దేశం మొత్తం ఒక్కటే డీఎన్ఏ
శ్రీనగర్‌కాలనీ: దేశం మొ త్తం ఒక్కటే డీఎన్ఏ ఉం దనే విషయాన్ని ఒవైసీకి చెప్పానని, టెస్ట్ చేయించుకోవడానికి రమ్మని సవాల్ విసిరినా, ఆయన ముందుకు రాలేదని మాజీ పార్ల మెంట్‌సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి అన్నారు. కాశీ విశ్వనాథస్వామి ఆలయాన్ని ముట్టుకోవద్దని ఒవైసీ అంటున్నారని, అక్కడ పూజించే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీ సత్యసాయి నిగమాగమంలో ఇస్కాన్ సంస్థకు చెందిన ‘కౌఇజం’ యూ ట్యూబ్ చానల్ ప్రారంభోత్సవం జరిగింది.
దీనికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో చెక్కు చెదరకుండా బతికున్న సంస్కృతి, హిందూ సంస్కృతి మాత్రమేనన్నారు. దేశంలోని ప్రతి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులపై ఉందని తెలిపారు. మన సంస్కృతి, నాగరికత ఆవు తోనే ముడిపడి ఉందని చెప్పారు. గోవును జాతీయ జంతువుగా చేయాలని పోరాడుతున్నామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు ఆవు అని, స్వలాభం కోసం మార్పులు చేసుకుని హస్తం గుర్తుగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఇస్కాన్ చైర్మన్ డాక్టర్ సహదేవ దాసా, బీఎస్ఎఫ్ మాజీ అడిషనల్ డీజీ పి.కె.మిశ్రా పాల్గొన్నారు.