cost of the election
-
లోక్‌సభ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు 1.32 కోట్లు
ఖమ్మం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌కు పోటీచేసిన అభ్యర్థుల వ్యయ వివరాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి మొత్తం 27మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 21 మంది అభ్యర్థులు మాత్రమే ఖర్చుల వివరాలను అందజేశారు. వీరు మొత్తం రూ.1,32,67,835లను ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపారు. ఒక్కొక్క పార్లమెంట్ అభ్యర్థి రూ.70 లక్షలు, అసెంబ్లీ అభ్యర్థి రూ.28 లక్షలు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. పరిమితికి మించి ఖర్చు చేసిన అభ్యర్థులపై క్రిమినల్ కేసులతో పాటు వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల ఖర్చుకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యయ పరిశీలకులనూ నియమించింది. ఎన్నికల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 డిపాజిట్‌గా, ఇతర అభ్యర్థులకు రూ.25 వేలుగా నిర్ణయించింది. చాలా మంది అభ్యర్థులు డిపాజిట్ చేసిన మేరకు కొద్దిగా అటూఇటుగా ఖర్చు చేసినట్లు చూపించారు. 153 మంది వ్యయ వివరాలిచ్చారు.. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ శ్రీనరేశ్ ఖమ్మం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన 170 మంది అభ్యర్థులకు 153మంది వ్యయ వివరాలను సమర్పించారని జిల్లా కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్ తెలిపారు. ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం డెరైక్టర్ జనరల్ పి.కె.డ్యాస్ జిల్లా ఎన్నికల అధికారి, వ్యయ పరిశీలకులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను పూర్తిస్థాయిలో ఖర్చుల వివరాలు అందించాలని ఆదేశించామన్నారు. మిగిలిన వారిని సైతం నివేదికలు ఇచ్చేలా మళ్లీ ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. మీడియా సర్టిఫికెట్, మానిటరింగ్ కమిటీ గుర్తించి పెయిడ్ న్యూస్, పత్రికా ప్రకటనలకు సంబంధించి అభ్యర్థులకు నోటీ సులు ఇచ్చామన్నారు. సదరు ఖర్చులను వారి ఖాతాలో జమచేశామని తెలిపారు. డెరైక్టర్ జనరల్ మాట్లాడుతూ అభ్యర్థులు అందిం చిన ఎన్నికల ఖర్చులకు సంబంధించిన రిపోర్టులను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. ఇప్పటి వరకు ఖర్చుల వివరాలను అందించని అభ్యర్థుల నుంచి వెంటనే వివరాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఏయే అంశాల్లో మెరుగ్గా వ్యవహరించారో వివరాలు అందించాలని సూచించారు. వ్యయ పరిశీలకులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమైన అంశాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్ట్రానిక్ మెయిల్ పంపాలని చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌లో మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ వ్యయ పరిశీలకులకు రాజ్‌కుమార్, ముత్తు శంకర్, జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్, ఎన్నికల ఖర్చుల నోడల్ అధికారి శ్రీనివాస్, ఎన్నికల తహశీల్దార్ యూసుఫ్‌అలీ పాల్గొన్నారు. -
అభ్యర్థుల వ్యయ వివరాలను వెబ్‌లో పెట్టండి
వారు వివరాలిచ్చిన 72 గంటల్లోగా అప్లోడ్ చేయండి అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో (అసెంబ్లీ, లోక్‌సభ) పోటీచేసిన అభ్యర్థుల వ్యయ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను ఆయా అభ్యర్థులు సమర్పించిన 72 గంటల్లోగా ఈసీ వెబ్సైట్లోకి అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ మేరకు శుక్రవారం అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారు(సీఈఓ)లకు ఆదేశాలు జారీచేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 