సర్వర్ డౌన్! | surver down on e cropping booking | Sakshi
Sakshi News home page

సర్వర్ డౌన్!

Published Wed, Feb 10 2016 2:03 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

surver down on e cropping booking

నెల్లూరు(అగ్రికల్చర్): రైతులు సాగు చేసే పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేందుకు చేపట్టిన ఈక్రాపింగ్ బుకింగ్ నత్తనడకన సాగుతోంది. వివరాలను జనవరి 31 లోపు పూర్తి చేయాలని తొలుత ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఈనెల 9 లోపు పూర్తిచేయాలని గడువు పెంచింది. సర్వర్ డౌన్ కావడం..సక్రమంగా ట్యాబ్‌లు పనిచేయకపోవడం, రెవెన్యూ, వ్యవసాయ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ క్రాప్ నమోదు ముందుకు సాగడం లేదని వ్యవసాయ శాఖ అధికారులు బాహాటంగానే చెబుతున్నారు.
 
ఈక్రాపింగ్ అంటే:
ఈ రబీ సీజన్ నుంచే పంటల సాగు వివరాలను సేకరించి వాటిని ట్యాబ్‌లలో నిక్షిప్తం చేసి రాబోయే కాలంలో ఏయే పంటలు సాగవబోతున్నాయి, ఆయా పంటల్లో ఉన్న సమస్యలు, వాటి సాగు విస్తీర్ణం పెరిగిందా? దగ్గిం దా?, పంటలను ఆశిస్తున్న తెగుళ్లు, ఆ పంటలు మళ్లీ సాగవుతున్నాయా? లేదా? కారణాలు ఏమిటని తెలుసుకునేందుకు ఈ-క్రాప్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది.
 
2,70,965 హెక్టార్లలోని పంటలు నిక్షిప్తం చేయాలి:
జిల్లాలో ఈ రబీలో 2,70,965 హెక్టార్ల పంటలు సాధారణ సాగు కాగా, ఇప్పటి వరకు 2,56,938 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ నివేదికలో పేర్కొంది. ఈ పం టల వివరాలన్నింటిని  ట్యా బ్‌లలో నిక్షిప్తం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ క్రాపింగ్ బుకింగ్‌కు ఇప్పటి వరకు వ్యవసాయాధికారులు, సిబ్బంది కలిసి జిల్లా వ్యాపితంగా 1,40,905 హెక్లార్లను మాత్రమే నిక్షిప్తం చేశారు. అవరోధాలు ఉండడంతో ఇప్పట్లో ఈ లక్ష్యం నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు.
 
రెవెన్యూ సహకారం బంద్:
ఈక్రాపింగ్ బుకింగ్ చేసే ప్రక్రియలో జిల్లాలోని 230 మంది ఎంపీఈఓలు, 60 మంది వ్యవసాయ విస్తరణాధికారులు పాల్గొంటున్నారు. ఇందులో ఏ సర్వే నెంబర్ ఏ రైతుకు చెందిందో అర్థం కాక, గ్రామస్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారులు సహకరించక అల్లాడుతున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement