ఏమిటో పాలకపక్షానికి తెలియజెప్పారు. టీడీపీ వర్గాలతో సన్నిహితంగా ఉండే శైలజ పటమట, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా అక్రమ కట్టడాలను ప్రోత్సహించారు. గ్రీవెన్స్‌డేలో ఫిర్యాదులు అందడంతో కమిషనర్ సీరియస్ అయ్యారు. సరెం డర్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే మేయర్ కోనేరు శ్రీధర్ కమిషనర్‌కు సర్దిచెప్పారు. అంతా అయిపోయిందని అనుకుంటుండగా శైలజ చేతికి సరెండర్ ఆర్డర్ వచ్చింది. దీంతో మేయర్ వర్గం కంగుతింది. -
మూడొంతులుమురికిలోనే..
3.39 లక్షల మంది మురికివాడల్లో నివాసం పమాదభరితంగా 31 వాడలు దుర్భరంగా మారిన నగర జీవనం ఆదుకోని ప్రభుత్వ పథకాలు ఊరిస్తున్న రాజీవ్ ఆవాస్‌యోజన సాక్షి, హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా పేరొందిన వరంగల్‌లో అభివృద్ధి ఛాయలు కనిపించడం లేదు. గ్రేటర్ వరంగల్‌గా మార్పుకు సుముఖత.. కేంద్ర ప్రభుత్వ నిధులతో త్వరలో స్మార్ట్‌సిటీ పథకం అమలు.. అంటూ పాలకులు ప్రజలను మభ్య పెట్టడం తప్పితే నగర సమగ్రాభివృద్ధికి ఇన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలు శూన్యం. నగర జనాభాలో మూడొంతుల మంది ఇప్పటికీ మురికివాడల్లో అరకొర సౌకర్యాల నడుమ దుర్భర జీవనం సాగిస్తున్నారు. వీరికి పక్కా ఇళ్లు, మౌలిక సదుపాయాలను కల్పించడంలో బల్దియా అధికారుల తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దానితో మురికికూపాల్లో నివసిస్తున్న జనాభా మూడు లక్షలు దాటింది. వరంగల్ నగర జనాభా ప్రస్తుతం 8,19,249 ఉంది. ఈ జనాభాలో 3.39 లక్షల మంది మురికివాడల్లో జీవిస్తున్నారు. విలీన గ్రామాలను మినహాయిస్తే నగరంలో 84 మురికివాడలు ఉన్నట్లుగా అధికారికంగా గుర్తించగా.. ఇక్కడ 1,58,334 మంది ప్రజలు నివసిస్తున్నారు. అధికారిక గుర్తింపుకు నోచుకోకపోయినప్పటికీ మురికివాడలుగా పేరొందినవి మరో 62 వీధులు ఉన్నాయి. ఇక్కడ 85,769 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. విలీన గ్రామాలు కాకుండా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చూస్తేనే 6,20,000 జనాభా ఉండగా.. ఇందులో 2,44,113 మంది మురికివాడల్లో ఉండటం గమనార్హం. ఆదుకోని ఆవాస్‌యోజన.. విలీనగ్రామాలను మినహాయిస్తే 146 మురికివాడలు నగరంలో ఉండగా ఇక్కడ 4,166 కుటుంబాలకు నివసించేందుకు కనీసం సరైన ఇళ్లు లేవు. వీరంతా కార్పొరేషన్ పరిధిలో పూరిగుడిసెలు, డేరాలు వంటి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుని నివసిస్తున్నారు. వీరితో పాటు పక్కా ఇళ్లు లేకుండా నివసిస్తున్న కుటుంబాల సంఖ్య 18,616గా ఉంది. అరుతే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రాాజీవ్ ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధి పొందేందుకు కార్పొరేషన్ పరిధిలో ఎదురుచూస్తున్న కుటుంబాల సంఖ్య ఇరవై వేలకు పైమాటగానే ఉంది. కానీ, ఇప్పటి వరకు కార్పొరేషన్ పరిధిలో ఆర్వైఏ పథకం అమలుకు నోచుకోలేదు. అత్యవసరంగా పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన కుటుంబాల సంఖ్య 4,166గా ఉండగా.. ఇందులో ఆరోవంతు కంటే తక్కువ మందికి మొదటిదశ కింద రూ.31.58 కోట్లతో 576 పక్కా గృహాలు మంజూరయ్యాయి. వీటిని జితేందర్‌నగర్, అంబేద్కర్నగర్లలో నివసిస్తున్న పేదలకు నిర్మించి ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇవి పూర్తరుున తర్వాత మలిదశ కింద గాంధీనగర్, మీరాసాహెబ్కుంటలో ఈ పథకాన్ని అమలు చే స్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదభరింగా 31 కాలనీలు.. నగరంలో 146 మురికివాడలు ఉండగా వీటిలో 31 వాడలు చెరువు, వరదముంపులో, కొండచరియలు విరిగిపడే ప్రమాదభరిత ప్రాంతాల్లో ఉన్నాయి. వాస్తవానికి వీరిని ఈ ప్రాంతాల నుంచి తరలించి సురక్షిత ప్రాంతంలో ఆవాసం కల్పించాల్సి ఉంది. కానీ ఈ దిశగా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా మురికివాడల్లో నివసిస్తున్న జనాభాలో దళితులు, మైనార్టీల జనాభానే ఎక్కువగా ఉంది. అధికారికంగా గుర్తించినవి 84 మురికివాడలు ఉండగా వీటిలో 17 పూర్తిగా హరిజన వాడలు కావడం గమనార్హం. అంతేకాదు.. మైనార్టీలు అధికంగా ఉండే ఉర్సు, కరీమాబాద్ ప్రాంతాలు సైతం మురికివాడల జాబితాలోనే ఉన్నాయి. -