78వ సెక్షన్ ప్రకారం.. ప్రతి అభ్యర్థీ సంబంధిత నియోజకవర్గ ఫలితాన్ని ప్రకటించిన 30 రోజుల్లోగా తన ఎన్నికల వ్యయాన్ని జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పారదర్శకత కోసం అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని వారి నుంచి వివరాలు తీసుకున్న 72 గంటల్లోగా సీఈఓ/డీఈఓ వెబ్సైట్లో పొందుపరచాలని ఈసీ ఆదేశించింది. అంతేకాకుండా అభ్యర్థి ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలను ఎవరైనా కోరితే.. ఒక పేపరుకు రూపాయి చొప్పున తీసుకుని వాటిని ఇవ్వాలని సూచించింది. అదే సీడీ లేదా డీవీడీ ద్వారా అయితే రూ.300 చొప్పున తీసుకొని వివరాలను అందజేయాలని పేర్కొంది. -
ఓట్లు.. కోట్లు
జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం రూ.400 కోట్ల పైమాటే అత్యధికంగా చంద్రగిరిలో రూ.60 కోట్ల వ్యయం ఓటుకు రూ.1000 నుంచి రూ.2000 వరకు పంపిణీ చిత్తూరు, తిరుపతిలో టీడీపీదే సింహభాగం జిల్లాలో ఓట్లకోసం రాజకీయ నాయకులు కోట్ల రూపాయలతో ఆటలాడేసుకున్నారు. కరెన్సీ కట్టలు తెంచేసి ఓటర్లపై వెదజల్లేశారు. పార్టీ పరిస్థితి, అభ్యర్థిని బట్టి రేటు పెంచేశారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం పది కోట్ల రూపాయలకుపైగా ఖర్చయిందంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందో తెలుసుకోవచ్చు. ఇందులో సింహభాగం టీడీపీ అభ్యర్థులే ఖర్చు చేసినట్టు విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. సాక్షి, చిత్తూరు : ఓట్ల కోసం కోట్లు కుమ్మరించడం రాజకీయ నాయకులకు కొత్తకాదు. ఈసారి మరీ బరితెగించేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కట్టలు తెంచేసి డబ్బు వెదజల్లేశారు. ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ముట్టజెప్పి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 14 అసెంబ్లీ, తిరుపతి, రాజంపేట, చిత్తూరు లోక్‌సభకు నిర్వహించిన ఎన్నికల్లో రూ.400 కోట్లకుపైగా ఖర్చయినట్టు సమాచారం. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ ఈసారి రూ.10 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. చిత్తూరు, తిరుపతిలో అన్ని రాజకీయ పార్టీలు రూ.50 కోట్ల దాకా ఖర్చు చేయగా ఒక్క చంద్రగిరిలో టీడీపీ మాత్రమే రూ.30 కోట్లు కుమ్మరించినట్టు తెలుస్తోంది. తిరుపతిలో 2004, 2012కన్నా ఈ సారి ఎక్కువ మొత్తంలో వివిధ రాజకీయపార్టీలు ఖర్చుచేసినట్టు సమాచారం. టీడీపీ అభ్యర్థి డబ్బులను మంచినీళ్లలా ఖర్చుచేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి డబ్బులు, మద్యం పంచడం, చికెన్ ఇవ్వడం, ఇతర చిన్నచిన్న వస్తువులను కానుకలుగా ఇవ్వడం వంటివి చేసినట్టు తెలుస్తోంది. దీనికి తోడు చోటామోటా నాయకులు జారిపోకుండా చూసుకునేందుకు వారికి ఒక్కొక్కరికీ ఒక్కో రేటు ఫిక్స్ చేసి ఎన్నికల్లో ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది. ఈ తరహా ప్రయత్నాలకు ఈ సారి కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్టు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో డబ్బుకోసం ఓటర్లు అభ్యర్థుల వెంట పడడంతో వారు మరింత బరితెగించేసినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా ఖర్చు వివరాలు చూస్తే - తిరుపతి నియోజకవర్గంలో టీడీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అనధికారిక అంచనా. ఇందులో సింహభాగం తెలుగుదేశందే. ఈ పార్టీ రూ.40 కోట్లకుపై ఖర్చుచేసినట్లు విశ్లేషకుల అంచనా. - చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి డబ్బును కుమ్మరించేశారని సమాచారం. నియోజకవర్గం మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు రూ.50 కోట్లకు పైగా ఖర్చుచేసినట్టు తెలుస్తోంది. - శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల