బాంబుదాడితో ఉలిక్కిపడిన బ్రస్సెల్స్
బ్రస్సెల్స్: బెల్జియం ఉలిక్కిపడింది. రాజధాని బ్రస్సెల్స్లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ ల్యాబ్ వద్ద బాంబు పేల్చి ఇద్దరు అగంతకులు లోపలికి చొరబడినట్లు తెలుస్తోంది. బెల్జియం వార్తా కథనాల ప్రకారం తెల్లవారు జామున ఉదయం 2.3గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ కారు ఇన్ స్టిట్యూట్ కు ఉన్న మూడు ఫెన్సింగ్ లను ఢీకొంటూ నేరుగా లోపలికి దూసుకెళ్లిందని అందులో ఉన్న ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు లేబోరేటరీలకు సమీపంలో బాంబులు పేల్చారని సమాచారం. ఈ బాంబు దాడితో బ్రస్సెల్స్లో ఇప్పటికే ఉన్న అప్రమత్తత పరిస్థితిని మరింత జఠిలం చేసింది. ప్రస్తుతానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఎలాంటి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.