credit chori
-
కడప స్టీల్ పై బాబు నాటకం
-
ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీని తామే తెచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
క్రెడిట్ చోరీ కాదు.. క్రెడిట్ దోపిడీ: వైఎస్ జగన్
నియోజకవర్గాల పెంపు గుడ్ న్యూస్. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు హర్షణీయం. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సీట్లు గణనీయంగా పెరుగుతాయి. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు వల్ల కార్యకర్తలు కూడా నాయకులుగా ఎదిగే అవకాశం వస్తుంది. ఉత్సాహం, పటిమ ఉన్న వారికి ప్రోత్సాహం ఇస్తాం. జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. పూర్తి స్థాయిలో యుద్ధం జరగకముందే దాని పేరు చెప్పి ధరలు దారుణంగా పెంచారు. వంట నూనె లీటరు రూ.40 పెరిగింది. పప్పులు కేజీకి రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ఉచిత గ్యాస్‌కు దిక్కులేదు. మరోవైపు గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే బ్లాక్‌లో అమ్ముతున్నారు. సిలిండర్ రూ.2 వేలు, రూ.3 వేలకు అమ్ముతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఈ పెద్దమనిషి కిరోసిన్ ఇస్తానంటున్నాడు. లీటరు కిరోసిన్ ఇస్తాడంట. పండగ చేసుకోమంటున్నాడు. అసలు కిరోసిన్ స్టవ్‌లు ఎక్కడున్నాయి? చివరకు గుడ్ల ధర కూడా పడిపోయింది. మొక్కజొన్న కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రూ.2,400 అయితే రూ.1,400కు కూడా అడిగే వాడు లేడు. కోకో, అరటి, శనగ, టమాటా.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతుల పరిస్థితి అగమ్యగోచరం. -వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: చంద్రబాబు క్రెడిట్ చోరీ కాకుండా, ఏకంగా క్రెడిట్ దోపిడీ చేస్తున్నారని.. ఆ దిశలోనే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ తామే తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. నిజానికి 2022లో తన దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్‌ను కలిశానని, రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై అప్పుడే దాదాపు అవగాహన కుదిరిందని చెప్పారు. తగిన భూమి ఇచ్చేందుకు కూడా అంగీకరించామని, అంతే కాకుండా అప్పుడే ఆ కంపెనీ కర్నూలు జిల్లాలో నిర్మాణంలో ఉన్న గ్రీన్కో ప్రాజెక్టులోనూ రూ.4,800 కోట్ల పెట్టుబడికి అవగాహన కుదుర్చుకుందని వెల్లడించారు. అలా తాము తెచ్చిన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తూ అంతా తన ఘనతేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎత్తి చూపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్ధల పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో మనం 151 సీట్లు గెల్చుకున్నా, అద్దంకిలో గెలవలేకపోయామన్నారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో మంత్రిపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. చంద్రబాబుకన్నా ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఇప్పటి మంత్రిపై ఉందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో డాక్టర్ అశోక్‌కుమార్‌ను తీసుకొచ్చామని.. ఆయన మంచి డాక్టర్ అన్నారు. రాక్షస రాజ్యంలో ఉన్నాం కాబట్టి, చాలా గట్టిగా పోరాడాల్సి ఉంటుందని తెలిసినా, అశోక్ ముందుకొచ్చి, ఐదేళ్ల పోరాటానికి సిద్ధమయ్యారని.. కార్యకర్తలకు తోడుగా నిలబడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. చంద్రబాబు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. కోటలు దాటుతున్న బాబు మాటలు⇒ ‘చంద్రబాబు పాలనంతా వైఫల్యం. కానీ, మాటలు కోటలు దాటుతాయి. కానీ చేతలుండవు. ఆయన చేస్తున్న దాన్ని క్రెడిట్ చోరీ కాకుండా క్రెడిట్ దోపిడీ అనాలేమో. చంద్రబాబు ఇటీవలి క్రెడిట్ దోపిడీ గురించి చెప్పాల్సి వస్తే.. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను తాను తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ.. ఆర్భాటంగా జోరుగా ప్రచారం చేసుకుంటున్నాడు. చంద్రబాబు క్రెడిట్ దోపిడీకి కనీసం హద్దు ఉండాలి. ఆదిత్య మిట్టల్‌ను 2022లో నేను దావోస్‌లో కలిశాను. అప్పట్లోనే ఇక్కడి గ్రీన్కో ప్రాజెక్టులో పెట్టుబడికి కూడా రెడీ అయ్యారు. రూ.4,800 కోట్ల పెట్టుబడితో ఆ ప్రాజెక్టులో వారు భాగస్వాములయ్యారు. కర్నూలు జిల్లాలో కడుతున్న పంప్డ్ స్టోరేజీ ప్లాంట్‌లో ఆ పెట్టుబడి పెట్టారు. ⇒ ఇంకా అప్పట్లోనే ఎస్సార్ స్టీల్‌ని వారు కొనుగోలు చేసి, రూ.1,000 కోట్ల పెట్టుబడితో విస్తరణకు రెడీ అయ్యారు. ఆ మేరకు అగ్రిమెంట్లు కూడా జరిగాయి. అవే కాకుండా, ఇక్కడ కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఆహ్వానించి, వారికి తగిన భూములు చూపాలని అధికారులను ఆదేశించాను. దాంతో అధికారులు కాకినాడ సెజ్‌లో, మూలపేట, నక్కపల్లిలో భూములు చూపితే, వారికి నక్కపల్లి నచ్చింది. అక్కడ మనకు ఏపీఐఐసీ భూములుంటే, వాటిలో 2,200 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాం. ఆలోగా ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. దాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్తూ.. ఒక జూమ్ కాల్‌తో మిట్టల్ కంపెనీ వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ⇒ అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నాడు. విశాఖలో అదానీ డేటా సెంటర్ కూడా అంతే. అది మన హయాంలోనే వచ్చింది. అది కూడా తానే తెచ్చినట్లు చంద్రబాబు ప్రచారం. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం. అదే నక్కపల్లిలో 2023లో బల్క్ డ్రగ్ పార్కును 13 రాష్ట్రాలతో పోటీ పడి తెచ్చాం. కేంద్రం రూ.1,000 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. కానీ, చంద్రబాబు వచ్చాక, ఆ బల్క్ డ్రగ్ పార్క్ పనులు జరగడం లేదు. అడుగులు ముందుకు పడడం లేదు. దాని వల్ల రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగాలూ వస్తాయి. అయినా భూముల పేరుతో వివాదాస్పదం చేశారు. దాంతో ఆ పనులు నిల్చిపోయాయి. అలా కొన్ని ప్రాజెక్టులు పని చేయడం లేదు.