ఆంధప్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోభం
హైదరాబాద్: ఆంధప్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. డిమాండ్ బాగా పెరగడంతో ప్రధాన ఉత్పత్తి కేంద్రాల్లో పడిపోయిన విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. 1300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లోటు ఏర్పడింది. ఆర్టీపీపీలో 420 మెగావాట్లు, వీటీపీఎస్ లో 210 మెగావాట్లు, కృష్ణపట్నంలో 200 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉత్పత్తి అవుతోంది.
అనంతపురం విండ్ పవర్ స్టేషన్లో 500 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం కలిగింది. కడప ఆర్టీపీపీలో సాంకేతిక లోపంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు భారీగా పెరిగాయి. ఈ రాత్రి నుంచి విద్యుత్ కోతలు మరింత పెరగనున్నాయి.