విజయనగరం ఆస్పత్రిలో దారుణం
పార్వతీపురం : విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ కడుపులో డాక్టర్లు కాటన్ పెట్టి కుట్టేశారు. అనంతరం బాధిత మహిళను డిశ్చార్జ్ చేశారు.
గత కొద్ది రోజులుగా ఆమెకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో పార్వతీపురంలోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు స్కానింగ్ చేయడంతో కడుపులో కాటన్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి కాటన్ను తొలగించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకంపై బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.