crops Details
-
పంటల వివరాలకు ప్రత్యేక పోర్టల్
సాక్షి, హైదరాబాద్ : వానాకాలం నుంచి నియంత్రిత సాగు విధానం అమలులో భాగంగా రైతు లు, విస్తీర్ణం, పంటల వారీగా వివరాలు నమో దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ గుంట భూమిలోనూ వేసిన పంటల వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌లో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఈ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ కె.విజయ్ కుమార్‌ను చీఫ్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా నియమించింది. పంటల సాగు విస్తీర్ణం మాడ్యూల్ రైతులు, పంటలు, సర్వే నంబరు వారీగా వివరాలు నమోదు చేసేందుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సహకారంతో వ్యవసాయ శాఖ ప్రత్యేక మాడ్యూల్‌ను రూపొందించింది. క్రాప్సోన్ ఏరియా మాడ్యూల్ (పంటల సాగు విస్తీర్ణం నమూనా)లో రైతులు, పంటల వివరాలు నమోదు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిపై ముందస్తు అంచనా వేయడం సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఆయా పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడంపై ప్రణాళికలు రూపొందించడం కూడా సులభమవుతుందని అధికారులు చెప్తున్నారు. -
నూనెగింజల సాగులో మొండి చేయి..
ఆహార భద్రత పథకాన్ని పక్కాగా అమలు చేసి ఆహాధాన్యాల కొరతను అధిగమిస్తామని ప్రభుత్వం చెబుతోంది.అందుకు అవసరమైన ప్రణాళికలను జిల్లా నుంచి పంపినా పట్టించుకోలేదు. నూనెగింజల పథకానికి నిధులు కేటాయిస్తూ జీఓలు మాత్రం జిల్లా వ్యవసాయశాఖకు పంపింది. పరికరాల విషయంలో ప్రభుత్వంలోని పెద్దలకు, కంపెనీల మధ్య డీల్ కుదరక, ధరలు ఖరారుకాక పథకాలు మూలన పడిపోయాయని వ్యవసాయశాఖ అధికారులే పెదవి విరుస్తున్నారు. కడప అగ్రికల్చర్ : నూనెగింజల పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. దీంతో ఏడాది కేడాది నూనెగింజల పంటల సాగు తగ్గిపోతోంది. జిల్లాకు జాతీయ ఆహార భద్రత (ఎన్ఎస్ఎఫ్ఎం), నూనె విత్తుల పథకం (ఐసోఫాం)ను మొన్నటి వరకు వేర్వేరుగా నిర్వహించే వారు, ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి జాతీయ ఆహార పథకాన్ని అమలు చేస్తున్నారు.ఇందుకగాను 600 సాగునీటిపైపుల యూనిట్లు జిల్లాకు కేటాయించారు. నీటిని పొదుపుగా వాడుకునేందుకు వీలుగా తుంపర సేద్య పరికరాలు 600 యూనిట్లు, మరొక పథకానికి కలిపి రూ.50 లక్షల నిధులు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు జారీ చేసింది. ఈ పథకాల్లోని పరికరాల కోసం టెండర్లు పిలిచింది. ప్రభుత్వం మొండి పట్టుదలతో గత ఏడాది ఇచ్చిన ధరలకే ఇప్పుడు టెండర్లు కోట్ చేయాలనే సంకేతాలు ఇవ్వడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఖరీప్ నుంచి ఇప్పటి వరకు ఆయా పథకాలు నిర్వీర్యమైపోయే పరిస్థితులు ఉన్నాయి.ఈ టెండర్లు ఖరారై ధరలు నిర్ణయమయ్యే లోపు ఖరీఫ్ పంటకాలం ముగిసిపోతుందని వ్యవసాయశాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. సాగునీటి కోసం రైతులు భగీరథ పోరాటాలు చేస్తున్నారు. సాగునీటి కష్టాలు కర్షకులకు కన్నీటిగాథను మిగులుస్తోంది. సేద్యపు జలాలను పొదుపుగా వాడడం కోసం సబ్సిడీ పైపులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం రైతుల కళ్లల్లో కాంతులు నింపలేదు. సేద్యపు నీటి కష్టాలు తీర్చలేదు. 600 యూనిట్లు మంజూరు జాతీయ ఆహార భద్రత పథకం కింద సాగు నీటిపైపులు 600 యూనిట్లు మంజూరు చేశారు. ఇందులో ఒక్కో యూనిట్లో ఎకరాకు 60 పైపులు ఇవ్వనున్నారు.