అసెంబ్లీ భేటీలకు ఏర్పాట్లు పూర్తి: సీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు సీటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరగనున్న తరుణంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తాము అన్ని చర్యలు తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
స్పీకర్లు, మండలి చైర్మన్లు, పోలీసుల అధికారుల సమన్వయంతో జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరిగేంతవరకు సభలు, సమావేశాలు నిషేధించనున్నట్టు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగేంతవరకు నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.