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశానికి హాజరైన అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ శ్రేణులు పోర్టుల్లో పనుల నిలిపివేత⇒ నాడు మన ప్రభుత్వంలో మూడు పోర్టుల పనులు వేగంగా చేశాం. నిధుల సమీకరణ ప్రక్రియ కూడా పూర్తి చేశాం. రామాయపట్నం పోర్టు దాదాపు 80 శాతం పూర్తి చేశాం. మూలపేట పోర్టు పనులు 30 శాతం పూర్తి చేశాం. మచిలీపట్నం పోర్టు 30 శాతం మన హయాంలోనే పూర్తి చేశాం. కానీ, ఈ మూడింటి పనులు ఆగిపోయాయి. ఎందుకంటే, జగన్‌కు పేరు రాకూడదని పనులు ఆపారు. ⇒ ఇప్పుడు ఆ చుట్టుపక్కల భూములను చంద్రబాబు తన వారితో కొనిపిస్తున్నాడు. అప్పటి వరకు పోర్టుల పనులు ఆపేశారు. ఇప్పటికే భూములు ఇచ్చామని, ఇంకా భూములు లేవని మచిలీపట్నం పోర్టు వద్ద అక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇలా ప్రతి అడుగులోనూ నాకేమిటి అంటూ చంద్రబాబు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆ దిశలోనే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇలాంటి వాతావరణంలో రేపు 2029 ఎన్నికలు జరగబోతున్నాయి.అంతా దగా.. పచ్చి మోసం⇒ ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటన్నది నా కంటే మీరే బాగా చెప్పగలరు. ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పారు.. ఆ తర్వాత ఏం చేస్తున్నాడన్నది అందరికీ తెలుసు. జగన్ ఇస్తున్నవన్నీ అలాగే అమలు చేయడమే కాకుండా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా ఇస్తానన్నాడు. ఎన్నికలు అయిపోగానే చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు. ⇒ ఇప్పుడు మూడు బడ్జెట్లు అయిపోయాయి. ఇంకా మిగిలినవి కేవలం రెండు మాత్రమే. కానీ ఏ పథకం అమలు చేయడం లేదు. జగన్ ఇచ్చినవన్నీ పోయాయి. అన్నీ ఎగ్గొట్టాడు. చివరకు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా మోసాలయ్యాయి. బిర్యానీ కథ దేవుడెరుగు.. ఉన్న పలావు పోయింది. దీని గురించి ప్రజలు ఇంటింటా చర్చించుకుంటున్నారు.జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యం⇒ గుడ్‌న్యూస్ ఏమిటంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సీట్లు పెరుగుతున్నాయి. అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కు, పార్లమెంటు నియోజకవర్గాలు 25 నుంచి 38కి పెరగనున్నాయి. అలాగే వాటిలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం సీట్లు పెరుగుతాయి. మహిళలకు 33 శాతం చొప్పున అసెంబ్లీలో 88 సీట్లు, 13 ఎంపీ సీట్లు దక్కనున్నాయి. నాడు మన ప్రభుత్వ హయాంలో మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఇచ్చాం. అందుకోసం చట్టం కూడా చేశాం. ఆ విధంగా మహిళలకు సాధికారత కల్పించాం.⇒ 2029లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు పెరగడం వల్ల కార్యకర్తలు లీడర్లుగా ఎదుగుతారు. నాయకత్వ పటిమ చూపే వారందరికీ జగన్ న్యాయం చేస్తాడు. ఈసారి జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. నాడు మన హయాంలో రెండేళ్లు కోవిడ్ వల్ల కార్యకర్తలపై దృష్టి పెట్టలేకపోయాం. పాలన, బటన్ నొక్కడంపై ఎక్కువగా ధ్యాస పెట్టాల్సి వచ్చింది. మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. ప్రజలకు ఇంకా మంచి చేయడమే కాకుండా, కార్యకర్తలకు కూడా మంచి జరుగుతుంది.⇒ జగన్ 2.0లో ప్రజలకు మంచి చేసే కార్యక్రమం మీ ద్వారానే జరుగుతుంది. కాబట్టి, రాబోయేవి చాలా మంచి రోజులు. ఇప్పటికే రెండేళ్లు గడిచాయి. ఇంకా మిగిలింది మూడేళ్లు. అందులో చివరి ఏడాదిన్నర నేను పాదయాత్రలో ఉంటాను. దాంతో మొత్తం పార్టీ ప్రజల కోసం నేరుగా రంగంలోకి దిగుతుంది. అప్పుడు చంద్రబాబుకు సినిమా చూపిస్తాం. చంద్రబాబు చేసే రెడ్‌బుక్ పాలన, అన్యాయాలకు టైమ్ దగ్గరకొచ్చింది. ఇంకా వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.⇒ ఈ సమావేశంలో బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్, నియోజకవర్గంలో పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.అంతా దోచుకో.. పంచుకో.. తినుకో..⇒ మన హయాంలో ఆ ఐదేళ్లలో దాదాపు రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా బదిలీ చేశాం. ఆధార్ నంబర్లు, బ్యాంక్ ఖాతాలతో సహా ఎవరికి, ఎంతిచ్చామో చెప్పగలం. కానీ రెండేళ్లు కూడా కాకముందే చంద్రబాబు చేసిన మొత్తం అప్పులు రూ.3.37 లక్షల కోట్లు దాటాయి. కానీ, జగన్ ఇచ్చిన పథకాలు లేవు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా లేవు. మరి నాడు జగన్ ఎలా చేశాడు.. మరి ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఎందుకు చేయడం లేదు.. అన్నదానిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది.⇒ చంద్రబాబు ఎందుకు ఇవ్వడం లేదంటే.. ఇప్పుడంతా దోచుకో.. పంచుకో.. తినుకో.. ఎక్కడ పడితే అక్కడ దోపిడీ. రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అదంతా చంద్రబాబు, ఆయన బినావీులు, ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల జేబుల్లోకి పోతోంది. లిక్కర్ మొదలు ప్రతి చోటా దోపిడీ. ఎక్కడా ఎమ్మార్పీకి మద్యం అమ్మడం లేదు. వేలం పాటలు నిర్వహించి, బెల్టు షాపులు నడుపుతున్నారు. మద్యం ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు. అంతా మాఫియాకు చేరుతోంది.⇒ ఇసుక, మట్టి, ల్యాటరైట్.. దేన్నీ వదలడం లేదు. మరోవైపు అధిక ధరలకు పీపీఏలతో అవినీతికి పాల్పడుతున్నారు. మనం యూనిట్ విద్యుత్ రూ.2.49కే పీపీఏ చేసుకుంటే, ఇప్పుడు రూ.4.60కి చేసుకుంటున్నారు. మనం రైతులకు ఉచిత విద్యుత్ 25 ఏళ్లు ఇవ్వాలని సంకల్పించి, యూనిట్ విద్యుత్‌ను రూ.2.49కే ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటే విమర్శించారు. కానీ వీరు ఏకంగా యూనిట్ విద్యుత్‌ను రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకున్నారు.⇒ అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి మహా నగరాల్లోనే చదరపు అడుగు నిర్మాణానికి రూ.4 వేలతో ఫైవ్ స్టార్ లెవెల్లో కట్టొచ్చు. కానీ ఇక్కడ ఏకంగా అదే చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారు. భూములనైతే శనక్కాయలు, బెల్లానికి ఇస్తున్నారు. చంద్రబాబు బంధువు, బాలకృష్ణ అల్లుడికి రూ.5 వేల కోట్ల విలువైన భూములు దోచి పెడుతున్నారు. ఈ రకంగా రాష్ట్ర ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు.పరిపాలన లేదు.. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి⇒ చంద్రబాబు ప్రభుత్వంలో అసలు పరిపాలన అనేది లేదు. అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఫీజు రీయింబర్స్మెంట్ లేక, పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు. బకాయిలతో కలిపి ఈ ఏడాది విద్యా దీవెన, వసతి దీవెనకు సుమారు రూ.10 వేల కోట్లు కావాలి. కానీ ఈ ఏడాది బడ్జెట్లో పెట్టింది రూ.2,600 కోట్లు మాత్రమే. ఆరోగ్యశ్రీకి రూ.3,150 కోట్లు బకాయి పెట్టారు. దీంతో నెట్వర్క్ ఆస్పత్రుల పథకం కింద వైద్యం చేయడం లేదు.⇒ నాడు–నేడు మనబడి లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్దలో క్వాలిటీ లేదు. చదువులు పూర్తిగా తిరోగమనంలో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోతున్నాయి. విద్య, వైద్యం పరిస్థితి ఇలా ఉంటే.. రైతుల పరిస్థితి మరీ దారుణం. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అంత దారుణంగా వ్యవసాయం ఉంది. పూర్తి స్థాయిలో యుద్ధం జరగకముందే దాని పేరు చెప్పి ధరలు దారుణంగా పెంచారు. -
