cricket betters arrest
-
క్రికెట్ బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్
సాక్షి, శ్రీకాకుళం: ప్రస్తుత క్రికెట్ వరల్డ్‌కప్ నేపథ్యంలో యువత బలహీనతను సొమ్ము చేసుకుంటున్న బెట్టింగ్ ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ మేరకు నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి న్యూకాలనీలోని క్లాసిక్ మెడికల్ ఏజెన్సీపై నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు పక్కా సమాచారంతో దాడి చేశారు. మొత్తం 17 మంది నిందితుల్లో 9 మందిని అరెస్టు చేశారు. మిగతావారు పరారయ్యారు. వీరి నుంచి రూ.5,91,360 నగదు, 9 సెల్ఫోన్లు, 3 ఏటీఎం కార్డులు, ఒక చెక్ బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నగరంలో ఎస్పీ అమ్మిరెడ్డి వివరాలు వెల్లడించారు. బెట్టింగ్ వ్యవహారంలో బుగత దేవీప్రసాద్, పెల్లూరి రాజేష్, పళ్లా గణేష్, మరడాన సురేష్‌కుమార్, అల్లు ఉమామహేశ్వరరావు, పెళ్లూరి విజయ, బుడ్డి గురునాథరావు, శిమ్మ భాస్కరరావు, కడిమి ఉమామహేష్, సర్వేశ్వరరావులను అరెస్టు చేసినట్లు వివరించారు. నాగరాజు, అప్పన్న, రవిశంకర్, రాజేష్, వెంకటరమణ, రామినాయుడు, బరంపురం శ్రీను, మయూరి పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రధానంగా జిల్లాలో జూదం, బెట్టింగ్, బైక్ రేసింగ్, గంజాయి తదితర మాదకద్రవ్యాల విక్రయం వంటి అనైతిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం నగరం, రాజాం పట్టణ క్లబ్‌ల్లో జూదం ఆడుతున్నట్లు సమాచారం ఉందని, దీనిపైనా దృష్టి పెట్టామన్నారు. ఇటీవల జాతీయ రహదారిపై రాత్రిళ్లు బైక్ రేసింగ్ చేస్తున్నట్లు సమాచారం ఉందని, దీనిపైనా నిఘా పెట్టి అరెస్టు చేస్తామన్నారు. గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ఇప్పటికే పెద్ద ఎత్తున పట్టుకున్నామని, ఎవరికైనా మాదకద్రవ్యాల విషయంలో సమాచారం ఉంటే తెలియజేయాలన్నారు. బెట్టింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన ఏఎస్ చక్రవర్తి, పీవీ కృష్ణవర్మ, ఎస్ శంకరరావు, ఎం పారినాయుడు, కే ముకుందరావు, వై ప్రసాదరావు, ఎల్ జగన్మోహనరావు, వీ మోహనరావు, బీ సత్యనారాయణ, ఈ రామకృష్ణ, పీ శివ, ఎస్ ఉషాకిరణ్‌లను అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ మంగరాజు, డీఎస్పీ చక్రవర్తి పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
సింగరేణి(కొత్తగూడెం): ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ఎస్ఎం.అలీ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్‌దత్ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వ్యక్తులపై జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా కొత్తగూడెం టూ టౌన్లో క్రికెట్ బెట్టింగ్‌లకు కొంతమంది పాల్పడుతూ అమాయకులను బలిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు కడారి వేణుగోపాల్, దేవేందర్‌సింగ్, శ్రీరాములు విశ్వనా«థ్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు సెల్పోన్లు, రూ.24 వేను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఎంబీఏ గోల్డ్‌మెడల్, ఎంటెక్ స్టూడెంట్, ఇంటర్నేషనల్ కిక్బాక్సర్లు ఉండటం విశేషం. చదువుకున్న వారు మంచి భవిష్యత్‌లో పయనించాల్సిన వారు ఇలాంటి తప్పుడు పనులు చేసుకుంటూ, డబ్బు సంపాదించాలనే అత్యాశతో విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వీరు సెల్‌ఫోన్ ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని నెట్ పాయింట్ ద్వారా టీమ్‌లో టాప్‌గా ఉన్న టీమ్‌ను అంచనా వేసుకొని బాల్ టూ బాల్, ఓవర్ టూ ఓవర్, మ్యాచ్ టూ మ్యాచ్‌ను బట్టి టీమ్ ప్లేయర్‌ను బట్టి ప్లేయర్ మీద రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు బెట్టింగ్ కాస్తున్నారు. విలేకరుల సమావేశంలో టూ టౌన్ సీఐ గోపి, ఎస్సైలు కుమారస్వామి, అమీర్‌జానీ, సిబ్బంది పాల్గొన్నారు. బెట్టింగు రాయుళ్లను పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ సునీల్‌దత్, డీఎïస్సీ ఎస్ఎం. అలీ అభినందించారు. -
బెట్టింగ్ వీరి ప్రొఫెషన్
