ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
దేవరపల్లి : స్థానిక కరుటూరి ఫంక్షన్‌హాలు వద్ద సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని బందపురానికి చెందిన కాకరపర్తి వేములియ్య(60) కరుటూరి ఫంక్షన్ హాలులో ఆదివారం రాత్రి జరిగిన పెళ్లికి హాజరై సోమవారం తెల్లవారుజామున బయటకు వచ్చారు. రోడ్డు దాటుతుండగా విశాఖ నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో వేములియ్య అక్కడకక్కడే మృతి చెందాడు.