టీటీడీ ల్యాబ్ క్రెడిట్ చోరీ
-
తిరుమలలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ.. భక్తుల ఆశ్చర్యం
సాక్షి, తిరుపతి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా చంద్రబాబు.. టీటీడీలోనూ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ల్యాబ్‌ని బాబు తన ఖాతాలో వేసుకుంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 2023లో ల్యాబ్ ఏర్పాటుకు సీఈఓ కమలవర్థన్ చర్చలు జరిపారు. అనంతరం, 20 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. నాటి నిర్ణయం మేరకు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ తిరుమలలో అందుబాటులోకి వచ్చింది. వైఎస్ జగన్ హయాంలోనే ల్యాబ్ బలోపేతమైంది.ఇంత జరిగినా బిల్డప్ బాబు చంద్రబాబు మాత్రం ప్రసాదం నాణ్యతకు తానే దృష్టిపెట్టినట్టు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. అయితే, వైఎస్ జగన్ గతంలోనే తిరుమలలో ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, తాజాగా చంద్రబాబు క్రెడిట్ చోరీని చూసిన శ్రీవారి భక్తులు నివ్వెరపోతున్నరు. -
చంద్రబాబు టీటీడీ ల్యాబ్ క్రెడిట్ చోరీ
-
అది నేనే.. ఇదీ నేనే..!
సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం, మరోసారి ఇదే తరహాలో వ్యవహరిస్తోంది. తిరుమలలో స్వామివారి ప్రసాదంలో వాడే ముడిపదార్థాలు, భక్తులకు పెట్టే అన్నప్రసాదాల్లో నాణ్యతను పెంపొందించేందుకు శనివారం ప్రారంభం కానున్న ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు తానే కారణమన్నట్లు ప్రచారం చేసుకుంటూ, స్వయంగా శ్రీవెంకటేశ్వరుని సాక్షిగా బాబు సర్కార్ తాజాగా క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. జగన్ ప్రభుత్వ చొరవతో ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రత్యేకంగా తిరుమలకు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను మంజూరు చేస్తే అది తన ఘనతగా చంద్రబాబు డప్పు కొట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వాస్తవాలను ఒకసారి పరిశీలిస్తే.. » 2023 ఆగస్టు 23, 24 తేదీల్లో 41వ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సమావేశాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ తిరుపతిలో నిర్వహించింది. సమావేశానికి హాజరైన సీఈవో కమలవర్ధన్‌రావు ఈ సందర్భంగా తిరుమలలో పర్యటించారు. అన్నప్రసాద భవనాన్ని, శ్రీవారి లడ్డూ పోటును స్వయంగా సందర్శించారు. టీటీడీ అధికారులతో సైతం సమావేశం నిర్వహించారు.» అప్పటికే భక్తులకు ఇచ్చే ప్రసాదం, అన్నప్రసాదం తయారీ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం... తిరుమలకు ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను మంజూరు చేయాలని సీఈవోను కోరింది.» దీంతో భక్తులకు వడ్డించే ఆహారం, లడ్డూ తయారీలో వాడే నెయ్యి, పాలు, సుగంధ ద్రవ్యాల స్వచ్ఛతను పరీక్షించడానికి టీటీడీకి సొంతంగా అధునాతన ల్యాబ్‌ను ఎఫ్ఎస్ఎస్ఏఐ తరపున మంజూరు చేస్తున్నట్లు మీడియా సాక్షిగా కమలవర్ధన్‌రావు ప్రకటించారు.» వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ల్యాబ్ ఏర్పాటుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందుకు రావడంతో, ల్యాబ్ ఏర్పాటు కోసం ఆనాటి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు కసరత్తు కూడా ప్రారంభించారు. » ల్యాబ్ ఏర్పాటుకు గత ప్రభుత్వంలోనే ఎఫ్ఎస్ఎస్ఏఐకు ప్రతిపాదనలు కూడా పంపారు.» గత ప్రభుత్వంలో జరిగిన కృషి కారణంగా రూ.20 కోట్లతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ ఏర్పాటయ్యింది. » అదంతా తన గొప్పేనంటూ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ చేస్తున్న హడావుడి సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. -
చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ మోసాలు
-
టన్నుల్లో చంద్రబాబు అబద్ధాలు.. వెలిగొండలో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: మరో ‘క్రెడిట్’ చోరీకి సిద్ధమైన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మార్కాపురం సభ వేదికగా వెలి‘కొండంత’ అసత్యాలు వల్లె వేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో తానే శంకుస్థాపన చేశానని.. 2014–19 మధ్య పనులను పరుగులు పెట్టించానని.. కానీ 2019–24 మధ్య పనులు మూలన పడ్డాయని తనకు అలవాటైన రీతిలో అలవోకగా అబద్ధాలు చెప్పుకొచ్చారు. నిజానికి 1996 నుంచి 2004 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వెలిగొండ పనులకు చేసిన వ్యయం అక్షరాలా రూ.పది లక్షలు మాత్రమే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసిందే. ఇక 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పనుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.630.57 కోట్లు దోచిపెట్టింది. జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు) వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టారని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో కడిగిపారేయడమే అందుకు తార్కాణం. అలాంటి అవినీతి బాగోతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి రోజుకు సగటున 10 మీటర్ల పొడవున సొరంగం తవ్వేందుకు టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.68.44 కోట్లను ఇచ్చేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. కానీ మరమ్మతులు చేయకపోవడం వల్ల టీబీఎంలు రోజుకు సగటున ఒకటి రెండు మీటర్ల పొడవున కూడా సొరంగాలను తవ్విన దాఖలాలు లేకపోవడం గమనార్హం..! ఇక సొరంగాలను నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసే ఫీడర్ కెనాల్లో చేసిన పనులూ నాసిరకమే. 