cyber cell police
-
హైదరాబాద్‌లో బయటపడ్డ మరో ఉగ్ర కోణం.. ఇదంతా అందుకేనా?
సాక్షి, హైదరాబాద్: అతిపెద్ద సైబర్ క్రైమ్ ఫ్రాడ్‌ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో రూ. 712 కోట్ల ఫ్రాడ్ చేసిన ముఠాని అదుపులోకి తీసుకున్నామని సీపీ ఆనంద్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ తరహా మోసాలకు సంబంధించి 15 వేల మంది బాధితులు ఉన్నారని అన్నారు. టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా ఈ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఆన్లైన్ లో టాస్క్‌ల పేరుతో.. మొదట డబ్బులు ఇచ్చి... ఆ తర్వాత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మోసం చేస్తున్నారని.. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఇందులో అమాయకులే కాకుండా హై లెవెల్ పొజిషన్ లో ఉన్న ఐటీ ఎంప్లాయిస్ కూడా బాధితులు ఉన్నట్లుగా గుర్తించారని చెప్పారు. శివకుమార్ అనే ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేశామన్నారు. చైనా, దుబాయ్ కేంద్రంగా ఈ ఫ్రాడ్ జరుగుతోందని చెప్పారు. ఇక్కడ ఎజెంట్లను నియమించుకొని, షెల్ కంపెనీలు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి చైనా, దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారని అన్నారు. చైనా, దుబాయ్‌లో ఉన్న ప్రధాన నిందితులకు ఇండియాలో సహకరిస్తున్న 9 మందిని అరెస్ట్ చేశామన్నారు. అకౌంట్స్ లో ఉన్న డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసుకుని చైనా, దుబాయ్‌లో విత్‌డ్రా చేసుకుంటున్నారని అన్నారు. ఇక్కడ ఫ్రాడ్ చేసిన డబ్బును టెర్రరిస్టులకు ఫైనాన్స్ చేసే అవకాశం కూడా ఉందన్నారు. ఎన్ఐఐ(NIA) వాళ్ళకి ఈ కేసు గురించి సమాచారం ఇచ్చామని ..వాళ్లు కూడా ఇన్వాల్వ్ అవచ్చని చెప్పుకొచ్చారు. హిజ్బుల్ టెర్రర్ మోడ్యూల్ కి క్రిప్టో కరెన్సీ ట్రాన్స్ఫర్ పై ఎన్ఐఏ దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. చదవండి తల్లిని దరిచేర్చిన యూ ట్యూబ్ -
‘కిలాడి కపుల్’.. పెళ్లి పేరుతో 35 మందికి ట్రాప్.. కోటికిపైగా వసూల్!
లక్నో: మ్యారేజ్ బ్యూరోల్లో నకిలీ వివరాలతో మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో వెలుగుచూసింది. నకిలీ మ్యాట్రిమోనియల్ ప్రోఫైల్స్ ద్వారా ఓ కిలాడి జంట ఏకంగా 35 మందిని మోసం చేసింది. వారికి సుమారు రూ.1.6 కోట్లకు టోకరా వేశారు దంపతులు. నకిలీ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న జంటను సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన మహిళ, జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇద్దరు కలిసి ఇప్పటి వరకు 35 మందిని మోసగించారు. వారి నుంచి సుమారు రూ.1,63,83,000లు దోచుకున్నారు. ‘వివాహం పేరుతో తన కూతురి వద్ద రూ.27 లక్షలు తీసుకున్నారని ఓ సైనికాధికారి మొరాదాబాద్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబర్ సెల్ టీంతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. దర్యాప్తు చేపట్టిన టీం ఇద్దరిని అరెస్ట్ చేసింది. వారిని కోర్టులో ప్రవేశపెట్టాం. గత ఏడాదిన్నరగా సుమారు 35 మందిని మోసగించినట్లు తేలింది. అందమైన ఫోటోలతో మ్యాట్రిమేనియల్ సైట్స్‌లో ఆకర్షించేలా ప్రోఫైల్స్ పెడతారు. ఎవరైనా వారి కాంటాక్ట్‌లోకి వస్తే వారిని మాటల్లో పెట్టి మచ్చిక చేసుకుంటారు. ఆ తర్వాత వివిధ కారణాలతో డబ్బులు అడుగుతారు. అరెస్ట్ చేసిన వారు జార్ఖండ్‌కు చెందిన బబ్లూ కుమార్, బిహార్‌కు చెందిన పూజా కూమారిగా గుర్తించాం. ఇరువురికి వివాహం జరిగింది ’ అని వివరాలు వెల్లడించారు డీఎస్పీ అనూప్ కుమార్. ఇదీ చదవండి: Squid Game: ఒకేసారి 1415 మంది విద్యార్థుల ఆట.. వీరికి రికార్డులు కొత్తేం కాదు.. -
‘రాధే’ పైరసీ: ముగ్గురు సోషల్ మీడియా యూజర్లపై కేసు
