cruelty on animals
-
'కుంభవృష్టికి కారణం.. జంతు హింసే..'
డెహ్రాడూన్: మాంసం కోసం జంతువులను చంపడం వల్లే హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడుతున్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బెహెరా అన్నారు. ఈ కారణంగానే కుంభవృష్టి వంటి విపత్తులు సంభవిస్తున్నాయని ఆయన చెప్పారు. జంతువులను చంపడం వల్లే పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతుందని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాంసం కోసం జంతువులను చంపడం వల్ల పర్యావరణం ఎలా ప్రభావితమౌతుందో ప్రస్తుతం ప్రజలు చూడలేకపోతున్నారని బెహెరా చెప్పారు. కానీ త్వరలో ఈ పరిణామాలు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. ప్రసంగంలో మంచి మనుషులుగా మారడానికి ఏం చేయాలని బెహెరాను కొందరు విద్యార్థులు అడిగారు. ఇందుకు మాంసం తినడం మానేయాలని బెహెరా చెప్పారు. ఈ సందర్భంలోనే రాష్ట్రంలో విపత్తులు జంతువులను చంపడం వల్లనే వస్తున్నాయని అన్నారు. విద్యార్థుల చేత మాంసం తినడం మానేసేలా జపించాలని కోరారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాంసం తినడానికి అతి వర్షాలకు సంబంధం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల వరదలు బీభత్సం సృష్టించాయి. నదులు పొంగి ప్రవహించాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 250 మంది వరకు మరణించారు. రూ.2,913 కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వం పేర్కొంది. ఇదీ చదవండి: G20 Summit:ఢిల్లీలో భారీ భద్రత.. ట్రాక్టర్‌పై పోలీసుల పెట్రోలింగ్ -
తన కారుపై కుక్క మూత్రం పోసిందని!
-
తన కారుపై కుక్క మూత్రం పోసిందని!
నోరులేని మూగ జీవాలపై మనుషుల అమానుష దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికిమొన్న హైదరాబాద్‌లో ఓ కిరాతకుడు కుక్కను చంపి.. దానిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇద్దరు మెడికల్ విద్యార్థులు కుక్కను బంగ్లా మీద నుంచి కిందకు విసిరేసి.. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇటీవల కొందరు పిల్లలు సరదా కోసం కుక్క తోక పట్టుకొని గిరగిరా తిప్పి విసిరేశారు. తాజాగా ఇదేరీతిలో ముంబైకి చెందిన ఓ వ్యక్తి శునకంపై దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఖరీదైన తన కారుపై వీధి కుక్క మూత్రం పోసిందని.. అది పడుకున్న సమయంలో దానిపైనుంచి పోనిచ్చాడు. దీంతో తీవ్రగాయపడిన కుక్క బాధతో విలవిలలాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు, వివరాలను తాజాగా ‘ఫీడ్ ఏ స్ట్రే. ఎవ్రీడే’ ఫేస్బుక్ పేజీ వెలుగులోకి తెచ్చింది. వెంటనే ఈ పోస్టు వైరల్‌గా మారిపోయింది. ముంబైకి చెందిన సౌరబ్ దుఖాండే అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఈ ఫేస్బుక్ పేజీ వెల్లడించింది. ‘సిగ్గులేని వ్యక్తి.. అమాయకమైన జీవులపై మనుషులు ఇంత క్రూరంగా ఎలా ఉండగలరు. తన కారుపై మూత్రం పోసిందనే కారణంగా పగ దీర్చుకోవాలని ఈ కుక్కపిల్ల పడుకొని ఉన్న సమయంలో దానిపై నుంచి కారును పోనిచ్చాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాడు చేసినా పట్టించుకోలేదు’ అని ఈ ఫేస్బుక్ పేజీ యూజర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తర్వాత పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మరో నెటిజన్ తెలిపారు.