2017.. 2018.. 2019.. ఇలా వెలిగొండను పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు చంద్రబాబు ముహూర్తాలు మార్చుకుంటూ వచ్చారు. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి అధిక ధరలకు మరో కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. అనంతరం కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారని సాగునీటిరంగ నిపుణులు, రైతులు అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆక్షేపించడం గమనార్హం. గతేడాది కురిసిన వర్షాలకు ఫీడర్ కెనాల్ బలహీనంగా ఉన్న చోట్ల కోతకు గురవడంతో ఇప్పుడు దానికి రిటైనింగ్ వాల్, కాంక్రీట్ లైనింగ్ పనులకు రూ.456 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఆ పనులను తనకు అత్యంత సన్నిహితుడైన గన్నమనేని దొరయ్యకు చెందిన జీడీఆర్ ప్రాజెక్ట్స్‌కు కట్టబెట్టారు. రూ.992 కోట్లతో పునరావాసం కల్పించి ఉంటే.. 2024 ఆగస్టులోనే నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలుదశాబ్దాల స్వప్నం వెలిగొండ సాకారమైందని.. శ్రీశైలం నుంచి జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలు నల్లమలసాగర్‌కు చేరడంతో తమ కష్టాలు కడతేరుతాయనుకున్న ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజల ఆశలను చంద్రబాబు ప్రభుత్వం అడియాశలు చేసింది. ఈ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన జంట సొరంగాలను (ఆసియాలోనే అతి పొడవైనవి) రికార్డు సమయంలో నాటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి 2024 మార్చి 6న జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 2024 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు పరిహారం చెల్లించింది. రూ.992 కోట్లు వ్యయం చేసి పునరావాసం కల్పించింది. 2024 సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. కేవలం వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే దుగ్ధతోనే నల్లమలసాగర్ నిర్వాసిత కుటుంబాలకు 21 నెలలుగా పునరావాసం కల్పించకుండా చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తోందని సాగు నీటి నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2024–25లో 1,439 టీఎంసీలు, 2025–26లో 1,936.79 టీఎంసీల ప్రవాహం రాగా.. ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి 2024–25లో 848.96 టీఎంసీలు, 2025–26లో 1,652.12 టీఎంసీలు కలిశాయని గుర్తు చేస్తున్నారు. అదే చంద్రబాబు సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే 2024–25తోపాటు 2025–26లోనూ కృష్ణా వరదను ఒడిసి పట్టి నల్లమలసాగర్‌కు తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూరికార్డు వేగంతో జంట సొరంగాలు పూర్తి» వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చిన వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం వల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్‌లో ప్రారంభించి కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. 2014–19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగం రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్సార్సీపీ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను వైఎస్ జగన్ 2021లోనే పూర్తి చేయించారు. » రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచి పెట్టారు. వాటిని రద్దు చేసిన వైఎస్ జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి, టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు 7.698 కిలోమీటర్ల సొరంగం పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. రెండో సొరంగంలో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కాలం చెల్లడంతో రోజుకు ఒక మీటర్ కూడా పని జరగడం కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేసి రికార్డు సమయంలో 7.685 కి.మీల పొడవున సొరంగం తవ్వకం పనులను 2024 జనవరి 21 నాటికి పూర్తి చేయించారు. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తి చేశారు. శ్రీశైలానికి వరద వచ్చేలోగా రెండో సొరంగం నుంచి టీబీఎంను బయటకు తీయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్ జగన్ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. » ఇక 2014–19లో టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు కాలువను నల్లమల సాగర్‌కు అనుసంధానం చేసేలా సొరంగం, హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్‌కు అనుసంధానం చేసేలా సొరంగం తవ్వకం పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించింది. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించడానికి లైన్ క్లియర్ చేశారు. 2019–24 మధ్య కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1,046.46 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేయించింది. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరాకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది.‘కొండంత’ కలను సాకారం చేసిన వైఎస్సార్..» శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కి.మీల పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమలసాగర్‌కు తరలించి.. ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీళ్లు అందించాలని 1993–94లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించారు. కానీ.. 2004 వరకు ఈ ప్రాజెక్టు పనులను ఎవరూ చేపట్టలేదు.» జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.58 కోట్లు ఖర్చు చేసి.. నల్లమల సాగర్‌తోపాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్‌కు అనుసంధానం చేసేలా 21.8 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్, తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు» మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్టు డీపీఆర్‌ను సమూలంగా మార్చేశారు. కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్‌లో నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్ 27న పనులకు శ్రీకారం చుట్టారు. -
ఈ టైంలో బాబు-పులి కథ చెప్పాల్సిందే!
