షరతులతో కూడిన ‘నైట్ లైఫ్’
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో అర్ధ రాత్రి వరకు బార్లు, పబ్‌లు, హోటళ్లు తెరచి ఉంచడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రారంభంలో ప్రయోగాత్మకంగా శుక్ర, శనివారాల్లో రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వీటిని అనుమతిస్తారు. కార్పొరేట్ సంస్థలు ఎన్నో ఏళ్లుగా నైట్ లైఫ్‌ను విస్తరించాలని కోరుతూ వస్తున్నాయి. దీని వల్ల వేల మందికి కొత్తగా ఉపాధి కలుగుతుందని కూడా విన్నవించాయి.
ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ, శాంతి భద్రతల దృష్ట్యా అలాంటి అనుమతులు మంచిది కాదని పోలీసు శాఖ అభ్యంతరం చెబుతూ వచ్చింది. చివరకు ఏక మొత్తంగా కాకుండా వారంలో రెండు రోజులు అనుమతి ఇచ్చి చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని పరిశీలించిన అనంతరం వారమంతా నైట్ లైఫ్ విస్తరణకు అనుమతి ఇవ్వాలని భావిస్తోంది.