హర్మన్‌ప్రీత్ సారథ్యంలో....
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఆ్రస్టేలియాలో పర్యటించే భారత పురుషుల హాకీ జట్టును ప్రకటించారు. చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ ఆధ్వర్యంలో భువనేశ్వర్‌లో 28 మంది ఆటగాళ్లతో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ జాబితా నుంచి రబిచంద్ర సింగ్‌ను తప్పించి మిగతా 27 మందితో టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా, హార్దిక్ సింగ్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతారు. పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా భారత జట్టు పెర్త్ వేదికగా ఏప్రిల్ 1, 6, 7, 10, 12, 13వ తేదీల్లో ఆస్ట్రేలియా జట్టుతో ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది.
భారత హాకీ జట్టు: పీఆర్ శ్రీజేశ్, కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా (గోల్‌కీపర్లు); హర్మన్‌ప్రీత్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్, అమిత్ రోహిదాస్, సంజయ్, సుమిత్, అమీర్ అలీ (డిఫెండర్లు); మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, షంషేర్ సింగ్, విష్ణుకాంత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, రాజ్‌కుమార్ పాల్ (మిడ్ ఫీల్డర్లు); ఆకాశ్‌దీప్ సింగ్, మన్దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, గుర్జంత్ సింగ్, అరిజీత్ సింగ్ హుండల్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, మొహమ్మద్ రాహీల్ మౌసీన్, బాబీ సింగ్ ధామి (ఫార్వర్డ్స్).