వ్యయం రూ.25 కోట్లు అయితే అందులో ఒక్క టీడీపీనే రూ.10 కోట్లకుపైగా ఖర్చుచేసినట్టు సమాచారం. - చంద్రగిరి నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధికంగా రూ.60 కోట్ల వరకు ఖర్చుచేసినట్టు భోగొట్టా. టీడీపీ అభ్యర్థే రూ.30 కోట్ల వరకు వెదజల్లినట్టు అంచనా. - పలమనేరు నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం రూ.25 కోట్లు దాటింది. - సత్యవేడు నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చు రూ.10 కోట్ల పైమాటే. ఇందులో టీడీపీనే రూ.6 కోట్ల వరకు ఖర్చుచేసినట్లు సమాచారం. - నగరి నియోజకవర్గంలో అన్ని రాజకీయపార్టీలు రూ.10 కోట్లకు పైగా ఖర్చుచేసినట్టు తెలిసింది. - పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఎన్నికల వ్యయం రూ.12 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. పోటీ గట్టిగా ఉన్న మండలాల్లో ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు పంచాల్సి వచ్చింది. - పుంగనూరు నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయాం రూ.30 కోట్లు దాటిందనేది విశ్లేషకుల అంచనా. - కుప్పం నియోజకవర్గంలోనూ రూ.20 కోట్లకు పైగా అన్ని రాజకీయపార్టీలు వ్యయం చేయాల్సి వచ్చింది. - మాజీ సీ.ఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి సొంత నియోజకవర్గంలో రూ.30 కోట్ల వరకు ఖర్చుచేసినట్టు తెలుస్తోంది. - జీ.డీనెల్లూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో రూ.8 కోట్ల వరకు ఖర్చుచేసినట్టు సమాచారం. - తంబళ్లపల్లె నియోజకవర్గంలో రూ.18 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్క టీడీపీ నుంచే రూ.12 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్టు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. -
అమెరికా తర్వాత మనమే..
ఎన్నికల ఖర్చు రూ.30 వేల కోట్లు... ఈసారి లోక్‌సభ ఎన్నికలకు రూ.30 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈ మేరకు ఖర్చు చేయనున్నారు. రెండేళ్ల కిందట జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 700 కోట్ల డాలర్లు (సుమారు రూ.42 వేల కోట్లు) ఖర్చు కాగా, ఎన్నికల ఖర్చులో అమెరికా తర్వాతి స్థానం మనదే. లెక్కలకు చిక్కని భారీ సొమ్ము ఎన్నికల కోసం ఖర్చయ్యే అవకాశాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చెబుతోంది. కోటీశ్వరులైన అభ్యర్థులు ఎన్నికల్లో భారీ ఎత్తున సొమ్ము వెదజల్లే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ఖర్చుగా అంచనా వేసిన మొత్తం రూ.30 వేల కోట్లలో ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా రూ.7 వేల నుంచి రూ.8 వేల కోట్ల దాకా వెచ్చించాల్సి రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్ రూ.3,500 కోట్లు ఖర్చు చేయనుంది. ఎన్నికల సమయంలో భద్రత, రవాణా వంటి అవసరాల కోసం హోంశాఖ, రైల్వే శాఖలు కూడా దాదాపు ఎన్నికల కమిషన్ స్థాయిలోనే ఖర్చు చేయనున్నాయి. అభ్యర్థుల గరిష్ట వ్యయ పరిమితిని రూ.70 లక్షలకు పెంచడం వల్ల కూడా ఈసారి ఎన్నికల ఖర్చు మొత్తం రూ.30 వేల కోట్లు దాట వచ్చనే అంచనాలు ఉన్నాయి. లోక్‌సభ బరిలోని 543 స్థానాల నుంచి పోటీచేసే అభ్యర్థులు దాదాపు రూ.4 వేల కోట్ల మేరకు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు అభ్యర్థుల కంటే, వారిని బరిలోకి దించిన రాజకీయ పార్టీలే ఎక్కువగా ఖర్చు చేసేవి. ఇటీవల కొన్నేళ్లుగా పరిస్థితి మారింది. కొన్నిచోట్ల పార్టీల కంటే భారీగా అభ్యర్థులే ఖర్చు చేస్తున్నారు. ఈ సొమ్మంతా కోటీశ్వరులైన అభ్యర్థులు, కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్ల నుంచి వచ్చి పడుతోందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చెబుతోంది.