crores rupees
-
క్రికెట్ బెట్టింగ్ జోరు
రాయచోటి రూరల్ : మన దేశంలో యువత నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారిలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఆట క్రికెట్. టి–20 మ్యాచులతో క్రికెట్‌కు మరింత క్రేజ్ పెరిగింది. దీనికి తోడు ఐపీఎల్ పేరుతో నిర్వహిస్తున్న అతి పెద్ద టి–20 క్రికెట్ టోర్నమెంట్‌కు ఆట పరంగా క్రేజ్‌తో పాటు బెట్టింగ్ పరంగా దేశ వ్యాప్తంగా విపరీతమైన మోజు పెరుగుతోంది. ఫోర్లు, సిక్సర్లతో ఐపీఎల్ జోరుగా కొనసాగుతుండటంతో, అంతే స్థాయిలో క్రికెట్‌బెట్టింగ్ కూడా సాగుతోంది. జిల్లా వ్యాప్తం గా ఎక్కడ చూసినా ఐపీఎల్ మాటే. ప్రతి రోజు రెండు మ్యాచ్‌లు ఉండటంతో హోటళ్లు, ప్రధాన కూడలి ప్రాంతాలు, రెస్టారెంట్లు బుకీలకు వేదికగా మారాయి. అయితే జిల్లాలో ప్రొద్దుటూరు బెట్టింగ్‌లో మొదటి స్థానం సాధించగా, రాయచోటి రెండవ స్థానంలో ఉన్నట్లు పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వీటితో పాటు రాజంపేట, కడప, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో బెట్టింగ్‌కు పాల్పడే వారిలో ఎక్కువగా యువత, విద్యార్థులు ఉండటం విశేషం. పలు రకాలుగా బెట్టింగ్‌లు.! ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో బుకీలు, బెట్టింగ్ రాయుళ్లు వివిధ రకాలుగా నిమిషాలలో వేలాది రూపాయలు చేతులు మారే విధంగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఫలా నా ఓవర్లో ఇంత స్కోరు వస్తుంది, ఫలానా ఓవర్లో అవుట్ అవుతారు, ఓవర్ల వారిగా ఫోర్లు, సిక్సర్లు వస్తాయంటూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అలాగే మ్యాచ్ మొత్తానికి ఎవరు గెలుస్తారు, టాస్ వేయకముందే మొదటి ఫీల్డింగ్ చేసే వారో, లేక బ్యాటింగ్ చేసే వారో గెలుస్తారంటూ లక్షల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. అలాగే ప్రధాన ఆట గాళ్ల ఆటతీరుపైన కూడా బెట్టింగ్‌లు జరుపుతున్నారు. ఏదీ ఏమైనా ఎక్కువ శాతం కమీషన్లు తీసుకుని బుకీలు బెట్టింగ్‌కు పాల్పడుతూ యువతలో క్రికెట్‌పై ఉన్న క్రేజ్‌ను సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసుల వలలో చిక్కుతున్న చేపలు, తప్పించుకుంటున్న తిమింగళాలు ప్రతి రోజు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాలతో బెట్టింగ్ రాయుళ్లపై , బుకీలపై , యువతపై పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కాకముందు నుంచి గతంలో బెట్టింగ్‌కు పాల్పడిన వారిని, కేసుల్లో ఉన్న వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కొత్తగా తయారైన బుకీలు, బెట్టింగ్ రాయుళ్లు పోలీసుల నిఘాను ఏమార్చేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుంచి ఇక్కడి వారితో బెట్టింగ్‌లు కట్టించే విధంగా ముందుకు సాగుతున్నారు. దీంతో పోలీసులు మరింత చాకచక్యంగా ప్రవర్తించినప్పటికీ పోలీసులు వేస్తున్న వలలో చిన్నపాటి బెట్టింగ్‌లకు పాల్పడుతున్న చేపలే చిక్కుతున్నాయి కానీ , పెద్ద పెద్ద తిమింగళాలు మాత్రం తప్పించుకుంటున్నాయని రాయచోటి పట్టణంలోనూ, ఇతర ప్రాంతాల్లో కూడా విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. రూ.100 కోట్లు బెట్టింగ్ జరిగే