గతవారం ఓటీటీలో విడుదలైన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘రాధే’ చిత్రం ఆన్లైన్లో లీకైన సంగతి తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జీప్లెక్స్‌లో పే పర్ వ్యూ విధానంలో విడుదలైంది. అయితే విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ సినిమా ఆన్లైన్లో దర్శనమిచ్చిది. దీనిపై కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందిస్తూ పైరసీ కారులపై మండిపడ్డాడు. మూవీ పైరసీకి పాల్పడిన వారిపై సైబర్ సెల్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించాడు. అంతేగాక జీ5 సంస్థ సైతం దీనిపై సెంట్రల్ సైబర్ సెల్‌కి ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.. ఇదిలా ఉండగా ఈ మూవీ పైరసీ కేసులో గుర్తుతెలియని ముగ్గురు సోషల్ మీడియా ఖాతాదారులపై కేసు నమోదు చేసినట్లు తాజాగా సైబర్ సెల్ పోలీసులు వెల్లండించారు. వీరిలో ఇద్దరు వాట్సాప్ యూజర్లు, ఒక ఫేస్బుక్ ఖాతా దారుడు ఉన్నట్లు చెప్పారు. డబ్బులు తీసుకుని ఫేస్బుక్లో డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా విక్రయించేందుకు అతడు ఆఫర్ చేస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. సదరు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘రాధే చిత్రం పైరసీ వెర్షన్ వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫాంపై లీకైన వెంటనే జీ5 నిర్మాత తమ సైబర్ సెల్లో ఫిర్యాదు చేశారని, ఆయన ఫిర్యాదు మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ వంటి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అనంతరం దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టగా ఇద్దరు వాట్సప్ యూజర్ల ఫోన్ నెంబర్లు, ఫేస్బుక్ ఖాతా దారులను గుర్తించామన్నారు. ప్రస్తుతం తమ టీం మరి కొందరి ఫోన్ నెంబర్లను ట్రాక్ చేసే పనిలో నిమగ్నమైందని తెలిపారు. చదవండి: ‘రాధే’ మూవీ టీంకు భారీ షాక్, సల్మాన్ ఫైర్ -
కాపురం కూల్చిన వాట్సాప్ మెసేజ్..!
కొచ్చి : నకిలీ వార్తలు, పుకార్లతో దేశవ్యాప్తంగా అల్లర్లు, ఘర్షణలు చెలరేగి పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు తెలిసిందే. కేరళలోని కొచ్చిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పొరపాటుగా పోస్టు చేసిన ఓ అడల్ట్ వీడియో శోభ అనే వివాహిత జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. వివరాలు.. సాజు జోసెఫ్‌కు చెందిన విద్యుత్ పరికరాల కంపెనీలో లిట్టో తంకచన్ ఉద్యోగం చేసేవాడు. 2015లో లిట్టో ఓ వాట్సాప్ గ్రూప్‌లో న్యూడ్ వీడీయో ఒకటి పోస్టు చేశాడు. వీడియోలో ఉన్నది సాజు భార్య శోభ అని పేర్కొన్నాడు. దీంతో సాజు కుటుంబంలో చిచ్చు రేగింది. నగ్నంగా ఉన్న వీడియోను శోభ కావాలనే ఇతరులకు పంపిందని ఆరోపిస్తూ సాజు ముగ్గురు పిల్లలతో కలిసి గత మూడేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నారు. భార్యతో విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. లిట్టో అరెస్టు.. శోభకు నరకయాతన తన పేరును, కుటుంబ పరువును రోడ్డుకీడ్చిన లిట్టోపై శోభ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. వీడియోలో ఉన్నది తాను కాదంటూ.. శోభ సైబర్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించారు. అందులో ఉన్నదెవరో తేల్చాలని ఫిర్యాదు చేశారు. కాగా, రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు.. రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీకి వీడియో పంపించి విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా వీడియోలో ఉన్నది శోభ కాదని తేల్చారు. వీడియో అస్పష్టంగా ఉండడంతో దాని మూలం (ఎక్కడి నుంచి వచ్చిందనే సమాచారం) సైతం కనుక్కోలేకపోతున్నామని ఫోరెన్సిక్ లేబొరేటరీ తమ నిసహాయతను తెలియజేసింది. ఓ వ్యక్తి పొరపాటు వల్ల తన జీవితం నాశనమైందని శోభ (36) వాపోయారు. గత మూడేళ్లుగా తన పిల్లలకు దూరంగా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అందరిలా నా పిల్లలు.. బయట తిరగకూడదా..! వాళ్ల అమ్మ క్యారెక్టర్ గురించి ఎవరైనా నీచంగా మాట్లాడితే వాళ్లు భరిస్తారా’ అని శోభ కన్నీటి పర్యంతం అయ్యారు. వీడియోలో ఉన్నది తాను కాకున్నా తన జీవితంలో తీవ్ర అలజడి రేగిందనీ, ఇప్పటికీ ఆ వీడియో షేర్ కాకుండా సైబర్ బ్రాంచ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని శోభ వాపోయారు. ఇదిలాఉండగా.. వీడియో వ్యవహారం ఎలా ఉన్నా.. మళ్లీ శోభను మా జీవితాల్లోకి ఆహ్వానించబోమని సాజు వెల్లడించారు. తామంతా తిరిగి కలిసేది లేదని చెప్పారు. -
ఆ విషయంలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త..