సాక్షి, నంద్యాల: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. గురువారం వైఎస్సార్సీపీ నిర్వహించిన చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ ఉద్యమకారులు అని చెప్పుకునేవాళ్లు కూడా గత రెండు మూడు రోజులుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ అని మాట్లాడుతున్నారు. మద్ధతు ఇవ్వమని కోరితే.. టీఎంసీ, క్యూసెక్కులు అంటే ఏంటో చెప్పాలంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. అవే చదువుకుని కుంటే ఏ ఇంజినీర్లు అయ్యి ఉండేవాళ్లు కదా. ఇదంతా కేవలం వాళ్ల రాజకీయ స్వార్థం కోసమే. తెలుగు దేశం వాళ్లు ఒక్క పని చేయరు. చంద్రబాబుకు తెలిసిందల్లా రెండే.. ఒకటి శిలాఫలకం వేయడం, రెండోది పని ఎవరైనా పూర్తి చేశాక వచ్చి తనదే ఆ క్రెడిట్ అని చెప్పుకోవడం.. అందుకే ఇప్పుడు వేటగాడి కథ చెప్పుకోవాలి..ఒక వేటగాడు ఉన్నాడు. భయంకరమైన యుద్ధం చేసి పులిని చంపాడు. ఆ నొప్పులు తట్టుకోలేక మందు కోసమని వెళ్లాడు. ఈలోపు చంద్రబాబు లాంటోడు వచ్చాడు. పులి గోళ్లు, పళ్లు ఎత్తుకెళ్లి.. నేనే చంపాను అంటూ చెప్పుకుని తిరిగాడు. హంద్రీ-నీవా సుజల స్రవంతి(HNSS) పనులు తానే చేశానని చెప్పుకుంటున్నాడు. కానీ, ఆ పనులు ఎన్టీఆర్ కాలం నాడే మొదలయ్యాయి. పూర్తి చేసింది రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి.. చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదు అని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి అన్నారు. లడ్డూ గురించి అడిగితే చంద్రబాబు దాడులు చేయిస్తున్నారు. యూరియా కొరత గురించి అడిగితే.. ఆ వాడకం మంచిది కాదు కేన్సర్ వస్తుందటారు. మహిళలకు ఎన్నికల్లో ఇస్తానన్న భృతి గురించి అడిగితే.. నా దగ్గర భద్రంగా ఉంటుందని అంటున్నారు. ఇంక పవన్ కల్యాణ్ తిరిగేది రెండు మూడు నియోజకవర్గాలే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గం. చంద్రబాబు అండ్ కో పదే పదే అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుతున్నారు అని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ చంద్రబాబు జాగీరు కాదని.. మెడలు వంచైనా సరే సాధించుకుంటామని ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. ప్రజా , రైతు సంఘాలు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపాయి. -
ఆంధ్రప్రదేశ్‌లో రీ సర్వే సూపర్. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన భూ, మార్కెట్ సంస్కరణలు భేష్ అని పొగిడిన కేంద్ర ఆర్థిక సర్వే
-
కేంద్ర ఆర్థిక ‘సర్వే’ సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్ చౌర్యం.. 'రీ సర్వే' సూపర్
సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా.. పార్లమెంట్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోసారి రుజువైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన భూ సంస్కరణలపై బురద చల్లుతూ చంద్రబాబు ఆడిన కపట నాటకం బట్టబయలైంది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ.. ఆంగ్లేయుల తరువాత వందేళ్ల అనంతరం దేశంలో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021లో చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే యజ్ఞం ఫలితాలను తాజాగా కేంద్ర ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రశంసించింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన కీలక మార్పులు, ప్రతి అడుగులో రైతన్నలకు తోడుగా నిలిచిన ఆర్బీకేలు, విప్లవాత్మక రీతిలో అమలు చేసిన భూ సంస్కరణలను అభినందించింది. వైఎస్ జగన్ హయాంలో నిర్వహించిన భూ రీ సర్వే ఫలితాలను వివరిస్తూ కేంద్ర ఆర్థిక సర్వే(2025–26)లో పేర్కొన్న భాగం ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం అమలు చేసిన సమగ్ర భూ సర్వే ఫలాలను సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాల్లో ఎలా వేసుకున్నారో దేశానికి చాటి చెప్పింది. మాజీ సీఎం వైఎస్ జగన్ తెచ్చిన భూ సంస్కరణలు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కొనుగోలుదారులను రైతులకు పరిచయం చేసి పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించేలా తెచ్చిన ‘ఈ–ఫార్మర్ మార్కెట్’ విధానాలకు కేంద్రం కితాబిచ్చింది. ఇక వ్యాపార వాతావరణ అనుకూల విధానాల్లో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పారిశ్రామిక అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేసిందని, 2023–24లో మహిళల నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపింది. ఈమేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ఆర్థిక సర్వే నివేదిక 2025–26 ప్రవేశపెట్టారు. ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిళ్లుభూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021లో భూముల రీ సర్వే ప్రాజెక్టును ప్రారంభించిందని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. రీ సర్వేకు డ్రోన్ టెక్నాలజీని వినియోగించడంతో పాటు కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్లు (సీవోఆర్‌ఎస్), జీఐఎస్ సాయంతో ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిళ్లను జారీ చేసినట్లు ఆర్థిక సర్వే ప్రధానంగా ప్రస్తావించింది. సమగ్ర భూ సర్వేలో భాగంగా 6,901 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశారని, 81 లక్షల భూ కమతాలను రీ సర్వే చేశారని వెల్లడించింది. తద్వారా సుమారు 86,000 సరిహద్దు వివాదాలను పరిష్కారమయ్యాయని స్పష్టం చేసింది. దాదాపు 15 వేల మంది సర్వేయర్లను నియమించి రైతులకు పైసా ఖర్చు లేకుండా భూముల సమగ్ర సర్వేను మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టడం తెలిసిందే. సచివాలయాల సిబ్బంది పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రీ సర్వే