అంతరిక్షంలోకి మొదటిసారి బ్రిటిష్ మహిళ
లండన్ః అంతరిక్షంలోకి మొట్ట మొదటిసారి బ్రిటిష్ మహిళ పయనమైంది. తన రష్యన్ క్రూ మేట్స్ తో కలసి శుక్రవారం స్పేస్ ఫ్లైట్ ఎక్కిన హెలెన్ షర్మాన్.. ఇప్పటిదాకా అంతరిక్షంలోకి వెళ్ళిన మహిళా వ్యోమగాముల్లో 12వ మహిళగా చరిత్ర సృష్టించారు. సోయూజ్ టిఎమ్12 వ్యోమ నౌకలో.. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నతన రష్యన్ క్రూమేట్స్ తో కలసి హెలెన్ అంతరిక్షంలోకి వెళ్ళారు.
1991 మే 20న మిర్ స్పేస్ స్టేషన్ నుంచి మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్ళిన తన ఇద్దరు క్రూ మేట్స్ అయిన రష్యన్ వ్యోమగాములు అనటోలి అర్ట్సెబర్స్ కీ, సెర్జీ క్రికలెవ్ ల తో కలసి హెలెన్ స్పేస్ ప్రయాణం ప్రారంభించారు. ఆరు రోజుల పాటు అంతరిక్షంలో గడపనున్న హెలెన్ బృందం అనేక శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు.
అంతరిక్ష నౌకను ఎక్కేందుకు ధరఖాస్తు చేసిన మొత్తం 13,000 మంది అభ్యర్థుల్లో హెలెన్ షర్మాన్ స్పేస్ ప్రయాణానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం హెలెన్... ప్రముఖ లండన్ సైన్స్ యూనివర్శిటీకి చెందిన ఇంపీరియల్ కాలేజ్ లో రసాయన శాస్త్ర విభాగానికి ఆపరేషన్స్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హెలెన్ తో పాటు స్పేస్ లోకి ప్రయాణమైన క్రికలేవ్ ఇప్పటికే ఎన్నోసార్లు అంతరిక్షంలోకి వెళ్ళి, వ్యోమగామిగా ఎంతో అనుభవాన్ని పొందారు. ఆయన మొత్తం 803 రోజుల అంతరిక్షంలో గడిపారు. అంతేకాక అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన రెండవ ప్రముఖ వ్యోమగామిగా ఆయన పేరొందారు.