విజయవాడ : ఓ యువతి అసభ్యకర ఫొటోలను మెయిల్లో డౌన్లోడ్ చేసుకుని ఆమెను వశపరుచుకునేందుకు బ్లాక్మెయిల్ చేసిన చెన్నయ్‌కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను విజయవాడ సైబర్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ నగర జాయింట్ పోలీసు కమిషనర్ పి.హరికుమార్ వెల్లడించిన వివరాలివీ.. విజయవాడకు చెందిన ఓ యువతికి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శశిధరన్ (27) నెల రోజులుగా అసభ్యకర ఈ-మెయిల్స్ పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని.. లేదంటే తన వద్ద ఉన్న ఫొటోలను బయటపెడతానని బెదిరిస్తున్నాడు. చివరకు ఆమె నగర పోలీసు కమిషనర్‌కు తాను పడుతున్న ఇబ్బందులను ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేసింది. సీపీ గౌతం సవాంగ్ స్పందించి విజయవాడ సైబర్ సెల్ పోలీసులను విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో అనేక ఆసక్తికర అంశాలు తెలిశాయి. శశిధరన్ తన పాత్ర బయటపడకుండా ఉండేందుకు సైబర్ కిటుకులను ఉపయోగించాడు. రెడిఫ్ మెయిల్‌ను వినియోగించడంతోపాటు మెయిల్ క్రియేట్ చేసే సమయంలో తప్పుడు వివరాలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సైబర్ పోలీసింగ్ సెల్, రెడిఫ్ మెయిల్, హాట్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా నిందితుడు శశిధరన్ వినియోగించిన ఐపీ అడ్రస్, మాక్ అడ్రస్, ఇంటి చిరునామా, ప్రస్తుతం వినియోగిస్తున్న ఫోన్ నంబరు, బెంగళూరులో పనిచేసే కంపెనీ వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. విజయవాడ యువతి గత ఏడాది బెంగళూరులో నిందితుడు పనిచేస్తున్న కంపెనీలో నాలుగు నెలలు ఇంటర్న్‌షిప్ చేసినట్లు పోలీసులు వివరించారు. ఆ సమయంలో నిందితుడు బాధితురాలి జి-మెయిల్, ఫేస్బుక్ వివరాలు తీసుకుని, ఆమె పర్సనల్ ఫొటోలను గూగుల్ డ్రైవ్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు రకరకాల పట్టణాల నుంచి ఈ-మెయిల్స్ పెట్టి ఆమెను వేధించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఏడేళ్ల కిందట వినియోగించి మనుగడలో లేని ఫోన్ నంబర్‌ను మెయిల్లో ఉంచడంతో దాని ఆధారంగా అతడిని గుర్తించగలిగినట్లు పోలీసులు చెప్పారు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త అపరిచిత వ్యక్తులను నమ్మి మెయిల్ అడ్రస్‌లు ఇవ్వవద్దని జాయింట్ కమిషనర్ హరికుమార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో గుర్తుతెలియని వారితో ఫ్రెండ్షిప్ చేస్తే మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మెయిల్ ఐడీలు, ఇతర వివరాలు చెప్పవద్దని ఆయన కోరారు.