సాగునీటి పైపులకు గత ఏడాది రూ.7500 రాయితీ ఇచ్చారు. ఈ పథకం మొత్తానికిగాను రూ.35లక్షలు కేటాయించారు. అదే విధంగా నూనె గింజల అభివృద్ధి పథకం కింద దాదాపు రూ.15 లక్షలు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు పథకాలకు రూ.50 లక్షలు కేటాయించారు. ఇందులో ఒక్కో యూనిట్‌కు 60 పైపులు ఇస్తారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులకు పథక ఫలాలు అందడం లేదు. మార్కెట్లో పైపులు, తుంపర సేద్య పరికరాల ధరలు అధికంగా ఉంటున్నాయని, డీజిల్, పెట్రోలు ధరలు పెరిగినందున పాత ధరలకు ఇవ్వలేమని కంపెనీలు నిరాకరించినందున, తాము కూడా ఆయా కంపెనీలు కొత్తగా ప్రకటించిన ధరలకు పైపులు, తుంపర సేద్య పరికరాలు కొనుగోలు చేసి అందించలేమని ప్రభుత్వం చేతులెత్తేయ్యడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం కంటే ఇచ్చేదేదో మాకే ఇస్తే తుంపర సేద్య పరికరాలు, పైపులు మేమే తెచ్చుకుంటాం..కదా? అని రైతులు అంటున్నారు. రైతుల ప్రశ్నలకు అటు ప్రభుత్వం నుంచి, ఇటు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. రైతులంటే ప్రభుత్వానికి చిన్నచూపు రైతులకందించే పథకాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. ఈ ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపు. సాగునీటి పైపుల విషయంలో ప్రభుత్వ తీరు అధ్వానంగా ఉంది. కమీషన్ల కోసం ప్రభుత్వంలోని పెద్దలు ఏమైనా చేస్తారు. రైతులు ఏమై పోయినా ఫర్వాలేదు.. మాకు రావలసిన ఆమ్యామ్యాలు వస్తే చాలని అనుకుంటారు. జి.చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం -
సర్వర్ డౌన్!
నెల్లూరు(అగ్రికల్చర్): రైతులు సాగు చేసే పంటల వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేసేందుకు చేపట్టిన ఈక్రాపింగ్ బుకింగ్ నత్తనడకన సాగుతోంది. వివరాలను జనవరి 31 లోపు పూర్తి చేయాలని తొలుత ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఈనెల 9 లోపు పూర్తిచేయాలని గడువు పెంచింది. సర్వర్ డౌన్ కావడం..సక్రమంగా ట్యాబ్‌లు పనిచేయకపోవడం, రెవెన్యూ, వ్యవసాయ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ క్రాప్ నమోదు ముందుకు సాగడం లేదని వ్యవసాయ శాఖ అధికారులు బాహాటంగానే చెబుతున్నారు. ఈక్రాపింగ్ అంటే: ఈ రబీ సీజన్ నుంచే పంటల సాగు వివరాలను సేకరించి వాటిని ట్యాబ్‌లలో నిక్షిప్తం చేసి రాబోయే కాలంలో ఏయే పంటలు సాగవబోతున్నాయి, ఆయా పంటల్లో ఉన్న సమస్యలు, వాటి సాగు విస్తీర్ణం పెరిగిందా? దగ్గిం దా?, పంటలను ఆశిస్తున్న తెగుళ్లు, ఆ పంటలు మళ్లీ సాగవుతున్నాయా? లేదా? కారణాలు ఏమిటని తెలుసుకునేందుకు ఈ-క్రాప్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. 2,70,965 హెక్టార్లలోని పంటలు నిక్షిప్తం చేయాలి: జిల్లాలో ఈ రబీలో 2,70,965 హెక్టార్ల పంటలు సాధారణ సాగు కాగా, ఇప్పటి వరకు 2,56,938 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ నివేదికలో పేర్కొంది. ఈ పం టల వివరాలన్నింటిని ట్యా బ్‌లలో నిక్షిప్తం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ క్రాపింగ్ బుకింగ్‌కు ఇప్పటి వరకు వ్యవసాయాధికారులు, సిబ్బంది కలిసి జిల్లా వ్యాపితంగా 1,40,905 హెక్లార్లను మాత్రమే నిక్షిప్తం చేశారు. అవరోధాలు ఉండడంతో ఇప్పట్లో ఈ లక్ష్యం నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. రెవెన్యూ సహకారం బంద్: ఈక్రాపింగ్ బుకింగ్ చేసే ప్రక్రియలో జిల్లాలోని 230 మంది ఎంపీఈఓలు, 60 మంది వ్యవసాయ విస్తరణాధికారులు పాల్గొంటున్నారు. ఇందులో ఏ సర్వే నెంబర్ ఏ రైతుకు చెందిందో అర్థం కాక, గ్రామస్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారులు సహకరించక అల్లాడుతున్నామన్నారు.