పాక్లో జింబాబ్వే పర్యటన అనుమానం
కరాచీ : పాకిస్తాన్లో క్రికెట్ పునరుద్ధరణ మళ్లీ సందేహంలో పడింది. ఈ నెల 19న జింబాబ్వే జట్టు పాక్లో క్రికెట్ సిరీస్ ఆడేందుకు రావాల్సి ఉంది. అయితే బుధవారం కరాచీలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో జింబాబ్వే బోర్డు పునరాలోచనలో పడింది. పాక్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు గురువారం ప్రకటించింది. కానీ ఆ వెంటనే రద్దు చేసుకోవడం లేదని, ఆలోచిస్తున్నామని తెలిపింది. పాక్ బోర్డుతో మరోసారి చర్చలు జరుపుతామని పేర్కొంది.