ఒబామా పర్యటన ఖర్చును వెల్లడించలేం
ముంబై: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గత జనవరిలో భారత పర్యటనకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యయమెంతో చెప్పాలని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్తును విదేశాంగ శాఖ తిరస్కరించింది. ఇది సున్నిత సమాచారమని, దీనివల్ల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని స్పష్టంచేసింది.
అందువల్ల ఆర్టీఐ సెక్షన్ 8(1)(సీ) కింద ఈ సమాచారాన్ని బహిర్గతపరచలేమని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు, ఆయన వెంట వచ్చిన బృందానికి భారత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలపాలని ముంబైకి చెందిన అనిల్ గల్గాలి విదేశాంగ శాఖకు దరఖాస్తు చేశారు.