లక్ష్యం గోరంత.. నిర్లక్ష్యం బోలె డంత!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో సంక్షేమ పథకాలు, పేదలకు రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్ల తీరుపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షలో ఆయా శాఖల నుంచి ఇదేతీరు వ్యక్తమైంది. చిన్న చిన్న టార్గెట్లను కూడా చేరని బ్యాంకులపై జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా రిజర్వ్ బ్యాంకు ఏజీఎంకు ఫిర్యాదు చేశారు. కీలకమైన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశానికి డుమ్మా కొట్టిన బ్యాంకు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎల్డీఎంను ఆదేశించారు. మైనార్టీ రుణాలకు‘అధోగతి’ రుణాల మంజూరులో ఎస్సీ కార్పొరేషన్, యువజన సంక్షేమం విభాగాలు లక్ష్యానికి చేరువలో ఉండగా, మైనార్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ల వెనుకబడి ఉండడంపై కలెక్టర్ ఆరా తీశారు. రుణాల మంజూరు నత్తనడకన సాగడంలో బ్యాంకుల నిర్లక్ష్యం ఉందని తేల్చారు. ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి.. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, యూకో బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మైనార్టీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, విజయాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, దీనాబ్యాంకులు జారీచేసిన అనుమతి పత్రాలు నాలుగుకు మించిలేవని తేల్చారు. సమావేశానికి ఆహ్వానించినా యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల ప్రతినిధుల గైర్హాజరుపై ఎల్డీఎంను వివరణ కోరారు. కాగా, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి బ్యాంకు శాఖలకు తగినన్ని దరఖాస్తులు కూడా అందలేదని బాంకర్లు ఫిర్యాదు చేయడంతో కార్పొరేషన్ అధికారులపై కలెక్టర్ మండిపడ్డారు. ఫిబ్రవరి 10, 20, 29 తేదీల్లో బ్యాంకర్లు, కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఎల్డీఎంను ఆదేశించారు. లక్ష్యానికి చేరువైన యువజన సంక్షేమ విభాగం, ఎస్సీ కార్పొరేషన్ అధికారులను కలెక్టర్ అభినందించారు. లక్ష్యానికి మించి రుణాలిస్తాం: లక్ష్మణ్ కుమార్ ఎస్సీ కులాలకు చెందిన పేదలకు ఆర్థికంగా చేయూతనిచ్చే ఉద్దేశంతో ఎస్సీ యాక్షన్ ప్లాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరు నుంచి అమల్లోకి తెచ్చిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మణ్‌కుమార్ చెప్పారు. మంజూరైన రుణ ంలో 60శాతం సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి, నగరంలోని మురికివాడల్లో నివసిస్తున్న ఎస్సీలకు రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్ జిల్లాలో బ్యాంకులు కన్సెంట్లు ఇచ్చిన పక్షంలో అవసరమైతే ఈ ఏడాది వార్షిక లక్ష్యానికి మించి కూడా సబ్సిడీ విడుదల చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ సంసిద్ధంగా ఉందన్నారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకొనే వారికి త్వరితగతిని కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో లీడ్‌బ్యాంక్ మేనేజర్ భరత్‌కుమార్, రిజర్వ్ బ్యాంక్ ఏజీఎం బి.సరోజిని, ఎస్బీహెచ్ ఎజీఎం బద్రీనాథ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ సలీంపాషా, బీసీ కార్పొరేషన్ ఈడీ ఖాజానజీం అలీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శివప్రసాద్, యువజన సంక్షేమాధికారి సత్యనారాయణరెడ్డి తదితరులున్నారు.