జూ పార్క్‌లో దౌర్జన్యానికి పాల్పడిన ఇద్దరికి రిమాండ్
బహదూర్‌ఫురా (హైదరాబాద్): నెహ్రూ జూ పార్కు క్యూరేటర్ శివానీ డోగ్రాపై దౌర్జన్యానికి పాల్పడిన ఇద్దరు సందర్శకులను బహదూర్‌పురా పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సింహాల ఎన్‌క్లోజర్ వద్ద గురువారం విశాంత్ (20) అనే వ్యక్తి రేలింగ్ ఎక్కి సింహాలకు సైగలు చేస్తున్నాడు. అదే సమయంలో ఆ మార్గంలో పరిశీలనకు వచ్చిన క్యూరేటర్ శివానీ డోగ్రా గమనించి యువకున్ని మందలించింది.
దీంతో విశాంత్ తండ్రి ప్రశాంత్ క్యూరేటర్‌ను కుమారుడితో కలిసి తోసేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీన్ని గమనించిన యానిమల్ కీపర్లు వారిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. క్యూరేటర్ శివానీ డోగ్రా ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకొని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.