శంషాబాద్: క్రికెట్ బెట్టింగ్ ప్రొఫెషన్‌గా మార్చుకొన్న ఇద్దరు సోదరులతో పాటు వారికి సహకరించిన ఓ ఏజెంట్, ఓ గ్యాంబ్లర్‌ను శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో పాతనగరంలోని ఘాన్సీబజార్‌కు చెందిన అకింత్ అగర్వాల్(28), మోహిత్ అగర్వాల్(25) క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో నిరంతరంగా బిగ్‌బాష్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు బెట్టింగ్‌లపై నిఘా పెంచారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తాలో ఉన్న ఓ హోటల్ ఓ గదిని అకింత్ అగర్వాల్, మొహిత్ అగర్వాల్‌తో పాటు జిడిమెట్ల ప్రాంతానికి చెందిన యాసిమిన్ మహేష్(44) కలెక్షన్ ఏజెంట్, బెట్టింగ్ సబ్ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్న చార్‌కమాన్ బస్తీకి చెందిన రోహిత్ అగర్వాల్ (27) అద్దెకు తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 5 లక్షల నగదుతో పాటు ఎనిమిది సెల్ఫోన్లు, ఓ క్యాలికులేటర్, స్కోరింగ్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా అంకిత్, మొహిత్ అగర్వాల్‌లు 2016 క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుత సుల్తాన్‌బజార్ పోలీసులకు చిక్కి జైలుశిక్ష సైతం అనుభవించారు. అదే తరహాలో 2018 ఐపీఎల్ క్రికెట్ సందర్భంలో రాజేంద్రనగర్, వెస్ట్‌మారేడ్‌పల్లి పోలీసులు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ లావాదేవీలన్నింటినీ వీరు కొనసాగిస్తున్నారని డీసీపీ ప్రకాష్‌రెడ్డి తెలిపారు. యువత క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడకూడదని డీసీపీ సూచించారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా చాలామంది యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసులు గట్టి నిఘా వేసి ఉంచారని చెప్పారు. బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసి ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులను డీసీపీ అభినందించారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
రాజమహేంద్రవరం క్రైం : క్రికెట్ బెట్టింగ్ ముఠాను రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారికి వచ్చిన సమాచారం మేరకు అడిషనల్ ఎస్పీ రజనీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో సౌత్ జోన్ డీఎస్పీ పురేటి నారాయణ రావు సమక్షంలో టూ టౌన్ సీఐ ముక్తేశ్వరరావు, ఎస్సైలు కె.నాగరాజు, నాగబాబు దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. గురువారం రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ మండలం డీఎస్పీ పి.నారాయణ రావు బెట్టింగ్ ముఠా వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఐపీఎల్ 11వ సీజన్లో రాజస్ధాన్ రాయల్, కోల్కత్తా నైట్ రైడర్స్ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రాజమహేంద్రవరం ఆల్కట్ తోట కన్నమాంబా వారి వీధిలో చింతా కనకరత్నం అనే మహిళకు చెందిన ఇల్లును అద్దెకు తీసుకొని ఆమె చెల్లెల కుమారుడు చింతా జాన్‌పాల్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ బెట్టింగ్ ముఠాలో సభ్యులు ఆల్కట్ తోటకు చెందిన చింతా జాన్ పాల్, నీలపు దామోదరరావు, సావాడ ప్రసాద్ రెడ్డి, లంకె చిరంజీవి, సీరాపు పాపారావు, మద్ది దుర్గారావులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.1.30 లక్షల నగదు, వీడియోకాన్ టీవీ, సెటప్ బాక్స్, రెండు మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం 14 మంది ఉన్నారని తెలిపారు. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మిగిలిన ఎనిమిది మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. నిందితులు రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం, కొవ్వూరు ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్‌పై నిరంతర నిఘా.. క్రికెట్ బెట్టింగ్‌పై నిరంతర నిఘా ఉందని, రాజమహేంద్రవరంలో ఈ సీజన్లో నాలుగు కేసులు పట్టుకున్నట్టు వివరించారు. కడియం మండలంలో ఒక క్రికెట్ ముఠాను పట్టుకొని వారి వద్ద నుంచి రూ.నాలుగు లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్, వన్‌టౌన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టూ టౌన్ సీఐ ముక్తేశ్వరరావు, ఎస్సైలు కె. నాగరాజు, నాగబాబు పాల్గొన్నారు. -
ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
ఏలూరు(పశ్చిమగోదావరి): క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో శుక్రవారం జరిగింది. వివరాలు..పట్టణంలోని గొల్లయ్యగూడెం రాజీవ్‌గృహకల్ప నివాసంలో బెట్టింగ్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు బెట్టింగ్ స్థావరంపై దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టణంలోని తూర్పు వీధికి చెందిన చెన్నశెట్టి రామారావు, దొరగాడ శ్రీనివాస్‌లుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ.13,100, 15 సెల్ఫోన్లు, ఒక టీ.వీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.