నోట్ల మార్పిడి కోరుతూ బ్యాంకు ముందు ధర్నా
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల కష్టాలు కొనసాగుతున్నాయి. తాజాగా మెహదీపట్నం ఆంధ్రాబ్యాంకు ఎదుట గురువారం ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంకు సిబ్బంది తాళాలు తెరవకపోవడంతో క్యూలో నిల్చున్న వారికి కోపం కట్టలు తెంచుకుంది. పెద్ద సంఖ్యలో ఖాతాదారులు రోడ్డుపై ధర్నాకు దిగారు.
గత 15 రోజులుగా డబ్బుల్లేక నానా అవస్థలు పడుతుంటే బ్యాంకు ఇంకా తెరవకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఖాతాదారులతో చర్చిస్తున్నారు.