అవకాశం.! జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాలు, మండల , గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా బెట్టింగ్ జరుగుతోంది. ఐపీఎల్ జరిగే నెల రోజులకు పైగా ప్రతి రోజు రూ.2 కోట్లు–2.5 కోట్ల నుంచి మొత్తం 100కోట్ల రూపాయల వరకు బెట్టింగ్‌ల రూపంలో చే తులు మారే అవకాశం ఉన్నట్లు కొం దరు బుకీలు, ప్రధాన బెట్టింగ్ రాయు ళ్లు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లపై 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి: అట్టాడ బాబూజీ, ఎస్పీ యువత చెడుమార్గంలోనకి వెళ్లకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. పోలీసు శాఖ నుంచి మేము కూడా అవగాహన కల్పించే విధంగా కృషి చేస్తున్నాం. షార్ట్ ఫిల్మ్ తీసి దాని ద్వారా అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాం. బెట్టింగ్‌ను నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత . బెట్టింగ్ నివారణకు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో అనుమానాలు ఉన్న వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నాము. బెట్టింగ్ వల్ల చాలా వరకు కుటుంబాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. బెట్టింగ్పైన ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే ఆయా పోలీసు స్టేషన్లలో కానీ, 100 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలి. -
లెక్కల్లో చిక్కులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఏ పద్దులోనైనా గత ఏడాది ముగింపు నిల్వను ఈ ఏడాది ప్రారంభ నిల్వగా చూపిస్తారు. కానీ జిల్లా పరిషత్, జిల్లా ఆడిట్ అధికారులు గత ఏడాది ముగింపు నిల్వకు, ఈ ఏడాది ప్రారంభ నిల్వకు సంబంధం లేకుండా పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చారు. జిల్లా పరిషత్‌కు మంజూరైన బీఆర్జీ నిధుల యుటిలైజేషన్ సర్టిఫికెట్(యూసీ)ల విషయంలో వింతగా వ్యవహరించారు. 2011-12లో మంజూరై న నిధుల్లో వ్యయం పోను సుమారు రూ.76.22 లక్షలు ముగింపు నిల్వ చూపించారు. ఈ క్రమంలో ఆ మొత్తాన్ని 2012-13లో ప్రారంభం నిల్వగా చూపిం చాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా రూ.8.39 కోట్లు ప్రారంభ నిల్వగా ఉన్నతాధికారులకిచ్చిన యూసీలో చూపించారు. దీంతో వారు పంపించిన నివేదికలో కోట్లలో తేడా కనిపించింది. ఇప్పటికే కోట్లాది రూపాయల నిధుల స్వాహా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం వస్తున్న బీఆర్జీ నిధులు జిల్లాలో ఇప్పటికే స్వాహా అయ్యాయి. బీఆర్జీ నిధులను సింగిల్ సిగ్నేచర్‌తో సర్పంచ్‌లు డ్రా చేసే అవకాశం ఉం డడంతో పనులు చేపట్టకుండానే అడ్వాన్సుల కింద ఇప్పటివరకు రూ.7.06కోట్లు స్వాహా చేశారు. అందులో అతి కష్టం మీద కేసులు పెట్టి రూ.5.43కోట్లు రికవరీ చేశారు. ఇంకా రూ.1.63కోట్లు మేర బకాయి ఉండిపోయింది. ఇప్పుడా నిధులొచ్చే పరిస్థితి కన్పించడం లేదు. తాజాగా అంకెల కనికట్టు 2006 నుంచి అమలవుతున్న బీఆర్జీఎఫ్ స్కీమ్‌లో 2011-12లో అంకెల గారడీకి జెడ్పీ అధికారులు దిగారు. ముగింపు నిల్వకు, ప్రారంభ నిల్వకు తేడాగా తయారైన యూసీపై సీఈ ఓ మోహనరావు, ఆడిట్ అధికారి హరిప్రసాద్ సంతకం చేశా రు. దీన్నే పంచాయతీరాజ్ కమిషనర్‌కు