AP Rain Alert: కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం.. రానున్న మూడు రోజులు
సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం కోస్తాంధ్రపై ఆవరించి ఉంది. అదే సమయంలో ఉత్తర అండమాన్ నుంచి మధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరం వరకు తూర్పు–పశ్చిమ ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.
వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ బుధవారం రాత్రి ఓ నివేదికలో తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.