ద్వారా తొలిసారిగా డ్రోన్లు, రోవర్లు, విమానాలను వినియోగించి సర్వే చేశారు. భూములకు జియో హద్దులు నిర్ణయించి పట్టాదార్ పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్లు ముద్రించారు. ట్యాంపరింగ్‌కు వీలులేని విధానాల ద్వారా భూ రికార్డుల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు. సర్వే రాళ్లు విలక్షణంగా ఉంటేనే అందరికీ తెలుస్తుందనే ఉద్ధేశంతో 1.25 కోట్ల సర్వే రాళ్లను పాతించారు. అంతేకాదు.. సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లాంటి అన్ని సేవలను సచివాలయాల్లోనే పొందే సౌలభ్యం కల్పించారు. నిర్విరామంగా ఒక మహాయజ్ఞంలా జరిగిన రీ సర్వే కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇండియా కూడా పాలుపంచుకుంది. కేరళ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలు రీ సర్వే మోడల్‌పై అధ్యయనం చేసి టెక్నాలజీ సాయం కోరాయి. ఆర్బీకేలతో పంటలకు మెరుగైన ధరలురైతులు పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో మెరుగైన ధరలు కల్పించే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన రైతు భరోసా కేంద్రాలు, ‘ఈ–ఫార్మర్ మార్కెట్’ను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను కళ్లాల నుంచే నేరుగా తమకు నచ్చిన ధరకు అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తూ వైఎస్సార్ సీపీ హయాంలో ‘ఈ–ఫార్మర్ మార్కెట్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కొనుగోలుదారులను రైతులకు పరిచయం చేస్తూ, మన పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించేలా దీన్ని తెచ్చింది. మండీలకు ప్రత్యామ్నాయంగా రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులు, ప్రాసెసర్లను అనుసంధానిస్తూ దేశంలో తొలిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ ద్వారా కొనుగోళ్లు చేపట్టేందుకు వ్యాపారులు పోటీపడి ముందుకొచ్చారు. వీరిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కూడా ఉండటం గమనార్హం.ఈ– ఫార్మర్ మార్కెట్‌తో ప్రయోజనాలెన్నో..⇒ దళారీల ప్రమేయం ఉండదు. ఎలాంటి ఫీజులు, రుసుములు లేకుండా కళ్లాల నుంచే అమ్ముకోవచ్చు.⇒ ఉత్పత్తి లభ్యత, పంట వివరాలు, నాణ్యత వివరాలను ఎలక్ట్రానిక్ పోర్టల్‌లో నమోదు చేస్తే ఇదే పోర్టల్‌లో వ్యాపారులు నేరుగా రైతులతో సంప్రదించి కొనుగోలు చేస్తారు. నగదు రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తారు.పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులుబిజినెస్ రీఫార్మ్ యాక్షన్ ప్లాన్ (బీఆర్ఎపీ) 2024 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు, ఆన్లైన్లో భూమి రిజిస్ట్రేషన్, పర్యావరణ అనుమతులు జారీ చేసి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించినట్లు కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది.తయారీ రంగంలో మహిళా యాజమాన్య సంస్థల సత్తాదేశంలో మహిళా యాజమాన్యంలోని సంస్థల వాటా పెరుగుతోందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. 2021 – 2022లో 24.2 శాతం ఉండగా 2023 – 24లో 26.2 శాతానికి పెరిగినట్లు తెలిపింది. 2023–24లో మహిళా యాజమాన్యంలోని సంస్థలకు సంబంధించి తయారీ రంగంలో వాటా అత్యధికంగా 58.4 శాతం ఉండగా ఇందులో ఆంధ్రప్రదేశ్ అత్యధిక వాటా కలిగిన రాష్ట్రాల్లో నిలిచింది.⇒ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు కృషి చేసినట్లు కేంద్ర ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ⇒ కోవిడ్ మహమ్మారి తరువాత విదేశీ విద్యార్ధులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, 2023 గణాంకాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయని కేంద్ర ఆర్థిక సర్వే పేర్కొంది. -
మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు
-
భూ సర్వేపై జగన్ కు జై కొట్టిన బాబు
-
YS Jagan: సొమ్మొకరిది.. సోకొకరిది
-
క్రెడిట్ చోరీ చేయడంలో బాబు తర్వాతే ఎవరైనా !
-
చంద్రబాబూ.. ఎప్పుడైనా విన్నావా? చూశావా? చేశావా?
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ యత్నాలను మరోసారి ఎండగట్టారు మాజీ ముఖ్యమంత్రి, వైస్సార్సీపీ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఇటీవలి పరిణామాలు, చంద్రబాబు ప్రభుత్వ దాష్టీకాలను తీవ్రంగా విమర్శించిన జగన్, తమ హయాంలో జరిగిన భూ రీసర్వేను తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు నిస్సిగ్గుగా చేస్తున్న ప్రయత్నాలు ప్రజలముందుంచారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈ భూమండలంపై క్రెడిట్ చోరీ అత్యంత సమర్థంగా చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. అవసరానికి రంగులు మార్చే ఊసరవెల్లి కూడా ఈయన్ను చూసి సిగ్గుపడాల్సిందే. అంత దారుణమైన మోసాలు చేస్తున్నారు.’’ అని జగన్ విమర్శించారు. ఏడాదిన్నరగా అధికారంలో ఉన్నప్పటికీ రైతు సమస్యలు తీర్చాలన్న ఆలోచన ఆయనకు అస్సలు లేకుండా పోయిందని, 2019-2024 మధ్యకాలంలో తాము చేపట్టిన భూ రీసర్వేను కూడా తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ‘‘నిజానికి.. రీసర్వే ఆలోచన నాకు పాదయాత్ర సమయంలోనే వచ్చింది. రైతులు విన్నవించిన అనేక సమస్యలకు ఈ రీసర్వే పరిష్కారం కాగలదని భావించాను. అప్పట్లో రాష్ట్రంలో సర్వేయర్లు లేరు, భూముల సర్వేకు తగిన టెక్నాలజీ కూడా లేదు’’ అని జగన్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేయిస్తానని తాను 2019నాటి మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీకి కట్టుబడి 2020 డిసెంబరు 21న దాన్ని ప్రారంభించామని వివరించారు. రైతులకు మేలు చేసే ఏ ఆలోచన కూడా చంద్రబాబుకు అస్సలు రాదని.. వచ్చిందల్లా భూములను నిషేధిత జాబితా (22ఏ)లో పెట్టడం మాత్రమేనని ఎద్దేవా చేశారు. ‘‘నాలుగుసార్లు సీఎంగా ఉండి.. ఎనిమిది పదుల వయసు దగ్గర పడుతున్న చంద్రబాబుకి ఏనాడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? చంద్రబాబూ ఇలాంటిది ఏనాడైనా విన్నావా? చూశావా? చేశావా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర భూ సర్వే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ మహా యజ్ఞం. వివాదాల్లేకుండా, అత్యంత పారదర్శకంగా భూముల రీ సర్వే జరగింది. ఎవరూ మార్చలేని విధంగా భూ రికార్డులు సిద్ధం చేశాం. భూ యజమానులకు శాశ్వత యాజమాన్య పత్రాలు ఇచ్చాం. అందుకు ప్రభుత్వం పూచీకత్తుగా నిలిచింది. రైతుల పాస్‌బుక్కుల్లోనూ క్యూఆర్ కోడ్ వంటి అత్యాధునిక ఫీచర్లను పొందుపరిచాం.’’ అని జగన్ తెలిపారు. విప్లవాత్మకమైన చర్యలు..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమం కోసం తాను చేసిన ప్రయత్నాలు, తీసుకున్న చర్యలను జగన్ సవివరంగా వివరించారు. గ్రామాల్లో సచివాలయ నిర్మాణాలు మొదలుకొని, వాటిల్లో ఒక్కోదాంట్లో పది మంది సిబ్బంది నియామకాలను కూడా ఆయన గుర్తు చేశారు. సమగ్ర భూ సర్వే విజయవంతం అయ్యేందుకు రికార్డు స్థాయిలో 40 వేల మంది సిబ్బందిని పురమాయించామని చెప్పారు. సిబ్బంది మొత్తానికి ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఇప్పించేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కూడా చేసుకున్నామని, హెలికాప్టర్లు, డ్రోన్లతో సర్వే నిర్వహించామని జగన్ వివరించారు. ‘‘మా హయాంలోనే మొదటిసారి డ్రోన్లతో సర్వే జరిగింది. కోట్ల సర్వే రాళ్లను ఉచితంగా రైతులకు అందించాం. వాటిపై భూసర్వే-భూరక్ష అని రాయించాం’’ అని తెలిపారు. సర్వేలో ఎక్కడా రాజీ పడలేదని, భూమి కొలతల్లో ఐదు సెంటీమీటర్ల తేడా కూడా లేకుండా కచ్చితమైన సర్వే చేశామన్నారు. ఇందుకోసం రూ.ఆరు వేల కోట్లు ఖర్చయినా వెనుకాడలేదని... ఈ కృషిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం ప్లాటినమ్ గ్రేడ్ ఇచ్చిందని, రూ.400 కోట్ల రాయితీ కూడా వచ్చిందని తెలిపారు. 2023 డిసెంబర్లో పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ఈ ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినాసరే.. చంద్రబాబు తన పాత అలవాటు ప్రకారం ‘‘అంతా నేను చేశాను’’ అంటున్నారని విమర్శించారు.ఆంధ్రప్రదేశ్‌లో తన హయాంలో జరిగిన భూముల రీసర్వేను ఎన్నో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనియాడాయని జగన్ తెలిపారు. కేరళ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర అధికారులు కూడా అధ్యయనం జరిపారని, సర్వే ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఈ సర్వేను ఎంతగానో మెచ్చుకున్నారని చెప్పారు. చంద్రబాబు రాక్షసపాత్ర...భూముల రీసర్వే విషయంలో చంద్రబాబు పాత్ర రాక్షసుడికి ఏమాత్రం తగ్గదని, ఎల్లోమీడియా అసిస్టెంట్ రాక్షస పాత్ర పోషించిందని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా భూ సర్వేపై రైతులను భయపెట్టారని, ఇప్పుడు కూడా దుష్ప్రచారంతో భూ సర్వే క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు. అయితే నిజాలను ఎంతో కాలం దాచిపెట్టగలరని ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు సర్వే రాళ్లు కూడా లేకుండా సర్వే అంటున్నారు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు పాస్బుక్కుల విషయంలో మమల్ని అనుసరిస్తున్నాడు. కాకపోతే రంగు మార్చాడంతే. మార్చేందుకు వీల్లేని పాస్‌బుక్కులు ఇచ్చేందుకు మేము ప్రయత్నించాం. ఇప్పుడు విపరీతమైన తప్పులు ఉంటున్నాయి. మేము పాతిన సర్వే రాళ్లను తొలగించేందుకు ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సర్వే అంటే ఏంటో కూడా తెలియదు అన్నట్లు సాగుతోంది ఈ వ్యవహారం. మేము ఒక బృహత్తర లక్ష్యంతో మొదలుపెట్టిన భూముల సర్వేను చంద్రబాబు ప్రభుత్వమిప్పుడు నీరుగారుస్తోంది’’ అని వివరించారు. -
చంద్రబాబు యూటర్న్.. భూముల 'రీసర్వే'పై దొంగాట
-
పవన్‌ను సైడ్ చేసి మరీ క్రెడిట్ చోరీ
ఒక భవనానికి ‘సిటీ’ అని పేరు పెడితే ఆ నగరమంతా పేరు పెట్టిన వ్యక్తి నిర్మించినట్లేనా? శంకుస్థాపన చేసి తరువాత దానిని పట్టించుకోకపోయినా, పూర్తి చేయకపోయినా క్రెడిట్ మాత్రం పొందగలుగుతారా? ఇతరుల విషయమేమో తెలియదు కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం ఒప్పుకోవాలేమో. లేదంటే మీడియా బలంతో విరుచుకుపడుతుంటారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చిక్కుముళ్లు వేసి దిగిపోతే జగన్ ఆ ముళ్లన్నీ విప్పి కార్యరూపం దాల్చేలా చేయగలిగారు. అప్పట్లో జగన్ చెప్పినట్లే 2026 కల్లా ఇది పూర్తి కావడం విశేషం. కాకపోతే చంద్రబాబు ప్రభుత్వానికి దానిని ప్రారంభించే అవకాశం వచ్చింది. అంత మాత్రాన జగన్ పాత్ర ఏమీ లేదన్న భావన కల్పించే ప్రయత్నం అభ్యంతరకరం. ఇందులో మేజర్ క్రెడిట్ అంతా జగన్‌దే అనే అభిప్రాయం ఉంది. కరోనా రెండేళ్లు లేకుండా ఉంటే జగనే ప్రారంభించి ఉండేవారేమో!. హైటెక్ సిటీ విషయంలోనూ ఇంతే. దానికా పేరు, పరిసర ప్రాంతాలకు సైబరాబాద్ అన్న నామకరణం జరిగింది మొదలు.. అంతా బాబే చేశాడన్న ప్రచారం జరిగిపోయింది.. జరుగుతూనే ఉంది. రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆ తరువాత చాలా అభివృద్ది జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగినన్ని పనులు మరే ప్రభుత్వంలోను జరిగి ఉండకపోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ హైవే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ నగరంలో రోడ్లు, పలు వంతెనల నిర్మాణం వైఎస్ హయాంలోనే జరిగాయి. ఆ తర్వాత కేసీఆర్ సీఎంగా ఉండగా నగరంలో పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, నిర్మాణమైన సంగతి తెలిసిందే. ప్రస్తుత సీఎం కూడా ఫ్యూచర్ సిటీ పేరుతో అభివృద్ధి పనులు భారీ ఎత్తున చేపట్టారు. ఇది నిరంతర ప్రక్రియ. