మారుతీ కొత్త స్విఫ్ట్ వచ్చేస్తోంది...
న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘సుజుకీ’ తాజాగా 2017 స్విఫ్ట్‌ను జపాన్ మార్కెట్లో ఆవిష్కరించింది. అక్కడ దీని ధర భారతీయ కరెన్సీ ప్రకారం రూ.7.78 లక్షలు– రూ.10.69 లక్షల శ్రేణిలో ఉంది. వీటి విక్రయాలు అక్కడ జనవరి 4 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సరికొత్త స్విఫ్ట్ వచ్చే ఏడాది రెండో అర్ధభాగంలో సుజుకీ కార్పొరేషన్ సబ్సిడరీ అయిన మారుతీ సుజుకీ ద్వారా భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.
కంపెనీ తాజా స్విప్ట్‌లో అటు ఇంటీరియర్స్‌లోనూ, ఇటు ఎక్స్టీరియర్స్లోనూ పలు మార్పులు చేసింది. కారులో ఎల్ఈడీ ల్యాంప్స్‌తో కూడిన ఫ్రంట్/రియర్ లైట్స్, హెక్జాగొనల్ గ్రిల్, స్పోర్టీ డి–టైప్ స్టీరింగ్ వీల్, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డ్యూయెల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. తాజా స్విఫ్ట్.. 1.2 లీటర్ 4 సిలిండర్ డ్యూయెల్ జెట్, 1.0 లీటర్ 3 సిలిండర్ బూస్టర్ జెట్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని వివరించింది. వీటిల్లో 6 స్పీడ్ ఏటీ, 5 స్పీడ్ ఎంటీ అనే ట్రాన్స్మిషన్ ఆప్షన్లు ఉన్నాయని పేర్కొంది.