పత్తిరైతు ఆత్మహత్య
వికారాబాద్: అప్పుల బాధ తాళలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా సీలారం గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నర్సింహులు(38) తనకున్న ఎకరాన్నర భూమితో పాటు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని పత్తిపంట సాగుచేస్తున్నాడు. ఈక్రమంలో గత రెండేళ్లుగా పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. అప్పుల బాధ పెరిగిపోయి గురువారం రాత్రి కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.