సీసీఐ మేనేజర్ బదిలీ
గుంటూరు: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆంధ్రప్రదేశ్ కార్యాలయ మేనేజర్ ఆర్.జయకుమార్ బదిలీ అయ్యారు. ఆయన్ని కోయంబత్తూరు కార్యాలయానికి బదిలీ చేస్తూ ముంబైలోని సీసీఐ ప్రధాన కార్యాలయం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పనిచేస్తున్న మోహిత్‌శర్మను ఇక్కడికి బదిలీ చేశారు. గతేడాది సీసీఐ పత్తి కొనుగోళ్లులో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ నేపథ్యంలో జయకుమార్‌ను, విజిలెన్స్ అధికారి నాయర్‌ను, ముగ్గురు సీసీఐ బయ్యర్లను బదిలీ చేశారు.
నాయర్‌ను ముంబైకి, అక్కడ పనిచేస్తున్న భట్‌ను ఇక్కడికి మార్చారు. కృష్ణా జిల్లా నందిగామ, మైలవరం మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్న బయ్యర్లు రాజశేఖరరెడ్డి, వరుణ్రఘువీర్లను తెలంగాణలోని అదిలాబాద్, వరంగల్‌లకు, గుంటూరు జిల్లాలోని క్రోసూరు మార్కెట్ యార్డుల్లో బయ్యరుగా పనిచేస్తున్న రాయపాటి పూర్ణచంద్రరావును ఒడిశాలోని రాయఘడ్కు బదిలీ చేశారు. మేనేజరు మోహిత్‌శర్మ రెండు, మూడు రోజుల్లో గుంటూరులో బాధ్యతలు చేపట్టనున్నారు.