నెత్తిన నిప్పుల కుంపటి
మీరు చూస్తున్నది నిజమే. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. మన దేశంలోని ఓ హెయిర్ సెలూన్లో జుత్తుకు నిప్పంటించి కటింగ్ చేస్తున్న వీడియో ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ క్షురకుడు ఏం చేశాడంటే.. కస్టమర్ రాగానే.. జుత్తు మీద మండే స్వభావం ఉన్న ఓ పౌడర్, ద్రవాన్ని వేశాడు. తర్వాత తన వద్దనున్న లైటర్‌తో అంటించేశాడు.
జుత్తు మండుతుండగానే.. అందరూ నోరెళ్లబెట్టి చూస్తుండగానే.. చేతిలోకి రెండు దువ్వెనలు తీసుకుని.. తాను అనుకున్న స్టైల్ కు తగ్గట్లు కట్‌చేసి.. షేప్‌లోకి తెచ్చేశాడు. ఇలా రెండు సార్లు అంటించాడు. గతంలోనూ మన దేశంలో కొందరు క్షురకులు కొవ్వొత్తిని అంటించి.. ఆ మంటతో కటింగ్ చేయడం తెలిసిందే. అయితే.. ఇది నెత్తి మీదే మంటపెట్టి చేయడం మాత్రం ఇదే తొలిసారి. అయితే.. ఇతడు ఏ ఊరుకు చెందినవాడన్న వివరాలు తెలియరాలేదు.