పెద్దింటి అమ్మవారికి కాసుల హారం
ఆకివీడు: ఆకివీడు ఇలవేల్పు పెద్దింటి అమ్మవారికి 21 కాసుల బంగారంతో చేయించిన హారాన్ని అయిభీమవరం గ్రామానికి చెందిన కనుమూరు వెంకట కృష్ణంరాజు, సుబ్బలక్ష్మి దంపతులు ఆదివారం సమర్పించారు. రూ.5 లక్షల విలువైన బంగారంతో హారాన్ని తయారుచేయించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి హారాన్ని బహూకరించారు. అనంతరం అర్చకులు హారాన్ని అమ్మవారికి అలంకరించారు. ఏఎంసీ చైర్మన్ మోటుపల్లి ప్రసాద్, సర్పంచ్ గొంట్లా గణపతి, బొల్లా వెంకట్రావు, కిమిడి నాగరాజు, ఇల్లాపు అప్పారావు, సన్నిధి లక్ష్మణరావు, బోర్డు సభ్యులు, ఆలయ మేనేజర్ ఫణి కిషోర్ పాల్గొన్నారు.