పంపించారు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు నివేదికలో తేడా ఉన్న విషయా న్ని గుర్తించి కమిషనర్ వరప్రసాద్‌కు నివేదించారు. దీంతో ఆయన కలెక్టర్ కాంతిలాల్ దండేకు మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ లేఖ రాశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వివరణ ఇవ్వాలంటూ జెడ్పీ సీఈఓ మోహనరావును ఆదేశించారు. ఆదరాబాదరాగా.. ఇదే విషయమై జెడ్పీ సీఈఓ మోహనరావును వివరణ కోరగా అప్పట్లో ఆదరాబాదరాగా పంపించేశామన్నా రు. లోపాలున్నట్లు పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు గు ర్తించారని, దాన్ని సరి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సర్దుబాట్లు ఉంటాయి: జిల్లా ఆడిట్ అధికారి ‘యూసీలో చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటాయి. అదేమీ పెద్ద సమస్య కాదు. నిధులు దుర్వినియోగమైనట్లు కా దు. మీడియాలోకి ఎక్కించే విషయం కాదిది. ఆ తేడా ను సరిచేసే పనిలో జెడ్పీ అధికారులు ఉన్నారు’ అని జిల్లా ఆడిట్ అధికారి హరిప్రసాద్ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించాలనే యోచనలో పంచాయతీ రాజ్ కమిషనర్ వరప్రసాద్ ఉన్నట్లు తెలిసింది. -
చెరువుల్లా మారిన రోడ్లు
చింతలపూడి, న్యూస్‌లైన్ : మెట్ట ప్రాంతంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా నిబంధనలను లెక్కచేయకుండా, నాసిరకంగా పనులు చేయడంతో వేసిన కొద్ది కాలానికే అవి గోతులు పడుతున్నాయి. కాంట్రాక్టర్లు తమ జేబులు నింపుకోవడానికే నిబంధనలను పాటించడం లేదు. దెబ్బతిన్న రహదారులపై రాకపోకలు సాగించడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చింతలపూడి నుంచి గురుభట్లగూడెం వరకు రూ. 15 కోట్ల వ్యయంతో ఇటీవల రోడ్డు విస్తరించారు. భారీ క్వారీ వాహనాల రాకపోకలతో రోడ్డు అక్కడక్కడా దెబ్బతింది. మధ్యలో రాఘవాపురంలో కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం చేపట్ట లేదు. దీంతో మెయిన్ సెంటర్లో పెద్ద,పెద్ద గోతులు పడి రోడ్డు చెరువును తలపిస్తోంది. ఫాతిమాపురం నుంచి ప్రగడవరం వెళ్లే రోడ్డును రూ. కోటిపైగా వెచ్చించి ప్రస్తుతం విస్తరిస్తున్నారు. వర్షాలకు రోడ్డు మార్జిన్ కొట్టుకు పోవడంతో పనుల్లో డొల్లతనాన్ని బయట పెడుతోంది. ఏలూరు-చింతలపూడి ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వానంగా మారింది. పట్టణంలోని మారుతీ నగర్ సమీపంలో, పెట్రోలు బంకుల సమీపంలో, చైతన్యభారతి జూనియర్ కళాశాల సమీపంలో ఇటీవలే లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి మరమ్మతులు చేశారు. రోడ్డు వేసిన కొద్ది రోజులకు వర్షాలు పడ్డంతో యథాస్థితికి చేరుకుంది. రోడ్ల మరమ్మతులపై ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు నామమాత్రంగా పనులు చేసి జేబులు నింపుకొంటున్నారనే విమర్శలున్నాయి. రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు ప్రభుత్వం రూ. కోట్లు మంజూరు చేసినా ఫలితం కనిపించడం లేదు. రోడ్డుపై వేసిన తారు పైకిలేచి కంకర తేలిపోతోంది. పలు ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోతున్నాయి. మరమ్మతుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే ఈపరిస్థితి ఉండదని ప్రజలంటున్నారు