'కోర్టు తీర్పు మాకు సానుకూలం'
హైదరాబాద్: అంబేడ్కర్, తెలుగు విశ్వవిద్యాలయాలపై కోర్టు తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సానుకూలంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్క మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలన్నారు.
గవర్నర్ మాట కూడా లెక్కచేయకుండా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందని వాపోయారు. పాఠ్యపుస్తకాల్లో సిలబస్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. పాఠ్యపుస్తకాల్లో ఆంధ్ర కవుల, రచయితల పాఠాలను తొలగించడం దారుణమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.