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం తనకు ముందర, తన తర్వాత జరిగిన అభివృద్దిని సైతం తమ కృషిగానే ప్రచారం చేసుకోగలదు. హైదరాబాద్‌లో నిజంగానే అంత అభివృద్ది జరిగి ఉంటే, విభజిత ఏపీలో కూడా ఎందుకు అభివృద్ది జరగలేదన్న దానికి జవాబు ఇవ్వరు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక వ్యవస్థలను తామే తెచ్చామన్న భావన కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం వాటి పేర్లు మారుస్తోంది. జగన్ టైమ్‌లో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి దేశంలోనే ప్రముఖ నగరంగా అభివృద్ది చేయాలని తలపెడితే అడ్డు పడింది తెలుగుదేశం పార్టీనే కదా!. ఇదే జరిగి ఉంటే ఇప్పుడు అమరావతి కోసం మరీ లక్ష కోట్ల వ్యయం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. పైగా నగరం వేగంగా అభివృద్ది చెందేది. తద్వారా కొత్త విమానాశ్రయానికి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగేది. విశాఖలోని ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖది. దాన్ని పౌరసేవలకూ వాడుతున్నారు. ఎప్పటికైనా కొత్త ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసుకోవలసిందే. ఈ క్రమంలో ఈ ప్రతిపాదన వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం 15 వేల ఎకరాల భూమి సేకరించాలని ప్రతిపాదించడంతో పెద్ద వివాదమైంది. రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా పరిహారంపై కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. కోర్టులో కేసులు వేశారు. అప్పట్లో విపక్ష నేతగా వైఎస్ జగన్ రైతులకు మద్దతిచ్చారు. టీడీపీ నేతల భూదందాను బహిర్గతం చేశారు. ఈ ఆందోళనల ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చింది. ఐదువేల ఎకరాలు చాలన్న నిర్ణయానికి వచ్చింది. ఆ రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణ తీరుపై మండిపడ్డారు. తెలుగుదేశంపై అవినీతి ఆరోపణలు చేశారు. తెలుగుదేశం నేతలు, టీడీపీ మీడియా పవన్ విమర్శల గురించి మాట్లాడకుండా, ఈ ఎయిర్ పోర్టును జగన్ వ్యతిరేకించినట్లు అబద్దపు ప్రచారం చేస్తోంది. టీడీపీ సోషల్ మీడియా కూడా చంద్రబాబే మొత్తం ఎయిర్ పోర్టు నిర్మాణం చేసినట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దానికి తగ్గట్లే కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ట్రయల్ రన్ సందర్భంగా మాట్లాడుతూ ఇదంతా చంద్రబాబు విజన్ అని చెప్పారు. కానీ.. జగన్ మాత్రం పద్దతిగా కామెంట్ చేస్తూ ఎయిర్ పోర్టు యాజమాన్యం అయిన జీఎంఆర్ సంస్థను అభినందించారు. ఏపీ అభివృద్దిలో ఇది ఒక మైలురాయి అని వ్యాఖ్యానించారు. తమ పాలనలో వేగంగా అనుమతులు పొందే యత్నం చేశామని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులకు పునరావాసం, భూ సేకరణ కోసం రూ.960 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. టీడీపీ దీనిని కూడా సహించలేకపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వద్దని రెచ్చగొట్టారని తప్పుడు ఆరోపణ చేసింది. కాంట్రాక్ట్ సంస్థ జీఎంఆర్‌ను బెదిరించారని కూడా ఈ మీడియా రాసింది. అదే నిజమైతే జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు భోగాపురం ఎయిర్ పోర్టుకు జగన్ శంకుస్థాపన చేసిన సందర్భంలో ఆయనే మళ్లీ ప్రారంభోత్సవం చేయాలని ఎలా కోరారు?. శంషాబాద్ ఎయిర్‌పోర్టును వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని, పూర్తి అయ్యాక ఆయనే ప్రారంభోత్సవం చేశారని స్వయంగా మల్లిఖార్జునరావు ఆ సభలో తెలిపారు. ఇప్పుడు సంబంధిత వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు.. జగన్ ఆ రోజుల్లో రైతుల తరపున నిలబడి అన్నివేల ఎకరాల భూమి అవసరం లేదని, న్యూయార్క్ తదితర చోట్ల ఎంత భూమి ఎయిర్ పోర్టు నిర్మాణానికి వాడారో తెలిపారు. బాగా రద్దీ ఉండే అనేక ఎయిర్ పోర్టులు వెయ్యి నుంచి రెండువేల ఎకరాలలో ఉన్న మాట వాస్తవమే కదా! జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూ సేకరణను 2500 ఎకరాలకు పరిమితం చేసి రైతులలో ఆందోళన తగ్గించారు. భూములు కోల్పోయినవారికి ఎకరాకి రూ.12.5 లక్షల బదులు రూ.28 నుంచి రూ.36 లక్షల వరకు చెల్లించారు. చంద్రబాబు అనుమతులతో సంబంధం లేకుండా 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేస్తే జగన్ ముఖ్యమంత్రిగా కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించి, చంద్రబాబు టైమ్‌లో ఉన్న చిక్కు ముళ్లను విప్పి, కేసుల పరిష్కారం చేసి, రైతులకు కూడా అసంతృప్తి లేకుండా చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు గతంలో కూడా కుప్పం, నెల్లూరు జిల్లాలోను విమానాశ్రయాలకు శంకుస్థాపన చేశారు. కుప్పంలో అయితే ఎనిమిది నెలల్లో పూర్తి చేసేస్తామని ప్రకటించారు. ఈ టర్మ్‌లో అప్పుడే 18 నెలలు పూర్తి అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అది ఉండిపోయింది. అంతేకాదు. కొందరు విజయవాడ మెట్రో 2019కల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు హడావుడి చేశారు. కాని అది అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు పూర్తి చేయలేకపోయిన కనకదుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్‌ను జగన్ ప్రభుత్వం పూర్తి చేయించింది. అలాగే కృష్ణా వరద రాకుండా కృష్ణలంక ప్రాంతంలో భారీ రిటైనింగ్ వాల్ ను జగన్ ప్రభుత్వమే నిర్మించింది. చంద్రబాబు ట్రాక్ రికార్డు అత్యధిక సందర్భాల్లో.. శంకు స్థాపనలు,ప్రచారాలకే పరిమితం. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లు తాము చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి అయ్యే దిశగా అడుగులు వేశారు. అందులో భోగాపురం ఎయిర్ పోర్టు ఒకటి. కనుక దీని క్రెడిట్ లో సింహభాగం జగన్‌కే దక్కుతుందని చెప్పొచ్చు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


